టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ “బ్లఫ్ మాస్టర్” మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయ్యారు. “ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య ” మూవీలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి సత్యదేవ్ ప్రేక్షకుల , విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. సత్యదేవ్ ప్రస్తుతం “గుర్తుందా శీతాకాలం “ , “గాడ్సే ” , “స్కైలాబ్ “మూవీస్ లో కథానాయకుడిగా నటిస్తున్నారు. “రామ్ సేతు”హిందీ మూవీలో సత్యదేవ్ ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారు.. “లూసిఫర్ “తెలుగు రీమేక్ మూవీ లో సత్యదేవ్ ఒక కీలక పాత్రకు ఎంపిక అయినట్టు సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
శరన్ కొప్పిశెట్టి దర్శకత్వంలో సత్యదేవ్ హీరోగా “తిమ్మరుసు “మూవీ ఈ రోజు(30వ తేదీ ) రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తో సూపర్ హిట్ దిశగా దూసుకుపోతోంది. తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో సత్యదేవ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.ఎన్టీఆర్ చేతుల మీదుగా ట్రైలర్ విడుదల అవ్వడం, హీరో నాని సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రావడం ఈ మూవీకి ప్లస్ అయ్యింది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్స్ లో రిలీజ్ అయిన మొదటి సినిమా “తిమ్మరుసు ” కావడం విశేషం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా ట్రైలర్ విడుదల కావడం తో “తిమ్మరుసు “మూవీ ట్రైలర్ కు భారీగా వ్యూస్ తో పాటు మూవీ పై మంచి స్పందన కూడా లభించింది. తారక్ అన్న చేతుల మీదుగా ట్రైలర్ విడుదల కావడం వల్ల అంతగా భారీగా వ్యూస్ వచ్చాయనీ , . ఆ క్రెడిట్ అంతా కూడా తారక్ అన్నదే అనీ సత్యదేవ్ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




































