రాజావారు రాణిగారు, ఎస్ ఆర్ కల్యాణమండపం సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. అంతేకాదు ఈ రెండు సినిమాలతోనే పెద్ద పెద్ద నిర్మాణ సంస్థల్లో సైతం అవకాశం దక్కించుకున్నాడు. ప్రస్తుతం అయితే పలు సినిమాల్లో బిజీగా ఉండగా అందులో సెబాస్టియన్ సినిమా కూడా ఒకటి. బాలాజీ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుండగా తాజాగా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఫిబ్రవరి 25న ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ అధికారికంగా తెలిపారు. ఇక ఇక్కడి వరకూ బాగానే ఉన్నా అదే రోజు పవర్ స్టార్ భీమ్లానాయక్ సినిమా కూడా వచ్చే అవకాశం ఉంది. భీమ్లానాయక్ కోసం రెండు రిలీజ్ డేట్లను ఫిక్స్ చేసుకోగా అందులో ఇది ఒకటి. ఈ నేపథ్యంలో ఒక నెటిజన్.. ఫిబ్రవరి 25న ‘భీమ్లా నాయక్’ విడుదల ఉందని మీకు తెలియదా భయ్యా.. ఆరోజే మీ ‘సెబాస్టియన్ పి సి 524′ ను రిలీజ్ చేస్తున్నారు. మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని ఎన్నో సార్లు చెప్పారు.. ఏంటి భయ్యా ఇది అంటూ అడుగగా దానికి కిరణ్ కూడా స్పందించి.. నేను మీకంటే కాస్త ఎక్కువగానే ‘భీమ్లా నాయక్’ కోసం ఎదురు చూస్తున్నాను.. ఆరోజు నా సినిమా విడుదల అయినా కూడా.. నేను పవర్ స్టార్ సినిమాకే మొదటి షోకి వెళతాను.. ఫస్ట్ షో రచ్చ ఆయన మూవీ తోనే’.. అని రిప్లై ఇచ్చాడు.
Feb 25th #BheemlaNayak Release undi ani telida bhayya?? Aa date ki ela vastunav? Nuv PK fan ani enni sarlu cheppinav? Endi bhayya idi?? @Kiran_Abbavaram
— Anonymous (@thorrrrrr_) February 1, 2022
ఇక ఈసినిమాలో నమ్రత దరేకర్, కోమలి ప్రసాద్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రమోద్ మరియు రాజు ఈసినిమాను నిర్మిస్తుండగా.. తెలుగు ఇంకా తమిళ్ లో కూడా ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు. మరి భీమ్లానాయక్ కోసం ఫిబ్రవరి 25, ఏప్రిల్ 1 డేట్లు ఫిక్స్ చేశారు. ఆరోజు కనుక భీమ్లానాయక్ రిలీజ్ కాకపోతే కిరణ్ కు కాస్త కలిసొచ్చినట్టే .మరి చూడాలి ఏం జరుగుతుందో.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: