ప్రభాస్ ‘రాధే శ్యామ్’ ఫస్ట్ లుక్ పై అనుష్క స్పందన..!

Tollywood Actress Anushka Shetty Shares Her Response On Prabhas New Movie Radhe Shyam First Look Poster

ప్రభాస్20.. ప్రభాస్20.. గత రెండు ఏళ్లుగా ఇదే అంటున్నాం.. కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు. ప్రభాస్ ‘రాధే శ్యామ్’ అని అనొచ్చు. బాహుబలి1, బాహుబ‌లి2 , సాహో వంటి పాన్ ఇండియా చిత్రాలతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా క్రేజ్ ని సొంతం చేసుకున్న ప్ర‌భాస్ త‌న 20 వ చిత్రాన్ని జిల్ చిత్ర ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వం లో తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే యూర‌ప్ లో కీల‌క స‌న్నివేశాలు చిత్రీకరణ జరుపుకొంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ రోజు ఈ సినిమా ఫస్ట్ లుక్ ను, టైటిల్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. రాక రాక వచ్చిన అప్డేట్ కావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇక ఫస్ట్ లుక్ కూడా అందరినీ ఆకట్టుకుంటుంది. సూట్ లో ప్రభాస్ రెడ్ గౌన్ లో పూజా హెగ్డేతో ఓ రొమాంటిక్ పోజిచ్చారు. ఇక ఫస్ట్ లుక్ పై అనుష్క కూడా తన ఇన్స్టాలో స్పందించింది. ప్రభాస్, పూజ హెగ్డే తో పాటు ఈ సినిమా కాస్ట్ అండ్ క్రూ కి బెస్ట్ విషెస్ తెలియచేసింది.

‘జిల్’ ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 1970 బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడిక‌ల్ ల‌వ్‌స్టోరీగా రూపుదిద్దుకుంటుంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో భాగ్య శ్రీ, మురళీ శర్మ, ప్రియదర్శి, కునాల్ రాయ్ కపూర్, సచిన్ ఖేదేకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + sixteen =