దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్స్ సౌత్ 2020 లో టాలీవుడ్లో గెలుచుకున్న అవార్డ్స్ గురించి తెలుసుకుందాం. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని హీరోగా క్రికెట్ నేపథ్యంలో రూపొందిన స్పోర్ట్స్ డ్రామా “జెర్సీ “ప్రేక్షకాదరణ పొంది ఘనవిజయం సాధించింది. “జెర్సీ “మూవీ బెస్ట్ ఫిల్మ్ గా అవార్డ్ గెలుచుకుంది. సూపర్ హిట్ కామెడీ థ్రిల్లర్ “ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ”మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన హీరో నవీన్ పోలిశెట్టి బెస్ట్ యాక్టర్ గా ఎంపిక అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా రూపొందిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ “డియర్ కామ్రేడ్ ” మూవీ లో లవ్ , ఎమోషనల్ సీన్స్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన హీరోయిన్ రష్మిక బెస్ట్ యాక్ట్రెస్ గా , భారీ బడ్జెట్ తో స్టైలిష్ మూవీ గా తెరకెక్కించిన “సాహో”దర్శకుడు సుజీత్ బెస్ట్ డైరెక్టర్ గా , బ్లాక్ బస్టర్ “అల .. వైకుంఠపురములో .. ” వంటి మ్యూజికల్ హిట్ సినిమాకు సంగీతం అందించిన థమన్ ఎస్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా , మోస్ట్ వెర్సటైల్ యాక్టర్ గా నాగార్జున అక్కినేని అవార్డ్స్ కు ఎంపిక అయ్యారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: