ట్యాగ్ · 4439 కథనాలు · పేజీ 133

నితిన్ యాక్షన్ కామెడీ ఎంటర్ టైనర్ "దిల్ "
ప్రకృతి ఆస్వాదనలో సాయి పల్లవి

లొకేషన్స్ వేటలో 'అంధాధున్' టీమ్

'టాలీవుడ్ ' పేరు ఎక్కడినుండి వచ్చిందో తెలుసా..?
రంగంలో దిగిన 'టక్ జగదీష్'
త్వరలో రానున్న 'మాస్టర్' టీజర్
సరదాగా నవ్వుకునే 'ఒరేయ్ బుజ్జిగా'
హీరో ప్రభాస్, అనుష్క ల పెళ్ళి ఫోటో ?

ఇటలీ లో "రంగ్ దే !"
నిధి అగర్వాల్ చిన్ననాటి ఫోటోలు
చిట్టి బాబు లాంటి పాత్రలో సుధీర్ బాబు ..!
మీప్రేమకు థ్యాంక్స్ డార్లింగ్స్
రీమేక్ మూవీస్ లో జాన్వీ కపూర్

నందు "బొమ్మ బ్లాక్ బస్టర్" టీజర్ రిలీజ్
సూర్య కు గాత్ర దానం చేస్తున్న సత్వ దేవ్
నెగటివ్ రోల్స్ కు సై - రాజ్ తరుణ్
నిశ్శబ్దం లో పాత్రకు మంచి ప్రశంసలు వచ్చాయి
హేమంత్ మధుకర్ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా నిశ్శబ్దం. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈనెల 2వ తేదీన అమెజాన్ లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుంది. సస్పెన్స్ ఎలిమెంట్స్.. అనుష్క్ నటన.. మాధవన్ నెగిటివ్ షేడ్.. కాప్ గా అంజలి.. ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్ అయ్యాయి. ఇక ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మాధవన్ తన పాత్రపై మాట్లాడారు.

బిగ్ బాస్ 4.. బోరింగ్ గా బీబీ హోటల్ టాస్క్
అలా చూస్తుండగానే ఇలా అప్పుడే బిగ్ బాస్ 4 స్టార్ట్ అయి నెల రోజులు అయిపోయింది. ఇక ఇప్పుడిప్పుడే తమ మాస్కులు తీసేసి నిజస్వరూపాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. ఇక నిన్న ఎపిసోడ్ విషయానికి వస్తే.. దివి నామినేషన్ లో చెప్పిన రీజన్ కు లాస్య ఇంకా ఏడుస్తూనే ఉండగా పక్కన ఉన్న గంగవ్వ ఓదారుస్తుంటుంది. మరోవైపు మోనాల్ కు అభిజిత్, అఖిల్ ఇద్దరూ సారీ చెప్పారు. అనంతరం నోయల్ తను నామినేట్ చేసిన అమ్మ రాజశేఖర్‌తో మాట్లాడే ప్రయత్నం చేశాడు. కానీ అతను వినిపించుకోలేదు. ఇక నామినేషన్ ప్రక్రియలో హీట్ ఎక్కిన బిగ్ బాస్ హౌస్ రాత్రి ఎపిసోడ్ తో కొంచం కూల్ అయింది. నామినేషన్ ప్రక్రియ అవ్వడంతో ఈ రోజు లగ్జరీ బడ్జెట్…

నితిన్ యాక్షన్ కామెడీ ఎంటర్ టైనర్ "దిల్ "
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వి వి వినాయక్ దర్శకత్వంలో నితిన్ , నేహ జంటగా రూపొందిన యాక్షన్ కామెడీ ఎంటర్ టైనర్ "దిల్ " మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సూపర్ హిట్ "జయం " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన నితిన్ తన రెండవ మూవీ "దిల్" లో యాక్షన్ సీన్స్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి హీరో గా ఎస్టాబ్లిష్ అయ్యారు. కమెడియన్ వేణు మాధవ్ తన మిమిక్రీ స్కిల్స్ తో ప్రేక్షకులను అలరించారు. ఆర్ పి పట్నాయక్ సంగీతం అందించారు.
ప్రకృతి ఆస్వాదనలో సాయి పల్లవి
బ్లాక్ బస్టర్ "ఫిదా " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన సాయి పల్లవి ఆ మూవీ లో తెలంగాణ యువతిగా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్నారు. తెలుగు మూవీస్ తో పాటు తమిళ , మలయాళ భాషల మూవీస్ లో నటించిన సాయి పల్లవి ప్రస్తుతం "లవ్ స్టోరీ ", "విరాటపర్వం " మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. నటనకు ప్రాధాన్యం ఉన్న మూవీస్ ను సాయి పల్లవి ఎంపిక చేసుకుంటున్నారు.

లొకేషన్స్ వేటలో 'అంధాధున్' టీమ్
మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ ప్రధాన పాత్రలో అంధాధున్ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవలే ఈ సినిమాలో నటిస్తున్న లీడ్ యాక్ట్రెస్ ను అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. టబు పాత్రలో తమన్నా.. రాధికా ఆప్టే పాత్రలో నభా నటేష్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ఇక ఈ విషయాన్ని ఈ సినిమాకు ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న సాహి సురేశ్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.

'టాలీవుడ్ ' పేరు ఎక్కడినుండి వచ్చిందో తెలుసా..?
ప్రతి ఏడాది వేరు వేరు లాంగ్వేజస్ నుండి ఎన్నో సినిమాలు విడుదలవుతూనే ఉంటాయి. దేశవ్యాప్తంగా బాలీవుడ్ సినీ పరిశ్రమ కాస్త పెద్దది.. ఆ తర్వాత మన టాలీవుడ్డే . అయితే దేశంలోనే ఎక్కువగా సినిమాలు తీసే ఇండస్ట్రీ ఒక్క టాలీవుడ్ మాత్రమే. ఒకప్పుడు హీరోలు తక్కువగా ఉన్నా ఒక్కో హీరో నుండి సుమారు ఐదారు సినిమాలు రిలీజ్ అయ్యేవి. ఇంకా పాత తరంకి వెళ్తే ఒక్కొక్కళ్ళు ఏడాదికి 10కి పైన సినిమాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు టాలీవుడ్ లో హీరో ల సంఖ్య భారీగా పెరిగిపోయింది... చిన్న హీరోల నుండి బడా హీరోలు వరకు చాలామంది ఉన్నారు... దీంతో ప్రతి ఒక్కరూ ఏడాదికి రెండు మూడు సినిమాలు చేసేస్తున్నారు. ఇంకేముంది బాక్సాఫీస్ దగ్గర…
రంగంలో దిగిన 'టక్ జగదీష్'
ఇటీవలే 'వి' సినిమాతో అలరించాడు నాని. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో నాని హీరోగా ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా "టక్ జగదీష్" సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కు ముందే ఈ సినిమా 40 శాతం వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. అయితే ఇక అందరూ సినిమా షూటింగ్ లు ప్రారంభిస్తున్న నేపథ్యంలో నాని కూడా రంగంలోకి దిగినట్టు తెలుస్తుంది. ఈ సినిమా షూటింగ్ ను మళ్లీ మొదలుపెట్టారట చిత్రయూనిట్. సినిమా రిలీజ్ సంగతి పక్కన పెడితే వీలైనంత త్వరగా సినిమా షూటింగ్ ను పూర్తిచేయాలన్న ప్లాన్ లో ఉన్నాడట నాని.
త్వరలో రానున్న 'మాస్టర్' టీజర్
సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూసే సినిమాల్లో తమిళ్ స్టార్ హీరో విజయ్ 'మాస్టర్' సినిమా కూడా ఒకటని చెప్పొచు. ఎందుకంటే కేవలం తమిళ్ లోనే కాదు విజయ్ తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. నగరం, ఖైదీ చిత్రాల దర్శకుడు లొకేష్ కనకరాజ్ దర్శకత్వంలో విజయ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా 'మాస్టర్'. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా రిలీజ్ చేయనున్నారు. కరోనా లేకపోతే ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ అయి ఉండేది.
సరదాగా నవ్వుకునే 'ఒరేయ్ బుజ్జిగా'
విజయకుమార్ కొండా దర్శకత్వంలో హీరో రాజ్ తరుణ్, హీరోయిన్ మాళవికా నాయర్ జంటగా నటించిన చిత్రం 'ఒరేయ్ బుజ్జిగా'. కేకే రాధమోహన్ నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 2న ఆహాలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇక కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ సినిమా మంచి రివ్యూస్ నే సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా లో ఇంట్రెస్టింగ్ పాయింట్స్ గురించి చెప్పుకోవాలంటే...
హీరో ప్రభాస్, అనుష్క ల పెళ్ళి ఫోటో ?
తెలుగు, తమిళ బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ అనుష్క స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. అనుష్క ప్రధాన పాత్రలో నటించిన థ్రిల్లర్ "నిశ్శబ్ధం " మూవీ లో అద్భుతంగా నటించి అనుష్క ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. స్టార్ హీరోయిన్ అనుష్క సోషల్ మీడియా ట్విట్టర్ లో జాయిన్ అయిన విషయం తెలిసిందే. తనకు సంబంధించిన అప్ డేట్స్ ను అనుష్క అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు అనుష్క ట్విట్టర్ ద్వారా జవాబిచ్చారు.

