ప్రస్తుతం కరోనా థర్డ్ వేవ్ ప్రభావం ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే కదా. అందుకే సినీ పరిశ్రమలో మళ్లీ ఇబ్బందులు మొదలయ్యాయి. ఇప్పటికే చాలా సినిమాల రిలీజ్ లు వాయిదా పడ్డాయి. అయితే ఈనెల నుండి మళ్లీ వాయిదా పడిన సినిమాల తేదీలను మళ్లీ చిత్ర యూనిట్లు కొత్త రిలీజ్ డేట్లను ఫిక్స్ చేసుకొని విడుదల తేదీలను ప్రకటిస్తున్నారు. ఇక కొన్ని సినిమాలు ఒక్క డేట్ నే ఫిక్స్ చేసుకుంటే.. ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియక కొన్ని సినిమాలు మాత్రం రెండు తేదీలను ప్రకటిస్తున్నారు. అందులో భీమ్లానాయక్, గని, రవితేజ రామారావు ఆన్ డ్యూటీ సినిమాలు కూడా ఉన్నాయి. ఇక ముందు ముందు ఎన్ని సినిమాలు వస్తాయో చెప్పలేం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా తాజాగా రామారావు ఆన్ డ్యూటీ సినిమా డైరెక్టర్ శరత్ మండవ దీనిపై స్పందించి రెండు రిలీజ్ డేట్లను ఎందుకు ఫిక్స్ చేసుకోవాల్సి వచ్చిందో చెబుతున్నాడు. తాజాగా తెలుగు సినిమాలు రెండు రిలీజ్ డేట్లను ఎంపిక చేసుకోవడంతో కొంతమంది బాలీవుడ్, కోలీవుడ్ క్రిటిక్స్ విమర్శిస్తున్న నేపథ్యంలో దీనిపై శరత్ మండవ మాట్లాడుతూ.. ఛాయిస్ లేదు అందుకే రెండు రిలీజ్ డేట్లు.. పాండమిక్ ఉన్నా.. అనేక ప్రెషర్స్ ఉన్నా.. మేము సినిమాకోసం రాత్రింబవళ్లు చాలా కష్టపడుతున్నాం అంటూ సమాధానమిచ్చాడు. దీంతో శరత్ ఇచ్చిన కౌంటర్ ను పలువురు అభినందిస్తున్నారు.
కాగా శరత్ మండవ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని ఎస్ఎల్వీ సినిమాస్, ఆర్టీ టీం వర్క్స్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. షూటింగ్ తుది దశకు చేరుకున్న ఈ సినిమాను మార్చి 25న లేదా ఏప్రిల్ 15న విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఈసినిమాకు శ్యామ్ సీఎస్ సంగీతం అందిస్తుండగా సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























