అట్లూరి దర్శకత్వంలో నితిన్ హీరోగా ‘రంగ్ దే’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కంటే ముందే షూటింగ్ ప్రారంభించిన చిత్రయూనిట్.. కరోనా కారణంగా కొన్ని నెలలు బ్రేక్ రాగా తిరిగి సెట్స్ పైకి వచ్చింది. ఇటీవలే ఈ సినిమా కూడా షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. న్యూ ఇయర్ సందర్భంగా ఈ సినిమాను మార్చి 26వ తేదీన థియేటర్లలో విడుదల చేస్తున్నట్టు ప్రకటిస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Love, Romance & Lots of entertainment coming to theatres near you from 26th March. 💖 #RangDeOn26thMarch #RangDe @actor_nithiin @pcsreeram @thisisdsp @dirvenky_atluri @vamsi84 @sitharaents @adityamusic @SVR4446 @ShreeLyricist @NavinNooli pic.twitter.com/q3NqJXsqdD
— Keerthy Suresh (@KeerthyOfficial) January 1, 2021
కాగా ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. ఇంకా ఈ సినిమాలో సీనియర్ నటుడు నరేష్, వినీత్, రోహిణి, కౌసల్య, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, అభినవ్ గోమటం, సుహాస్, గాయత్రి రఘురామ్ తదితరులు నటిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు పి సి శ్రీరామ్ ఛాయాగ్రహణం సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు.
ఇదిలా ఉండగా భీష్మ సూపర్ హిట్ తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు నితిన్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ ప్రధాన పాత్రలో బాలీవుడ్ లో సస్పెన్స్ థ్రిల్లర్ ‘అంధాదున్’ సినిమా రీమేక్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సుధాకర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇంకా చైతన్య కృష్ణ దర్శకత్వంలో ‘పవర్ పేట’ సినిమా కూడా లైన్ లో వుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: