2020లో కరోనా వల్ల సినీ ఇండస్ట్రీకిభారీ నష్టం జరిగితే.. ఇక ఎంతో మంది సెలెబ్రిటీస్ ను కూడా బలిగొంది. చిన్న నటుల దగ్గర నుండి లెజెండరీ నటులవరకూ ఎంతో మంది మరణించారు. ఇక ఏడాది చివరి రోజు కూడా ఒక నటుడు మృతిచెందిన ఘటన చోటుచేసుకుంది. ఆ నటుడు ఎవరో కాదు ఎన్నో తెలుగు సినిమాలో నటించిన నర్సింగ్ యాదవ్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సీనియర్ నటుడు నర్సింగ్ యాదవ్ కన్నుమూశారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో సోమాజీగూడ యశోద హాస్పిటల్‌లో చేరిన నర్సింగ్ యాదవ్.. అక్కడ చికిత్స పొందుతూ గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. నిజానికి నర్సింగ్ యాదవ్ ఈ ఏడాది ఏప్రిల్ లోనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయి నట్టు తెలుస్తుంది. అప్పటి నుంచీ ఆయన కోమాలోనే ఉన్నట్టు సమాచారం. ఇక ఇన్ని రోజులు చికిత్స చేస్తుండగా పరిస్థితి విషమించడంతో మరణించారు.
ఇదిలా ఉండగా నర్సింగ్ యాదవ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రతి సినీ ప్రేక్షకుడికి అయన గురించి తెలుసు. విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన ముద్రవేశారు. విజయనిర్మల దర్శ కత్వం వహించిన ‘హేమాహేమీలు’తో ఇండస్ట్రీకి పరిచయమైన నర్సింగ్..గత 25 ఏళ్లుగా సినిమాల్లో నటిస్తూనే వున్నాడు. 300లకు పైగా సినిమాల్లో నర్సింగ్ యాదవ్ నటించారు. ఆయనకు భార్య చిత్ర, కొడుకు రిత్విక్ యాదవ్ ఉన్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: