రాజ్యసభ సభ్యులు సంతోష్‌కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను ప్రారంభించగా ఇప్పటివరకూ ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తాము మొక్కలు నాటడంతో పాటు మరికొందరిని నామినేట్ చేస్తూ.. వారు కూడా మొక్కలు నాటేలా చేస్తూ..అందరూ కలిసి విజయవంతంగా ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ముందుకు తీసుకెళుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు ఈ కార్యక్రమంలో బిగ్ బీ అమితాబ్ కూడా పాల్గొన్నారు. అమితాబ్ ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ప్రాజెక్ట్ కే అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేశారు. ఈసినిమా షూటింగ్ కోసం అమితాబ్ హైద్రాబాద్ లోనే ఉన్నారు. ప్రస్తుతం అమితాబ్ పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో అమితాబ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు. అమితాబ్ తో పాటు కింగ్ నాగార్జున కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమితాబ్, నాగ్ కలిసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా సంతోష్‌కుమార్ కలిసి మొక్కలు నాటారు.
ఇక ఈసినిమాలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రభాస్ రేంజ్‌కి తగ్గట్టుగా నిర్మాత అశ్వినీదత్ ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ రేంజ్ లో భారీ బడ్జెట్‌తో రూపొందించనున్నారు. మహానటి సినిమాకు పని చేసిన స్పానిష్ టెక్నీషియన్ డానీ సాంచెజ్ లోపెజ్ ఈ సినిమాకు కూడా సినిమాటోగ్రాఫర్‌గా పని చేయనుండగా… అలాగే మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: