తెలుగు ,తమిళ భాషల “విరాట్టు “మూవీ తో మోడల్ ప్రగ్య జైస్వాల్ టాలీవుడ్ , కోలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు.“కంచె “, “గుంటూరోడు “, “జయ జానకి నాయక “వంటి మూవీస్ లో ప్రగ్య జైస్వాల్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. “కురుక్షేత్ర ” మూవీ తో కన్నడ చిత్రపరిశ్రమకు పరిచయం అయిన ప్రగ్య జైస్వాల్ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ ” మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. బాలీవుడ్ మూవీ “అంతిమ్ :ది ఫైనల్ ట్రూత్ ” లో ప్రగ్య కథానాయికగా నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కరోనా లాక్‌డౌన్ విరామం గురించి ప్రగ్య జైస్వాల్ మాట్లాడుతూ .. విరామం వల్ల తన జీవితంలో ఎన్నో సానుకూల మార్పులు చోటుచేసుకున్నాయనీ , వర్తమానంలో జీవించడం ఎలాగో నేర్చుకున్నాననీ , లాక్‌డౌన్ వల్ల జీవితంలో ఏది మనకు ముఖ్యమో విశ్లేషించుకునే అరుదైన అవకాశం దక్కిందనీ , వర్కవుట్స్ మీద పూర్తిగా దృష్టిపెట్టడంతో పాజిటివ్ దృక్పథం అలవడిందనీ, ఇప్పుడు తాను గతంలో కంటే ఎంతో సంతోషంగా ఉన్నాననీ , “అఖండ ” మూవీ లో దర్శకుడు బోయపాటి , హీరో బాలకృష్ణ లతో వర్క్ అద్భుతం అనీ , ఈ సినిమాలో తన పాత్ర కేవలం గ్లామర్‌కే పరిమితం కాదనీ , కథపరంగా అభినయానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుందనీ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.