కె రాఘవేంద్ర రావు దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా రూపొందిన “పెళ్ళి సందడి “(1996 ) మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గా ప్రేక్షకులను అలరించిన “పెళ్ళి సందడి “మూవీ సీక్వెల్ “పెళ్ళిసందD” మూవీ తెరకెక్కుతుంది. ఆర్కా మీడియా వర్క్స్ , ఆర్ కె ఫిల్మ్స్ అసోసియేట్స్ బ్యానర్స్ పై దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణ లో గౌరీ రోనంకి దర్శకత్వంలో హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ , మాళవిక నాయర్ జంటగా “పెళ్ళిసందD” మూవీ రూపొందుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“పెళ్ళిసందD” మూవీ షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకుంది. 8 రోజులపాటు జరిగిన ఈ షెడ్యూల్ లో కొంత టాకీ పార్ట్ , ఒక సాంగ్ కంప్లీట్ అయ్యింది. మరో షూటింగ్ షెడ్యూల్ జనవరి 27 తేదీ నుండి 12 రోజుల పాటు జరగనుంది. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన హీరో రోషన్ ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. బ్లాక్ బస్టర్ “పెళ్ళిసందడి ” మూవీ లో శ్రీకాంత్ హీరోగా నటించగా 25 సంవత్సరాల తరువాత శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా “పెళ్ళిసందD” రూపొందడం విశేషం.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: