విజన్ సినిమాస్ బ్యానర్ పై ఎమ్ వీరభద్రం దర్శకత్వంలో ఆది సాయికుమార్ , పాయల్ రాజ్ పుత్ జంటగా క్రైమ్ థ్రిల్లర్ “కిరాతక” మూవీ రెగ్యులర్ షూటింగ్ ఆగస్ట్ 13 వ తేదీ ప్రారంభం కానుంది. పూర్ణ, దాసరి అరుణ్‌కుమార్, దేవ్‌గిల్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. హీరోయిన్ పూర్ణ ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్న ఈ మూవీ కి సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. “కిరాతక “ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఆ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ముగించుకున్న “కిరాతక “మూవీ రెగ్యులర్ షూటింగ్ ఆగస్ట్ 13 నుంచి ప్రారంభం కాబోతున్నట్లుగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. హీరో ఆది, దర్శకుడు వీరభద్రమ్‌ల కాంబినేషన్‌లో ఒక పర్‌ఫెక్ట్ క్రైమ్ థ్రిల్లర్ సబ్జెక్ట్‌తో వస్తోన్న చిత్రమిదనీ , .మేకింగ్ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా టెక్నికల్‌గా హైస్టాండర్డ్స్‌లో నిర్మించబోతున్నామనీ , . ఆగస్ట్13 నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తామనీ తెలిపారు. దర్శకుడు ఎమ్. వీరభద్రమ్ మాట్లాడుతూ.. ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తయ్యిందనీ , .”కిరాతక” టైటిల్‌తో పాటు ఆది సాయికుమార్, పాయల్ రాజ్‌పూత్ కాంబినేషన్‌కి మంచి రెస్పాన్స్ వచ్చిందనీ , .వాళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ తప్పకుండా ఆకట్టుకుంటుందనీ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: