వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో హిందీ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ ను తెలుగులో 'వకీల్ సాబ్' గా చేస్తున్నసంగతి తెలిసిందే కదా. ఇక ఇటీవలే వకీల్ సాబ్ చిత్రయూనిట్ కూడా షూటింగ్ ను పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లోకి అడుగుపెట్టింది.
ఇక న్యూ ఇయర్ కి ఈ సినిమా నుండి కూడా సూపర్ అప్ డేట్ ఇచ్చారు చిత్రయూనిట్. ఈ సినిమా నుండి చిత్ర యూనిట్ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బైక్ నడుపుతుండగా వెనుక శృతిహాసన్ కూర్చుని ఉంది. అంతేకాకుండా మరో సర్ ప్రయిజ్ కూడా ఇచ్చారు. ఈ సినిమా నుండి సంక్రాంతి కానుకగా టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
S@SVC_official
#VakeelSaab wishes you all a very #HappyNewYear2021
ఇక ఈ సినిమాలో నివేదా థామస్, అంజలి కీలక పాత్రల్లో నటిస్తుండగా.. బోనీ కపూర్ నిర్మాణ సంస్థ బేవ్యూ ప్రాజెక్ట్స్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ‘దిల్’ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
నిజానికి ఈ ఏడాది పవన్ ను బిగ్ స్క్రీన్ పై చూడాలనుకున్న అభిమానులకు కరోనా వల్ల ఒక రకంగా నిరాశ ఎదురైనట్టే. ఈ ఏడాది సమ్మర్ లో రిలీజ్ అవ్వాల్సిన సినిమా వచ్చే సమ్మర్ కు వెళ్ళింది. సినిమాను ఏప్రిల్ లో గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది. చూద్దాం మరి ఎం జరుగుతుందో.