మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ ప్రధాన పాత్రలో అంధాధున్ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవలే ఈ సినిమాలో నటిస్తున్న లీడ్ యాక్ట్రెస్ ను అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. టబు పాత్రలో తమన్నా.. రాధికా ఆప్టే పాత్రలో నభా నటేష్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ఇక ఈ విషయాన్ని ఈ సినిమాకు ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న సాహి సురేశ్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమా కోసం గోవా తదితర ప్రాంతాల్లో లొకేషన్ వేట కొనసాగుతోందని డైరెక్టర్ మేర్లపాక గాంధీ, ఆర్ట్ డైరెక్టర్ సాహి సురేశ్‌లు లొకేషన్ లు వెతుకుతూ అక్కడ దిగిన ఫొటోలు పోస్ట్ చేసాడు. అంతేకాదు ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయని చెప్పారు.
Scouting for locations in Goa for @AndhadhunFilm remake with Director @MerlapakaG Pre-production going at a fast pace. pic.twitter.com/NIopXJdPxC
— Sahi Suresh (@sahisuresh) October 5, 2020
కాగా శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్‌పై ఎన్.సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నవంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి సాగర్ మహతి సంగీతం అందించనుండగా… హరి కె.వేదాంత్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. మిగిలిన నటీనటుల వివరాలు త్వరలోనే తెలియచేస్తానన్నారు.
మరి ఆయుష్మాన్ ఖురానా,టబు, రాధికా ఆప్టే నటించిన ‘అంధాధున్’ సినిమా మంచి ప్రేక్షకాదరణతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు గాను ఆయుష్మాన్ ఖురానాకు నేషనల్ అవార్డ్ దక్కింది. టబు విమర్శకుల ప్రశంసలతో పాటు ఫిలిం ఫేర్ అవార్డ్ ఇంకా పలు అవార్డ్స్ ను సొంతం చేసుకుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: