కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ జంటగా కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు మెసేజ్ ఓరియెంటెడ్ గా “ఆచార్య” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తుండగా సోనూ సూద్ , సక్సెస్ ఫుల్ యాంకర్ అనసూయ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
భారీ బడ్జెట్ తో రూపొందుతున్న “ఆచార్య “మూవీ ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. “ఆచార్య “మూవీ కై హైదరాబాద్ శివార్లలో కోకాపేట్ వద్ద భారీ టెంపుల్ టౌన్ సెట్ ను రూపొందిస్తున్నారు. 20 ఎకరాలలో రూపొందుతున్న ఈ సెట్ ఇండియా లోనే మొదటి భారీ సెట్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. టెంపుల్ టౌన్ సెట్ లో ఈ నెల 10 వ తేదీ నుండి హీరో చిరంజీవి షూటింగ్ లో పాల్గొంటారు. తరువాత హీరో రామ్ చరణ్, ఇతర నటీనటులతో కీలక సన్నివేశాలను దర్శకుడు శివ తెరకెక్కించనున్నారు. “ఆచార్య “మూవీలో తన మొదటి షూటింగ్ మొదటి షెడ్యూల్ ను కంప్లీట్ చేసిన హీరోయిన్ కాజల్ తిరిగి ఈ నెలలో మరో షూటింగ్ షెడ్యూల్ లో పాల్గొంటారు. “ఆచార్య “మూవీని సమ్మర్ కు రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