ఇటలీ లో "రంగ్ దే !"
సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్ , కీర్తి సురేష్ జంటగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ "రంగ్ దే " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. నరేష్ , బ్రహ్మాజీ , వినీత్ , వెన్నెలకిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా "రంగ్ దే " మూవీ షూటింగ్ నిలిచిపోయింది.
నిధి అగర్వాల్ చిన్ననాటి ఫోటోలు
సక్సెస్ ఫుల్ బాలీవుడ్ మూవీ "మున్నా మైఖేల్ " తో కెరీర్ ప్రారంభించిన అందాల నిధి అగర్వాల్ "సవ్యసాచి "మూవీ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు." Mr మజ్ను " తో ప్రేక్షకులను నిధి అలరించారు. బ్లాక్ బస్టర్ "ఇస్మార్ట్ శంకర్ "మూవీ లో తన అందం , అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుని నిధి పలు అవకాశాలు అందుకుంటున్నారు.
చిట్టి బాబు లాంటి పాత్రలో సుధీర్ బాబు ..!
ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో నాని-సుధీర్ బాబు కాంబినేషన్ లో వచ్చిన ‘వి’ మూవీ ఇటీవలే అమెజాన్ లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విజయం సంగతి పక్కన పెడితే.. ఈ సినిమాలో పోలీస్ పాత్రలో నటించిన సుధీర్ బాబుకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. ఇప్పటివరకూ కాస్త లవర్ బాయ్ రోల్స్ లో కనిపించిన సుధీర్ బాబుకు ఈ సినిమా కమర్షియల్ హీరోగా మారడానికి బాగా ఉపయోగపడిందని చెప్పొచ్చు.
మీప్రేమకు థ్యాంక్స్ డార్లింగ్స్
బాహుబలి, సాహో ల తర్వాత ప్రభాస్ రేంజ్ పూర్తిగా మారిపోయిందని చెప్పొచ్చు. అప్పటినుండి ఏదో ఒక రికార్డు క్రియేట్ చేస్తూనే ఉన్నాడు. రీసెంట్ గా ప్రభాస్ ఫేస్ బుక్ పేజికి 20 మిలియన్ల ఫాలోవర్స్ రావడంతో సరికొత్త రికార్డు ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మూడు నెలల క్రితమే 15 మిలియన్స్ క్రాస్ చేసిన ప్రభాస్ ఇప్పుడు 20 మిలియన్ మార్క్‌ను టచ్ చేశారు. దీంతో సౌత్‌లోనే ఫేస్‌బుక్‌లో ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న ఘనత ప్రభాస్‌కు మాత్రమే సొంతమైంది. సౌత్ ఇండియాలో ఎక్కువమంది పాలోవర్స్ ఉన్న హీరోగా ఫేస్ బుక్ లో కొత్త రికార్డును క్రియేట్ చేసాడు. ఈ సందర్భంగా ప్రభాస్.. తన అభిమానులు, ఫాలోవర్స్‌కు ప్రత్యేక…
రీమేక్ మూవీస్ లో జాన్వీ కపూర్
లెజెండరీ యాక్ట్రెస్ , అతిలోక సుందరి తనయ జాన్వీ కపూర్ మరాఠీ మూవీ "సైరాట్ " హిందీ రీమేక్ మూవీ "ధడక్" తో బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. "ధడక్" మూవీ ఘనవిజయం సాధించి 100 కోట్ల క్లబ్ లో చేరింది. అంథాలజీ మూవీ "ఘోస్ట్ స్టోరీస్"లో ఒక ఎపిసోడ్ లో జాన్వీ నటించారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ పైలట్ గుంజన్ సక్సేనా జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన " గుంజన్ సక్సేనా : ది కార్గిల్ " మూవీ తో జాన్వీ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. జాన్వీ హీరోయిన్ గా "రూహి అఫ్జానా", "దోస్తానా 2 " మూవీస్ రూపొందుతున్నాయి.

