‘లైగర్’ అప్ సెట్ 

Vijay Deverakonda Gets Upset As The Liger Movie Shoot Got Delayed Due To Covid19 Virus,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Vijay Deverakonda,Actor Vijay Deverakonda,Hero Vijay Deverakonda,Vijay Deverakonda New Movie,Vijay Deverakonda Latest Movie,Vijay Deverakonda Next Movie,Vijay Deverakonda Latest News,Vijay Deverakonda Liger,Liger,Liger Movie,Liger Film,Liger Telugu Movie,Liger Movie Update,Liger Movie News,Liger Movie Shooting Update,Liger Movie Shoot,Vijay Deverakonda New Movie Update,Liger Movie Shoot Got Delayed Due To Covid-19,Liger Movie Shoot Got Delayed,Vijay Deverakonda Gets Upset,Vijay Devarakonda Upset With Delay In Liger,Liger Shoot Delayed,Puri Jagan,Ananya Panday,Vijay Devarakonda's Liger Movie Shoot Got Delayed
విజయ్ దేవరకొండ సినిమా వచ్చి కూడా రెండేళ్లు అవుతుంది. 2020 లో వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా వచ్చింది.. ఆ తరువాత ఇప్పటివరకూ మరే సినిమా రాలేదు. ప్రస్తుతం పూరీ దర్శకత్వంలో లైగర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా షూటింగ్ కూడా ఎప్పుడో మొదలైంది.. అయితే గత ఏడాది కరోనా వల్ల షూట్ కు బ్రేక్ పడింది. ముంబైలో షూట్ వల్ల అక్కడి నుండి ఇక్కడికి వచ్చేయాల్సి వచ్చింది. మళ్లీ పరిస్థితులు కాస్త నార్మల్ గా రావడంతో ముంబై వెళ్లారు షూట్ కోసం. కానీ సెకండ్ వేవ్ వల్ల మళ్లీ షూటింగ్ లకు బ్రేక్ పడింది. ఫస్ట్ వేవ్ తో పోల్చుకుంటే సెకండ్ వేవ్ ఎఫెక్ట్  చాలా దారుణంగా ఉంది. మళ్లీ ఎప్పుడు షూటింగ్ లు మొదలవుతాయో కూడా తెలీదు. ఈనేపథ్యంలోనే విజయ్ దేవరకొండ చాలా అప్ సెట్ లో ఉన్నట్టు తెలుస్తుంది.
ఎందుకంటే ఇక్కడంటే పర్లేదు కానీ లైగర్ షూట్ మొత్తం ముంబైలోనే ప్లాన్ చేశారు. అక్కడ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. మళ్లీ ఎప్పుడు షూటింగ్ లు మొదలవుతాయో కూడా తెలీదు. ఇక్కడ కొంతమంది తగిన జాగ్రత్తలు తీసుకొని షూటింగ్ లను అయితే పూర్తి చేసుకుంటున్నారు. కానీ విజయ్ కు ఆ ఛాన్స్ కూడా లేకుండా పోవడంతో సినిమా ఇంకా లేట్ అవుతుండటంతో చాలా అప్ సెట్ లో ఉన్నాడట. మరి పరిస్థితులు ఎప్పుడు సాధారణ స్థితికి వచ్చి ముంబైలో షూటింగ్ లకు ఎప్పుడు అనుమతులు ఇస్తారో అప్పటివరకూ విజయ్ వెయిట్ చేయాల్సిందే.
కాగా బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. రమ్యకృష్ణ తోపాటు బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందించనున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × two =