‘మహాన్’ ట్రైలర్ రిలీజ్

Vikrams Mahaan Movie Trailer Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Vikrams Mahaan Movie,Vikrams Mahaan Movie Updates,Vikrams Mahaan Movie Latest News,Vikrams Mahaan Upcoming Movies,Vikrams Mahaan Movie Trailer Updates,Vikrams Mahaan Movie Trailer Out Now, Vikrams Mahaan Trailer Released Now,Dhruv Vikram and Chiyaan Vikram Movie Mahaan,Dhruv Vikram and Chiyaan Vikram Movie Mahaan Trailer Update,Dhruv Vikram and Chiyaan Vikram Movie Mahaan New Movie Mahaan, Dhruv Vikram and Chiyaan Vikram Movie Mahaan Movie News,Chiyaan Vikram Movie Mahaan in OTT,Chiyaan Vikram Movie Mahaan In Amazon Prime,Chiyaan Vikram Movie Mahaan On Feb 10th on Amazon Prime, Chiyaan Vikram Movie Mahaan Will Release in Amazon Prime,Karthik subbaraj,Karthik subbaraj New Movie Mahaan,Karthik subbaraj,Director Karthik subbaraj Movie Mahaan #MahaanOnPrime,#DhruvVikram,#Karthiksubbaraj

విభిన్నమైన కథలను ఎంచుకోవడంలో తమిళ్ స్టార్ హీరో విక్రమ్ ఎప్పుడూ ముందుంటాడు. పాత్ర డిమాండ్ చేస్తే ఎంత వరకైనా వెళ్లి పాత్రలో పరకాయ ప్రవేశం చేయగలిగే నటుడు ఆయన. ఇక ప్రస్తుతం మరో డిఫరెంట్ కథతో రాబోతున్నాడు. కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్‌లో ఈసినిమా వస్తుండగా తెలుగులో మహాన్ అనే పేరుతో రిలీజ్ అవుతుంది. ఈసినిమాతో మొదటిసారి విక్రమ్, ధృవ్ ఇద్దరూ కలిసి స్క్రీన్ పై సందడి చేయనున్నారు. దీంతో ఫ్యాన్స్ కూడా ఈసినిమాకోసం ఆసక్తిగా ఎదురుచూస్తుండటంతో పాటు ఈ మూవీని ఫ్యాన్స్ అంతా థియేట‌ర్‌లో చూడాల‌నుకున్నారు. కానీ వారిని నిరాశ పరుస్తూ ఈసినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్‌ వేదికగా విడుదల చేయనున్నారు. ఫిబ్రవరి 10న ఈ సినిమా ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక సినిమా రిలీజ్ తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచారు. దీనిలో భాగంగానే ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్ రావడమే కాదు సినిమాపై అంచనాలు కూడా పెరిగాయి.. ఇప్పుడు తాజాగా ఈసినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

కాగా ఈసినిమాలో వాణి భోజన్, సిమ్రాన్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. బాబీ సింహా, సనంత కీలక పాత్రలలో నటిస్తున్నారు. సెవన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో ఈసినిమాను రిలీజ్ చేస్తుండగా.. కన్నడలో మహా పురుష పేరుతో ఈసినిమాను రిలీజ్ చేస్తున్నారు మేకర్స్.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.