కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

నిశ్శబ్దం లో పాత్రకు మంచి ప్రశంసలు వచ్చాయి

నిశ్శబ్దం లో పాత్రకు మంచి ప్రశంసలు వచ్చాయి

My Character in Nishabdham Movie Received Good Applause from the Audience

హేమంత్ మధుకర్ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా నిశ్శబ్దం. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈనెల 2వ తేదీన అమెజాన్ లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుంది. సస్పెన్స్ ఎలిమెంట్స్.. అనుష్క్ నటన.. మాధవన్ నెగిటివ్ షేడ్.. కాప్ గా అంజలి.. ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్ అయ్యాయి. ఇక ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మాధవన్ తన పాత్రపై మాట్లాడారు.

ఈ సందర్భంగా మాధవన్ మాట్లాడుతూ.. హేమంత్ మధుకర్ నాకు చాలా కాలం నుండి తెలుసు.. నాకు మంచి స్నేహితుడు కూడా... తను కథ చెప్పినప్పుడు నాకు బాగా నచ్చింది.. ఈ సినిమా వల్ల కొన్ని కొత్త విషయాలు నేర్చుకున్నాను. ముఖ్యంగా నా పాత్రకు వచ్చిన ప్రశంసలు చాలా సంతోషాన్ని కలిగించాయ`ని చెప్పారు. ఇంకా ఓటీటీల గురించి మాట్లాడుతూ.. `గతంలో `బ్రీత్`, ఇప్పుడు `నిశ్శబ్దం` వంటి వాటిల్లో వైవిధ్యమైన పాత్రలు చేసే అవకాశం నాకు దక్కింది. కొత్తగా ఏమైనా చేయాలనుకునే వారికి ఓటీటీ బెస్ట్ ఛాయిస్.. ముందు ముందు మరిన్ని వైవిధ్యమైన పాత్రలు చేయాలనుకుంటున్నాను... అమెజాన్ తో కలిసి కొన్ని ప్రాజెక్టులు చేయబోతున్నాన`ని చెప్పారు.

కాగా టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల, కోన వెంకట్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాకు గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు. తెలుగు,తమిళ, మలయాళ భాషలలో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగులో 'నిశ్శబ్దం' టైటిల్ తోను, మిగతా భాషలలో సైలెన్స్ టైటిల్ తో రిలీజ్ చేసారు.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్