పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాల్లో హరిహర వీరమల్లు కూడా ఒకటి. ఈసినిమా భీమ్లానాయక్ సినిమా కంటే ముందే మొదలు పెట్టినా కూడా కరోనా వల్ల గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ లో పవన్ కళ్యాణ్ భీమ్లానాయక్ సినిమా పూర్తి చేశాడు. ఇక ఇప్పుడు హరి హర వీరమల్లు సినిమాను స్టార్ట్ చేయడానికి ప్లాన్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. క్రిష్ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమా షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా పూర్తయిన సంగతి తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈసినిమా నుండి మరో క్రేజీ అప్ డేట్ వచ్చింది. ఈ సినిమాలో గ్రాండ్ విజువల్స్ తో పాటు యాక్షన్ సన్నివేశాలు చాలా భారీ లెవెల్లో ప్లాన్ చేశాడట క్రిష్. ఈనేపథ్యంలో తాజా షెడ్యూల్ భారీ యాక్షన్ ఎపిసోడ్ తో మొదలుకానున్నట్టు సమాచారం. దానికోసం క్రిష్ ప్రముఖ స్టంట్ మాస్టర్ షామ్ కౌశల్ తో చర్చలు జరిపారట. ఈ విషయాన్ని షామ్ కౌషల్ తన ట్విట్టర్ ద్వారా తెలియచేశారు. ఒక ఫోటో షేర్ చేసి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లో హరి హర వీరమల్లు నెక్స్ట్ షూటింగ్ షెడ్యూల్ లో భారీ యాక్షన్ సీక్వెన్స్ ని ప్లాన్ చేస్తున్నాము. దానిపై బ్రిలియెంట్ డైరెక్టర్ క్రిష్ తో మాట్లాడటం జరిగింది. పవన్ కళ్యాణ్ సర్ కి, నిర్మాత ఏ.ఎమ్ రత్నం గారికి ధన్యవాదాలు. ఆ దేవుని ఆశీస్సులు మా సినిమాపై మరియు టీంపై ఉండాలని కోరుకుంటున్నాను అని పోస్ట్ చేశారు.
Discussions on with brilliant director & a very nice human being @DirKrish for the next action schedule of HARI HARA VEERA MALLU with Pawan Kalyan Sir. Produced by Mr. A M Ratnam. May God bless our film & the team. 🙏🏻🙏🏻 pic.twitter.com/6msOv0onSx
— Sham kaushal (@shamkaushal09) February 2, 2022
కాగా ఈసినిమాలో పవన్ కళ్యాణ్‌కు జోడీగా నిధి అగర్వాల్ నటిస్తుండగా.. అర్జున్ రాంపాల్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం తన మెగా సూర్యా ప్రొడక్షన్ బ్యానర్‌పై ఈ సినిమాను సమర్పిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు యం.యం.కీరవాణి సంగీతం అందిస్తుండగా.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ జ్ఞాన శేఖర్ వి.ఎస్. సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: