యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా రూపొందిన పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ “జూలై 30 వ తేదీ రిలీజ్ కానుంది. హీరో ప్రభాస్ ప్రస్తుతం “ఆదిపురుష్ “మూవీ తో పాటు “సలార్ “మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1 “మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , శృతిహాసన్ జంటగా తెలుగు , కన్నడ భాషలలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “సలార్ “మూవీ 2022 సంవత్సరం ఏప్రిల్ 14 వ తేదీ రిలీజ్ కానుంది. రవి బస్రుర్ సంగీతం అందిస్తున్నారు .
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“సలార్ “మూవీ షూటింగ్ షెడ్యూల్ గోదావరి ఖని వద్ద కోల్ మైన్స్ లో జరిగిన విషయం తెలిసిందే. “సలార్ “మూవీ తరువాత షెడ్యూల్స్ కై రెండు భారీ సెట్స్ రూపొందాయి. “సలార్ “మూవీ లో బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1 “మూవీ ఫేమ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి , ప్రభాస్ తో ఒక స్పెషల్ సాంగ్ లో పాల్గొంటారని సమాచారం. శ్రీనిధి శెట్టి “కె జి ఎఫ్ చాప్టర్ 2 “మూవీ లో కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.“సలార్ “మూవీ డబ్బింగ్ వెర్షన్స్ తమిళ , మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ కానున్నాయి. “సలార్ “మూవీ పై ప్రేక్షక , అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: