కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Latest Tollywood News

ట్యాగ్ · 4439 కథనాలు · పేజీ 159

ఫస్ట్ లుక్

ప్రభాస్ 'రాధే శ్యామ్' ఫస్ట్ లుక్ పై అనుష్క స్పందన..!

ప్రభాస్20.. ప్రభాస్20.. గత రెండు ఏళ్లుగా ఇదే అంటున్నాం.. కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు. ప్రభాస్ 'రాధే శ్యామ్' అని అనొచ్చు. బాహుబలి1, బాహుబ‌లి2 , సాహో వంటి పాన్ ఇండియా చిత్రాలతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా క్రేజ్ ని సొంతం చేసుకున్న ప్ర‌భాస్ త‌న 20 వ చిత్రాన్ని జిల్ చిత్ర ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వం లో తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే యూర‌ప్ లో కీల‌క స‌న్నివేశాలు చిత్రీకరణ జరుపుకొంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

వెబ్ సిరీస్ లో ప్రకాష్ రాజ్

మూడు దశాబ్దాలుగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషల పలు సూపర్ హిట్ మూవీస్ లో విలన్ , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ ప్రకాష్ రాజ్ ప్రేక్షకులను అలరిస్తున్నారు. బెస్ట్ విలన్ , యాక్ట ర్ , సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా పలు అవార్డ్స్ అందుకున్నారు. నటుడే కాదు నిర్మాత , దర్శకుడు , టీవీ ప్రెజెంటర్ , పొలిటీషియన్ ప్రకాష్ రాజ్ ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫారం కు ఎంటర్ అవుతున్న్నారు. ఒక వెబ్ సిరీస్ లో ప్రధాన పాత్రకు ప్రకాష్ రాజ్ ఎంపిక అయ్యారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

పూజాహెగ్డే ధనురాసనం

సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్న పూజాహెగ్డే ప్రస్తుతంప్రభాస్ హీరోగా రూపొందుతున్న "రాధేశ్యామ్ ", అఖిల్ అక్కినేని హీరోగా రూపొందుతున్న "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ " మూవీస్ లో నటిస్తున్నారు. రెండు బాలీవుడ్ మూవీస్ లో పూజాహెగ్డే కథానాయిక గా ఎంపిక అయ్యారు. లాక్ డౌన్ సమయం లో పూజాహెగ్డే సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'శివ' సినిమాలో చైన్.. 'పవర్ స్టార్' లో టీ గ్లాస్

'పవర్ స్టార్' టైటిల్ తో వర్మ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల తర్వాత జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశాడు. ఫస్ట్ లుక్ ఏంటి ఇప్పటికే చాలా పోస్టర్ లు రిలీజ్ చేసాడు. ఇక తాజాగా మరో పోస్టర్ ను రిలీజ్ చేసిన వర్మ ఓ చిన్న క్లారిటీ కూడా ఇస్తున్నాడు. పవర్ స్టార్‌ లోగోలో టీ గ్లాస్‌ ఉంచాం.. ఎందుకంటే ఇందులో హీరో పదేపదే టీ తాగుతాడు. అంతేకానీ, ఇది ఏ రాజకీయ విషయాలకు సంబంధించినది కాదు. శివ సినిమా లోగోలో నేను సైకిల్‌ చైన్ ఉపయోగించాను.. ఎందుకంటే ఆ సినిమాలో హీరో పదే పదే దానితో రౌడీలను కొడతాడు.. అంతే..' అని చెప్పారు. ఈ సినిమాలో…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

సోషల్ మీడియా పై లావణ్య త్రిపాఠి స్పందన

సోషల్ మీడియా మానవ సంబంధాలకు ప్రతీక , తమ జీవిత విశేషాలను ఇతరులతో పంచుకొనే వేదిక. ఆ వేదిక ను కొంతమంది నెగటివ్ కామెంట్స్ , ట్రోల్స్ తో ఉపయోగించుకుంటూ సెలబ్రిటీస్ ను విచారానికి గురిచేస్తున్నారు. నెగటివిటీ ని వదిలి పాజిటివ్ గా ప్రజలకు సందేశాలు ఇచ్చి సోషల్ మీడియా ద్వారా ప్రోత్సహించవచ్చు. ఈ సందర్భంగా సోషల్ మీడియా పై లావణ్య స్పందించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

రకుల్ ప్రీత్ వేగనిజం ప్రమోషన్

తెలుగు , తమిళ , హిందీ భాషా చిత్రాలతో ప్రేక్షకులను ఆలరిస్తూ రకుల్ ప్రీత్ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. రకుల్ ప్రీత్ కొన్ని నెలల క్రితం శాకాహారి (వేగన్ ) గా మారిన విషయం తెలిసిందే. వరల్డ్ ఎన్విరాన్ మెంట్ రోజున "PETA " సంస్థతో చేతులు కలిపి వేగనిజం ను రకుల్ ప్రమోట్ చేస్తున్నారు. శాకాహారం వలన పలు ప్రయోజనాలు ఉన్నాయి. బరువు నియంత్రణ , కిడ్నీ ఫంక్షనింగ్ , కొన్ని రకాల కేన్సర్స్ ను అడ్డుకొనడం , హార్ట్ డిసీజెస్ ను దూరం చేయడం, ఆర్థరైటిస్ నొప్పులు తగ్గించడం వంటి ఉపయోగాలు ఉన్నాయి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

శ్రద్ధ సూటి ప్రశ్న - పెళ్లయ్యాక హీరోయిన్‌కి డిమాండ్‌ తగ్గుతుందా..?

పెళ్లయ్యాక హీరోయిన్‌కి డిమాండ్‌ తగ్గుతుందా..?ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కాస్త కష్టమే. ఎందుకంటే ఒకప్పుడు పాతతరం హీరోయిన్స్ లో చాలా మంది పెళ్లి అయిన తర్వాత కూడా ఎన్నో సినిమాల్లో నటించారు. అంతెందుకు మహానటి సావిత్రి కూడా సినీ రంగంలోకి అడుగుపెట్టిన తొలినాళ్లలోనే పెళ్లి చేసుకుంది. పెళ్ళైన తర్వాతే మాయాబజార్ లాంటి ఆల్ టైం క్లాసిక్ సినిమాలో నటించింది. సావిత్రి సినీ ప్రయాణంలో పెళ్ళికి ముందు - పెళ్ళి తర్వాత అనే బేధాలు లేవు. ఇక అంజలీ దేవి అయితే పెళ్ళైన తర్వాతనే సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఇంకా ఎంతో మంది పాతతరం హీరోయిన్స్ పెళ్ళైన తర్వాత కూడా రాణించారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

సిక్స్ ప్యాక్ మళ్ళీ సిద్ధం - నిఖిల్

సక్సెస్ ఫుల్ "హ్యాపీ డేస్ " మూవీ తో లీడ్ రోల్ లో టాలీవుడ్ కు పరిచయం అయిన నిఖిల్ "యువత ", "స్వామి రారా ", "కార్తికేయ ", "ఎక్కడికి పోతావు చిన్నవాడా ", "అర్జున్ సురవరం " వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. నిఖిల్ ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో సూపర్ హిట్ "కార్తికేయ " మూవీ సీక్వెల్ "కార్తికేయ 2", పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో "18 పేజెస్ " మూవీస్ లో నటిస్తున్నారు. కరోనా కారణంగా ఆ మూవీస్ షూటింగ్స్ నిలిచిపోయాయి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

"రాధే శ్యామ్ " మూవీ లో ఎయిర్ టెల్ బ్యూటీ ?

"కట్టీ బట్టీ " బాలీవుడ్ మూవీ లో చిన్న పాత్రలో నటించిన సాషా ఎయిర్ టెల్ యాడ్ లో నటించి ఓవర్ నైట్ సెన్సేషన్ క్రియేట్ చేసి జాతీయ స్థాయి లో గుర్తింపు పొందారు. కాన్ఫిడెంట్ తో , స్టైలిష్ గా ఉండే సాషా "ఆపరేషన్ గోల్డ్ ఫిష్ " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. సాషా ఇప్పుడు ప్రభాస్ మూవీ " రాధే శ్యామ్ " కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'మిడిల్ క్లాస్ మెలోడీస్‌' గా వస్తున్న ఆనంద్ దేవరకొండ..!

విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీకి పరిచయమై మొదటి సినిమాతో మంచి మార్కులు కొట్టేసాడు ఆనంద్ దేవరకొండ. వచ్చీ రాగానే ఫైట్స్, మాస్ ఎలిమెంట్స్ అని కాకుండా పాత్ర ప్రధానమైన కథను ఎంచుకున్నాడు. ఆనంద్‌ దేవరకొండ, శివాత్మిక రాజశేఖర్ హీరో హీరోయిన్లుగా డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన దొరసాని సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ అయినప్పటికీ నటినటులుగా ఇద్దరికీ మంచి పేరు వచ్చింది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

కన్ఫ్యూజన్ లో చరణ్ - హార్ట్ ఒకటి చెపుతుంది.. మైండ్ ఒకటి చెపుతుంది..!

మొత్తానికి రామ్ చరణ్ కన్ఫ్యూజన్ లో పడ్డాడు. ఇంతకీ ఏ విషయంలో అనుకుంటున్నారా..? అసలు సంగతేంటంటే లాక్ డౌన్ లో షూటింగ్స్ లేక సెలెబ్రిటీస్ అందరూ ఇంటికే పరిమితమయ్యారు. ఏదో ఒకటి రెండు నెలలు మాత్రమే ఉంటుంది అనుకున్నారు కానీ ఇన్ని రోజులు ఈ కరోనా వల్ల బ్రేక్ వస్తుంది అని మాత్రం ఊహించలేదు. ఇక షూటింగ్స్ లేవు కాబట్టి ఇంట్లోనే కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేస్తున్నారు. అయితే షూటింగ్ లేదు కదా అని వర్కౌట్స్ చేయకుండా ఉంటే కుదరదు కదా. షూటింగ్ ఉన్నా లేకపోయినా అవి మాత్రం హీరో హీరోయిన్స్ చేయాల్సిందే. చేయపోతే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఎంత హీరో హీరోయిన్స్ అయినా వాళ్ళకి కూడా అప్పుడప్పుడు బద్ధకం…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

బయో ఎంజైమ్స్ రెడీ చేస్తున్న సమంత

స్టార్ హీరోయిన్ సమంత లాక్ డౌన్ సమయంలో యోగా , మెడిటేషన్, ఆర్గానిక్ కూరగాయలు పండిస్తూ , సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ తన జీవిత విశేషాలను అభిమానులతో పంచుకుంటూ , తన పెట్ డాగ్ హ్యాష్ తో ఆడుకుంటూ టైమ్ స్పెండ్ చేస్తున్నారు. సమంత ఇప్పుడు బయో ఎంజైమ్స్ తయారీ నేర్చుకున్నారు.

Team TFNవాట్సాప్
5 Years for India's Biggest Blockbuster Baahubali
సినిమా వార్తలు

5ఏళ్ల బాహుబలి.. ఎన్నో రికార్డులు ..!

తెలుగు సినీ చరిత్రలో బాహుబలి సిరీస్ ఒక కొత్త అధ్యయనాన్ని లిఖించిందని చెప్పడంలో సందేహం లేదు. రాజమౌళి ఎంతో జాగ్రత్తగా చెక్కిన శిల్పమే ఈ బాహుబలి. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ,నాజర్, సత్యరాజ్‌ వంటి ప్రధాన పాత్రలతో రాజమౌళి తెరకెక్కించిన ’బాహుబలి’ భారతీయ సినీ చరిత్రలోనే గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈ సినిమా మొదటి పార్ట్ విడుదలై నేటితో 5 ఐదేళ్లు పూర్తి చేసుకుంది. భారీ సెట్టింగులు, అదిరిపోయే విజువల్ ఎఫెక్ట్స్, ఆకట్టుకునే కథ, కథనాలు, రాజమౌళి మార్క్ టేకింగ్, సంగీత దర్శకుడు కీరవాణి సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వంటివి ఈ సినిమా సక్సెస్ కు ప్రధాన కారణాలు.

TFN Adminవాట్సాప్
ఫస్ట్ లుక్

'ప్రభాస్20' ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజ్..!

ఎప్పుడైతే ఫస్ట్ లుక్, టైటిల్ ను రిలీజ్ చేస్తున్నామని ప్రభాస్20 టీమ్ చెప్పారో ఆ రోజు నుండే అభిమానులు కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు. ఎప్పుడు జులై 10.. 10 గంటలు అవుతుందా... ఎప్పుడు ఫస్ట్ లుక్ చూసేద్దామా అనిఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పుడు ఆ టైమ్ రానే వచ్చేసింది. ప్రభాస్ 20 సినిమా టైటిల్ ను ఫస్ట్ లుక్ ను యూవీ క్రియేషన్స్ తమ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేశారు. ఇక ఎప్పటినుండో అనుకున్నట్టే ఈ సినిమాకు 'రాధే శ్యామ్' అనే టైటిల్ నే ఫిక్స్ చేశారు.

TFN Adminవాట్సాప్
Today's Movie Feature Article: Annamayya
సినిమా వార్తలు

మూవీ ఫీచర్ ఆర్టికల్: "అన్నమయ్య "

15 వ శతాబ్దపు స్వరకర్త అన్నమాచార్య జీవిత చరిత్ర ఆధారంగా కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో నాగార్జున అక్కినేని హీరోగా రూపొందిన బయోగ్రాఫికల్, డివోషనల్ మూవీ "అన్నమయ్య " 1997 సంవత్సరం మే 22 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మోహన్ బాబు , సుమన్ , రమ్యకృష్ణ , రోజా , భానుప్రియ , కస్తూరి , బ్రహ్మానందం వంటి భారీ తారాగణం తో తెరకెక్కిన "అన్నమయ్య " మూవీ కి కీరవాణి సంగీతం అందించారు. కీరవాణి స్వరపరిచిన సాంగ్స్ ప్రేక్షకులను వీనుల విందు చేశాయి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

సక్సెస్-ఫెయిల్యూర్ ను నేను పట్టించుకోను..!

బాలీవుడ్ భామ అదితి రావు హైదరి ఇప్పుడు తెలుగు, తమిళ్, మలయాళం లో వరుస సినిమాలు చేసుకుంటూ బిజీ హీరోయిన్ అయిపోయింది. సమ్మోహనం సినిమాతో టాలివుడ్‌లో అరంగేట్రం చేసిన అదితి రావు హైదరి మొదటి సినిమాకే ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నది. తరువాత అంతరిక్షం సినిమాలో నటించింది అయితే ఆ సినిమా అంత సక్సెస్ కాలేదు కానీ అదితి కి మాత్రం ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో ఇంద్రగంటి దర్శకత్వంలో నాని, సుదీర్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న వి సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న హీరోయిన్ పాత్రలో నటిస్తుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

నా జీవితంలో '3 ఎఫ్' లు..!

తన జీవితం మూడు ఎఫ్ లతో ముడిపడి ఉందని చెపుతుంది రకుల్ ప్రీత్ సింగ్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రకుల్ తన సినీ రంగ ప్రవేశం గురించి... తనకు ఎలాంటి అబ్బాయి కోసం చూస్తుందో ఇలా పలు ఆసక్తికర విషయాలు తెలిపింది. ఒక మనిషిగా నేను కూడా మారుతుంటాను.. నా దృష్టిలో ప్రేమ అంటే అర్ధం నేను మా పేరెంట్స్ లో చూసేదే.. ప్రేమ, పెళ్లి పై నాకు పూర్తి నమ్మకం వుంది.. కొంతం మంది వాటి వల్ల ప్రెషర్ అంటారు అర్ధంకాదు.. నాకు తెలిసి ప్రేమ, పెళ్లి అనేవి చాలా గొప్పగా వుంటాయని అనుకుంటున్నాను.. నావరకునేనైతే ఎవరినైనా ప్రేమిస్తే హార్ట్ ఫుల్ గా ప్రేమిస్తా అని చెప్పుకొచ్చింది. అంతే కాదు తనకంటే పొడవు.. తను హీల్స్ వేసుకున్నా సరే…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మొన్న బుక్.. నేడు వెబ్ సిరీస్..!

