హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు విశాల్. రీసెంట్ గా ఎనిమి సినిమాతో ప్రేక్షకులను అలరించిన విశాల్ ఇప్పుడు సామాన్యుడిగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రస్తుతం శరవణన్ దర్శకత్వంలో విశాల్ హీరోగా వస్తున్న సినిమా సామాన్యుడు. ఈసినిమా కూడా రిలీజ్ కు సిద్దంగా ఉంది. నిజానికి ఈసినిమా కూడా ఎప్పుడో రిలీజ్ కావాలి. సంక్రాంతి బరి నుండి తప్పుకున్న ఈసినిమా రిపబ్లిక్ డేకు వస్తుందని అప్పట్లో మేకర్స్ ప్రకటించారు. అయితే పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఆ తేదీన కూడా ‘సామాన్యుడు’ సినిమా విడుదల కాలేదు. అయితే రీసెంట్ గానే ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు ఫిబ్రవరి 4న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పటికే ఈసినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఈసినిమా నుండి ఇప్పటికే పలు పోస్టర్లు, టీజర్, ట్రైలర్ ను రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఈసినిమా స్నీక్ పీక్ పేరుతో మరో వీడియోను రిలీజ్ చేశారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: