నాగశౌర్య స్టైలిష్ లుక్

Naga Shaurya Stylish Look Attracts Netizens Attention

హీరో నాగశౌర్య పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. నాగశౌర్య నటించే చిత్రాలలో కొత్త కథానాయికలకు అవకాశం ఇస్తున్నారు. సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో నాగశౌర్య , కేతిక శర్మ జంటగా స్పోర్ట్స్ డ్రామా “NS20 “మూవీ రూపొందుతుంది. ఈ మూవీ లో నాగశౌర్య ఆర్చర్ గా నటిస్తున్నారు. ఈ మూవీ లో తన పాత్రకై నాగశౌర్య 8 ప్యాక్ అబ్స్ తో సిద్ధం అయ్యారు. అనీష్ కృష్ణ దర్శకత్వంలో నాగశౌర్య , షిర్లీ సేతియా జంటగా రూపొందనున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీ పూజాకార్యక్రమం జరుపుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో నాగశౌర్య ప్రస్తుతం సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ “వరుడు కావలెను ” మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. రీతూ వర్మ కథానాయిక. ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. ఇప్పుడు చిత్ర యూనిట్ దుబాయ్ కి పయనం అయ్యింది. దుబాయ్ లో కొన్ని కీలక సన్నివేశాలు , సాంగ్స్ చిత్రీకరణ కై దర్శకురాలు లక్ష్మీ సౌజన్య ప్లాన్ చేశారు. స్టైలిష్ మేకోవర్ తో ఉన్న నాగశౌర్య ఫొటో అభిమానులను ఆకట్టుకుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − 8 =