కొత్త జానర్ లో విశ్వక్ సేన్ ?

HIT Movie Fame Vishwak Sen Chooses A New Genre For His Upcoming Movie

“వెళ్ళిపోమాకే “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన విశ్వక్ సేన్ “ఈ నగరానికి ఏమైంది “, “ఫలక్ నుమా దాస్ “, మిస్టరీ థ్రిల్లర్ “HIT- ది ఫస్ట్ కేస్ ” వంటి మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. విశ్వక్ “పాగల్”, “HIT 2 “మూవీస్ లో కథానాయకుడిగా నటిస్తున్నారు. విశ్వక్ ప్రస్తుతం పాండిచ్చేరి లో జరుగుతున్న “పాగల్ “మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటి వరకూ సీరియస్ పాత్రలలో నటించిన హీరో విశ్వక్ సేన్ కొత్త జానర్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. నూతన దర్శకుడు విద్యా సాగర్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా ఒక ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ రూపొందనుంది. ఈ మూవీ స్టోరీ , డైలాగ్ రైటర్ రవి కిరణ్ కోలా మాట్లాడుతూ .. ప్రస్తతం ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందనీ , హీరో విశ్వక్ సేన్ కు డిఫరెంట్ జానర్ మూవీ అనీ , లైట్ కామెడీ తో పాటు ఎమోషనల్ సీన్స్ తో తెరకెక్కనుందనీ , విశ్వక్ మేకోవర్ డిఫరెంట్ గా ఉండేలా ప్లాన్ చేశామనీ , ఫిబ్రవరి నెలలో సెట్స్ పైకి వెళ్ళనుందనీ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + 3 =