నైట్ షూట్ కు గుడ్ బై చెప్పిన ‘ఆర్ఆర్ఆర్’ టీమ్

RRR Movie Team Wraps Up Night Schedule

కరోనా వల్ల దాదాపు 8నెలలు షూటింగ్ కు గ్యాప్ తీసుకున్న ఆర్ఆర్ఆర్ టీం ఈమధ్యే షూటింగ్ ను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఈ సినిమాకు సంబంధించిన యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించే పనిలో ఉన్నారు. అంతేకాదు హెవీ వింటర్ లో కూడా షూట్ చేస్తున్నట్టు ఇప్పటికే పలు వీడియోలు పోస్ట్ చేస్తూ తెలియచేస్తూనే వున్నారు చిత్రయూనిట్. ఇక ఇప్పుడు ఫైనల్ గా నైట్ షెడ్యూల్ కు గుడ్ బై చెప్పినట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని ఆర్ఆర్ఆర్ టీమ్ సోషల్ మీడియా ద్వారా తెలిపింది. దాదాపు 50రోజుల పాటు ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్ ను నైట్స్ లో చలిలో ఇన్ని రోజులు చిత్రీకరణ చేశాం. ఫైనల్ గా ఈ షూట్ అయిపోయింది. త్వరలో మరో కొత్త షెడ్యూల్ ను ప్రారంభించనున్నాం అని పోస్ట్ లో పేర్కొన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

View this post on Instagram

 

A post shared by RRR Movie (@rrrmovie)

కాగా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో స్టార్ట్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. చరణ్ ‘మన్నెం దొర అల్లూరి సీతారామరాజు’గా కనిపిస్తుండగా తారక్ ‘కొమరం భీమ్’ పాత్రలో నటిస్తున్నాడు.

ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + 1 =