నందు "బొమ్మ బ్లాక్ బస్టర్" టీజర్ రిలీజ్
రాజ్ విరాట్ దర్శకత్వంలో నందు, రష్మి హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా 'బొమ్మ బ్లాక్‌బస్టర్'. ఈ సినిమా టైటిల్ లుక్ తో పాటు మోషన్ పోస్టర్ ని కూడా చిత్ర యూనిట్ సభ్యులు ఇటీవలే విడుదల చేశారు. నందు ఫస్ట్ లుక్ తో పాటు, రష్మీ గౌతమ్ లుక్స్ కి సైతం ఫుల్ క్రేజ్ రావడం విశేషం.

బిగ్ బాస్ 4 - సైలెంట్ గా కెప్టెన్ అయిన కుమార్ సాయి
బిగ్ బాస్ 4 - ఫైనల్ గా మూడు రోజుల నుండి జరుగుతున్న కెప్టెన్సీ టాస్క్ నిన్న ఎపిసోడ్ తో ముగిసింది. మంగళవారం కిల్లర్ కాయిన్స్ అనే టాస్క్ బిగ్ బాస్ ఇవ్వగా దాని కొనసాగింపే నిన్న జరిగింది. ఇందులో నోయల్, అరియానా, దివి, అమ్మా రాజ శేఖర్‌లు ముందే ఔట్ అయ్యారు. సుజాత దగ్గర స్విచ్ కాయిన్ ఉండడంతో ఆమెను ఔట్ చేయాలని సలహాలు ఇచ్చింది అరియానా. ఈ విషయంలో నీ రన్నింగ్ కామెంట్రీ అవసరమా అంటూ అరియానాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మరో వైపు సోహైల్ అమ్మ రాజశేఖర్ కి సారీ చెప్పడం జరుగుతుంది. మూడో లెవల్‌లో భాగంగా ఇంటి సభ్యులు సామ, దాన, భేద దండోపాయాలతో కాయిన్స్ పెంచుకోవచ్చని బిగ్ బాస్ చెప్పడంతో కొంత మంది…
సూర్య కు గాత్ర దానం చేస్తున్న సత్వ దేవ్
సుధా కొంగర దర్శకత్వంలో సూర్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ్ లో ‘సూరరై పోట్రు’ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా!’ టైటిల్‌తో విడుదల కానుంది. ఇక ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంది. అయితే కరోనా వల్ల రిలీజ్ మాత్రం ఆపాల్సి వచ్చింది. ఇటీవలే ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అవుతున్నట్టు వార్తలు రాగా వాటిపై స్పందించి ఓటీటీలో రిలీజ్ చేసే ప్లాన్ లేదని తెలిపారు

ఒరేయ్ బుజ్జిగా రివ్యూ - మంచి కామెడీ ఎంటర్టైనర్
ఓవరాల్ గా చెప్పాలంటే ఈ లాక్ డౌన్ లో ఇంట్లో ఉండి బోర్ ఫీల్ అయ్యేవాళ్ళకు ఈ కామెడీ ఎంటర్టైనర్ మంచి టైంపాస్ అవుతుంది. ఫుల్ కామెడీ చూసి నవ్వుకోవచ్చు..
నెగటివ్ రోల్స్ కు సై - రాజ్ తరుణ్
సక్సెస్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ "ఉయ్యాలా జంపాలా " మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన రాజ్ తరుణ్ పలు సక్సెస్ ఫుల్ మూవీస్ లో తన కామెడీ తో ప్రేక్షకులను అలరించారు. విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో రాజ్ తరుణ్ హీరోగా రూపొందిన కామెడీ ఎంటర్ టైనర్ "ఒరేయ్ బుజ్జిగా "మూవీ "ఆహా "OTT ద్వారా అక్టోబర్ 1 వ తేదీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే.