బిగ్ బాస్ 4 – ఎవిక్ష‌న్ పాస్ తో గట్టెక్కిన అవినాష్

Bigg Boss Day

బిగ్ బాస్ 4 – మొత్తానికి ఎవిక్షన్ పాస్ వలన అవినాష్ ఎలిమినేషన్ అనే గండం నుండి తప్పించుకున్నాడు. మరి అవినాష్ తన ఎవిక్షన్ పాస్ ను ఎలా వాడుకున్నాడు… అసలు నిన్న ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఒక లుక్కేద్దాం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక నిన్న సండే కాబట్టి ఎప్పటిలాగానే కింగ్ నాగార్జున సరదాగా హౌస్ మేట్స్ తో ఆడించేందుకు రెడీ అయిపోయాడు. ‘చీక‌టిలో ధైర్యం స్థైర్యం’ టాస్క్‌తో మ‌రోసారి కంటెస్టెంట్ల‌ను భ‌య‌పెట్టించే ప్ర‌య‌త్నం చేశారు. మొద‌ట‌గా అరియానా దెయ్యం గ‌దిలోకి వెళ్ల‌డానికి నిరాక‌రించింది. నన్ను ఒదిలేయండి, నా గుండె ఆగిపోతుంది అని ఏడ్చేయ‌డంతో ఆమెను ప‌క్క‌న పెట్టేశారు. త‌ర్వాత సోహైల్‌.. లోప‌ల‌కు వెళ్ల‌గా భ‌య‌ప‌డుతూనే ఒక్కో అడుగు ముందుకు వేశాడు. గ‌జ్జెల శ‌బ్ధం విన‌ప‌డేస‌రికి గ‌జ‌గ‌జ వ‌ణికిపోయాడు. అఖిల్ భ‌యాన్ని క‌వ‌ర్ చేసుకునే ప్ర‌య‌త్నం చేశాడు. అభిజిత్ లోప‌ల కొంచెం భ‌యంగా ఉండేన‌ని అస‌లు విష‌యం చెప్పాడు. ఇక అవినాష్ దెయ్యం అరుపుల‌కు భయపడుతూనే రూమ్ లోకి వెళ్ళాడు.‌ హారిక, మోనాల్‌ ఏమాత్రం బెద‌ర‌లేదు. మొన్నటి దెయ్యం టాస్కులో సోహైల్‌, అఖిల్ ఎలా భయపడ్డారో ఆ వీడియో హౌస్ మేట్స్ కు చూపించి వారి ప‌రువు తీశారు. త‌ర్వాత అరియానా ధైర్యం తెచ్చుకుని ఒంట‌రిగా చీక‌టి గ‌దిలోకి వెళ్లి రాగా, భ‌యాన్ని జ‌యించాన‌ని సంబర‌ప‌డిపోయింది.

ఈ ఎపిసోడ్‌కు కన్నడ స్టార్ హీరో సుదీప్ గెస్ట్ గా వచ్చారు. ఆయన కూడా ఇంటి స‌భ్యుల‌తో క‌లిసి సంద‌డి చేశారు. ఒక్కో ఇంటి స‌భ్యుడిని ఒక్కో ప్ర‌శ్న అడ‌గ‌గా వాటికి స‌మాధానాలు ఇచ్చారు. ముందుగా హారిక‌ను నీకు విధేయ‌తా ముఖ్య‌మా? గెలుపు ముఖ్య‌మా? అన్న ప్ర‌శ్న‌కు విధేయ‌త‌నే ముఖ్య‌మ‌ని తెలివిగా స‌మాధానం ఇచ్చింది. అవినాష్‌ని…ఎవ‌రితో డేట్ చేస్తావు? ఎవరిని పెళ్లి చేసుకుంటావు? ఎవ‌రిని చంపుతావు? అని అడ‌గ‌గా, మోనాల్‌తో డేట్‌, హారిక‌తో పెళ్లి, కానీ అరియానాని చంపుతాన‌ని అన్నాడు.

అభిజీత్‌ని హారిక చిన్న హెయిర్‌తో ఉంటే ఇష్ట‌మా? పొడు‌వు జుట్టుతో ఉంటే ఇష్ట‌మా? అని అడిగారు సుదీప్. దీనికి అభి షార్ట్ హెయిర్ అన్నాడు. చిన్న‌ముఖం మంచిగా క‌నిపిస్తుంద‌ని చెప్పుకొచ్చాడు. ఇక అరియానాను ఒక్క‌రోజు నువ్వు అవినాష్‌లా నిద్ర‌లేస్తే చేసే మొద‌టి ప‌ని ఏంటి? అని అడ‌గ్గా తానస‌లు నిద్ర‌లో నుంచే లేవ‌ను అంటూ చెప్పేసింది. సోహైల్‌కు మ‌ట‌న్ లేదా చికెన్‌లో ఏది ఎక్కువ ఇష్ట‌మంటే మ‌ట‌న్ అని జ‌వాబిచ్చాడు. త‌ర్వాత సుదీప్‌ మోనాల్‌ను పిల‌వ‌బోయి అఖిల్‌ను పిలిచారు. అయితే వీళ్లిద్ద‌రిలో ఎవ‌రిని అడిగినా ఒక‌టేలే అని నాగ్ కామెడీ చేసాడు. అఖిల్ ని నువ్వు ఇంట్లో ఎవ‌రిని మాయం చేయాలి అనుకుంటున్నావ్ అని సుదీప్ ప్ర‌శ్నించ‌గా అందుకు మోనాల్ పేరు చెప్పాడు. త‌న వ‌ల‌న కొద్దిగా గేమ్ డిస్ట‌బ్ అవుతుంది అందుకే మాయం చేయాల‌నుకుంటున్నాన‌ని స‌ర‌దాగా చెప్పాడు. చివ‌రిగా నామినేష‌న్‌లో ఉన్న అఖిల్‌, అవినాష్‌, అరియానాల‌లో అఖిల్‌ని సేవ్ చేశారు సుదీప్.

చివ‌ర‌కు అందరూ అనుకున్నట్టే అరియానా, అవినాష్ ను ఉంచారు. అయితే అవినాష్ ద‌గ్గ‌ర ఎవిక్ష‌న్ పాస్ ఉండడంతో దానిని ఉప‌యోగించి ఎలిమినేష‌న్ నుండి బ‌య‌ట‌ప‌డొచ్చు అని మూడు ఆప్షన్స్ ఇచ్చాడు నాగ్. ఈవారం కాన్ఫిడెంట్ గా ఉంటే ఈ పాస్‌ని వ‌చ్చే వారం అయిన ఉప‌యోగించుకోవ‌చ్చని.. లేదంటే ఈవారం వాడుకోవచ్చు.. లేదా నువ్వు సేవ్ అయితావ‌నే న‌మ్మ‌కం ఉంటే అరియానాకి కూడా ఉప‌యోగించ‌వ‌చ్చు అని నాగ్ చెప్పాడు. ఇక ఒక పక్క అవినాష్ కు టెన్షన్ మొదలైంది.

ఈ ఎవిక్ష‌న్ పాస్ నేనే వాడ‌తాన‌ని నాగ్‌తో చెప్పాడు అవినాష్‌. అయితే ఒక‌సారి హౌజ్‌మేట్స్ స‌ల‌హా కూడా తీసుకో. అరియానాతో కూడా డిస్క‌స్ చేయ‌ని నాగ్ అన‌డంతో అంద‌రూ వాడుకోమని చెపుతారు. మరోపక్క అరియానా కూడా నువ్వే వాడుకో అని.. చెప్పడంతో విక్ష‌న్ పాస్ తానే వాడుకున్నాడు. వారి ముందు ఉన్న‌ రెండు టీపీల‌లో ఎవ‌రి చేతికి రెడ్ క‌ల‌ర్ అంటుతుందో వారు ఎలిమినేట్ అవుతారు, గ్రీన్ క‌లర్ వ‌చ్చిన వారు సేవ్ అవుతారు అని నాగ్ పేర్కొన్నారు. అరియానా, అవినాష్ ఇద్దరూ చేతులు టోపిలో పెట్ట‌గా, అవినాష్ కు రెడ్ కలర్ వచ్చింది. అరియానాకి గ్రీన్ కలర్ వచ్చింది. ఎవిక్ష‌న్ పాస్ వ‌ల‌న అత‌ను సేవ్ అయ్యాడు. అవినాష్ నిర్ణ‌యం ప‌నికొచ్చిందని, ఈ వారం ఎలిమినేష‌న్ లేదంటూ నాగ్ తెలిపారు. మొత్తానికి ఎవిక్షన్ పాస్ ఈవారం ఎలిమినేషన్ నుండి తప్పించుకున్నాడు అవినాష్. అయితే ప్రేక్షకుల దృష్టిలో ఓడిపోయా అని కొంచం ఫీల్ అయ్యాడు. దానికి నాగ్ ‘నువ్ సెల్ఫ్ సింపథీలోకి వెళ్లకు.. ఎవరికి వారు ఆట బాగా ఆడండి’ అంటూ ధైర్యం చెప్పారు నాగార్జున.

ఇక ఈ రోజు నామినేషన్స్ కూడా చాలా హాట్ గా జరగబోతున్నట్టే తెలుస్తుంది. మరి ఈ వారం ఎవరి మధ్య ఆర్గ్యూ జరుగుతుంది.. ఎవరెవరు నామినేషన్ లో ఉంటారు అన్న విషయం తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six − 4 =