నాగ శౌర్య 20 టైటిల్ రిలీజ్

Naga Shaurya Upcoming Movie NS 20 Title Is Out

సుబ్రహ్మణ్యపురం ఫేమ్ దర్శకుడు సంతోష్ జాగర్లపూడి తో కలిసి నాగ శౌర్య 20 వ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రానికి సంబంధించి ప్రీ లుక్ ను రిలీజ్ ఇటీవలే చేయగా అందులో నాగశౌర్య లుక్ కు ఎంత రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 8ప్యాక్ తో నాగ శౌర్య మంచి కండరాలు తిరిగిన బాడీ తో మునుపెన్నడూ లేనంతగా ఈ సినిమాలో కనిపించనున్నాడని అర్ధమవుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఈ టైటిల్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. ‘లక్ష్య’ అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్ట‌ర్‌ కూడా నాగ‌శౌర్య సూపర్ ఫిట్ లుక్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది.

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి & నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కింద నిర్మిస్తున్న ఈ చిత్రంలో కేతికా శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. పురాతన క్రీడ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కతున్నట్టు తెలుస్తుంది.

దీనితో పాటు పలు ప్రాజెక్ట్స్ లైన్ లో ఉన్నాయి. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ తెరకెక్కుతుంది. . నాగశౌర్య హీరోగా ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ లో కె.పి.రాజేంద్ర దర్శకత్వంలో మరో సినిమా తెరకెక్కుతుంది. అవసరాల శ్రీనివాస్ తో కూడా
ఒక సినిమా లైన్లో పెట్టాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × two =