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ లాక్‌డౌన్ స‌మ‌యంలో పిల్ల‌ల‌తో స‌ర‌దాగా స‌మ‌యాన్ని గ‌డుపుతున్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా పుస్త‌కాలు కూడా చ‌దువుతూ కాలక్షేపం చేస్తున్నాడు. మొన్నామధ్య 'ఎమోషనల్ ఇంటెలిజన్స్' పుస్తకం చదవమని మహేష్ సూచించిన సంగతి తెలిసిందే. 'ఎమోషనల్ ఇంటెలిజన్స్.. సైంటిఫిక్ .. సంచలనాత్మకం.. అందరూ చదవాల్సిన పుస్తకం. ఇక ఈ వారం అంతా డానియల్ గోల్ మెన్ కే కేటాయిస్తున్నా..' అంటూ తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ఇక ఇప్పుడు వెబ్ సిరీస్ చూడమని చెపుతున్నాడు. ‘డార్క్‌’ అనే పేరుతో తెర‌కెక్కిన జ‌ర్మ‌న్ వెబ్ సిరీస్‌ను చూశాన‌ని, ర‌చ‌న‌, దాన్ని తీసిన తీరు అత్య‌ద్భుతంగా ఉన్నాయ‌ని మ‌హేశ్ తెలిపారు. అంతే కాకుండా ఈ…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఇన్ స్టా గ్రామ్ లో త్రిష సెల్ఫీ

టాలీవుడ్ , కోలీవుడ్ లలో 2దశాబ్దాలుగా పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్న త్రిష స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. పలు మూవీస్ కు త్రిష బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డ్స్ అందుకున్నారు. లాక్ డౌన్ సమయం లో ఒక షార్ట్ ఫిల్మ్ లో నటించిన త్రిష ప్రస్తుతం 6 తమిళ మూవీస్ లో నటిస్తున్నారు. స్టార్ హీరోయిన్ త్రిష ఇప్పుడు ఒక తమిళ వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఆర్జీవీ 'పవర్ స్టార్'.. పవన్-చిరు ఒకే ఫ్రేమ్ లో..!

ప్రకటించిన సినిమాలన్నీ రిలీజ్ కు నోచుకుంటాయో..లేదో..తెలియదు కానీ వారానికో సినిమాను ప్రకటిస్తున్నాడు వర్మ. అదేం విచిత్రమో కానీ అందరూ లాక్ డౌన్ వల్ల షూటింగ్ కు వెళ్లాలంటేనే భయపడుతుంటే.. వర్మ మాత్రం ఎప్పుడు షూటింగ్ తీస్తున్నాడో తెలియదు కానీ ఫస్ట్ లుక్ లు, టీజర్ లు, ట్రైలర్ లు రిలీజ్ చేస్తూ అందరికీ షాకిస్తున్నాడు. ఇప్పటికే నాలుగైదు సినిమాలు ప్రకటించిన వర్మ రెండు రోజుల క్రితం ''పవర్ స్టార్' అనే సినిమాను తీయనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక అలా ప్రకటించాడో లేదో అప్పుడే ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేసాడు. ఫస్ట్ లుక్ విడుదల చేసి దానితో పాటు వర్మ పోస్టర్ పై ఎన్నికల తరువాత కథ అని, సినిమా…

TFN Adminవాట్సాప్

షేర్