మన టాలీవుడ్ సినిమాలకు ఇప్పుడు బాలీవుడ్ లో బాగానే డిమాండ్ పెరిగింది. ఒకప్పుడు ఇక్కడ హిట్ సినిమాల్లో ఏదో ఒకటో రెండో సినిమాలు అక్కడ రీమేక్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు. ఇక్కడ హిట్ అయిన ప్రతి సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి రెడీ అయిపోతున్నారు. ఇప్పటికే అరడజనుకు పైగా సినిమాలు రీమేక్ కు సిద్ధంగా ఉండగా ఇటీవలే మన టాలీవుడ్ హీరో సాయి శ్రీనివాస్ ఛత్రపతి సినిమా రీమేక్ చేస్తున్నాడు. 15ఏళ్ల క్రితం వచ్చిన ‘ఛత్రపతి’ సినిమాను ఇప్పుడు హిందీలో రీమేక్ చేసేందుకు సిద్ధమయ్యారు. టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఈ సినిమా ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు మరో సినిమా రీమేక్ కు సిద్ధమైంది. అది ఎన్టీఆర్ సినిమా ఊసరవెల్లి. ఎన్టీఆర్, తమన్నా జంటగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కమర్షియల్‌గా విజయం సాధించలేకపోయింది. అయితే ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ తప్పకుండా బాలీవుడ్ ఆడియెన్స్‌ను అలరిస్తుందనే నమ్మకంతోనే ఊసరవెళ్లి విడుదలై పదేళ్లు దగ్గరపడుతున్నా రీమేక్ చేసేందుకు తౌరానీ సిద్ధపడినట్లు బీ-టౌన్‌లో టాక్ వినిపిస్తోంది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
మరి తెలుగులో ఈ సినిమా అంత సక్సెస్ అవ్వలేదు. ఈ సినిమాను బెంగాలీలో రీమేక్ చేస్తే అక్కడా పరాజయం పాలైంది. అలాంటిది బాలీవుడ్ లో ఎంత వరకూ సక్సెస్ అవుతుందో చూద్దాం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: