బిగ్ బాస్ 4 – 13వ వారం నామినేషన్ లిస్ట్

#BiggBossTelugu4, Akkineni Nagarjuna, BB House, Big Boss 4, Bigg Boss, Bigg Boss 4, Bigg Boss 4 Telugu, Bigg Boss 4 Telugu Day 85 Highlights, Bigg Boss 4 Telugu Highlights, Bigg Boss 4 Telugu Nominations, Bigg Boss 4 Telugu Nominations List, Bigg Boss Telugu 4, Bigg Boss Telugu 4 13th Week, Bigg Boss Telugu 4 Highlights, Bigg Boss Telugu Season 4, Bigg Boss Telugu Season 4 Latest News, Contestant Elimination List For 13th Week, Latest Tollywood News, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates

బిగ్ బాస్ 4 – ఆదివారం అయిపోయింది… సోమవారం వచ్చింది అంటే అందరు నామినేషన్ ప్రక్రియ కోసం బిగ్ బాస్ ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇక సోమవారం రానే వచ్చేసింది. నామినేషన్ ప్రక్రియ మొదలైంది. మరి ఈ వారం ఎవరు నామినేట్ అయ్యారో తెలియాలంటే ఈవారం ఎపిసోడ్ లోకి వెళ్లాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అనంత‌రం కిచెన్‌లో అరియానా, సోహైల్, అవినాష్‌లు నామినేష‌న్ గురించి మాట్లాడుకుంటూ న‌న్ను ఎవ‌రు నామినేట్ చేయొద్దని సోహైల్ అన‌డంతో .. వెంట‌నే అత‌నికి ద‌గ్గ‌ర‌కి వెళ్లిన అరియానా హ‌గ్ చేసుకొని.. నువ్వంటే చాలా ఇష్టం, ఎందుకు మ‌న ఇద్ద‌రికి అలా గొడ‌వ‌లు వ‌స్తున్నాయి. ఈ రెండు వారాలే త‌ర్వాత మ‌నం చిల్ అవ్వొచ్చు అంటూ వెళ్లి హగ్ చేసుకుంటుంది.

13 వారానికిగానూ నామినేష‌న్ ప్ర‌క్రియ మొద‌లైంది. ఏడుగురు కంటెస్టెంట్ల ముందు కంటైన‌ర్స్ ఉంటాయి. నామినేట్ చేయాల‌నుకున్న ఇద్ద‌రు లేదా అంత‌క‌న్నా ఎక్కువ మంది కంటెస్టెంట్ల కంటైన‌ర్ల‌లో క‌ల‌ర్ నీళ్లు పోయాల్సి ఉంటుంది. ఎవ‌రి గిన్నెలో ఎక్కువ రంగు నీళ్లు ఉంటే వాళ్లు నామినేట్ అయిన‌ట్లు. మొదటగా హారికను నామినేషన్ ప్రక్రియ మొదలుపెట్టమంటాడు బిగ్ బాస్. మొద‌ట‌గా హారిక నామినేష‌న్ ప్ర‌క్రియ‌ను మొద‌లు పెట్టింది. నీకు ఎవిక్ష‌న్ ఫ్రీ పాస్ రావ‌డానికి నేను కార‌ణం అయిన‌ప్ప‌టికీ, నాకు ప్రాధాన్య‌త ఇవ్వ‌లేద‌నిపించింద‌ని అవినాష్‌ను నామినేట్ చేసింది. అనంత‌రం టాస్కు ఆడ‌టానికి నిరాక‌రించినందుకుగానూ అభిజిత్‌ను నామినేట్ చేస్తున్న‌ట్లు చెప్పింది. ఇక ఆ తర్వాత క‌న్ఫెష‌న్ రూమ్‌లో జ‌రిగిన‌దానికి అభిని నామినేట్ చేయ‌లేద‌ని అంత‌కుముందే ఇది అనుకున్నాన‌ని హారిక కెమెరాల ముందు చెప్పుకుంటూ ఏడ్చింది.

ఆ త‌ర్వాత అవినాష్‌.. మోనాల్‌ను వీక్ అంటూ.. త‌న‌ను వ‌ర‌స్ట్ కెప్టెన్ అని చెప్పినందుకు అఖిల్‌ను నామినేట్ చేశాడు. అనంత‌రం అఖిల్‌.. నీకు ఓవ‌ర్ కాన్ఫిడెంట్ ఉందంటూ అవినాష్‌ను, గేమ్‌లో ఎఫ‌ర్ట్స్ త‌క్కువ‌గా ఉన్నాయ‌ని మోనాల్‌ను నామినేట్ చేశాడు. అనంత‌రం అభిజిత్‌.. ‘మొద‌టి రోజు నుంచీ నీవ‌ల్ల‌ నేను ఎమోష‌న‌ల్‌గా హ‌ర్ట్ అవుతున్నా. ఇది నీ త‌ప్పు అన‌ట్లేదు. కానీ నీకు ద‌గ్గ‌ర‌గా ఉన్నా, దూరంగా ఉన్నా కూడా నీ విష‌యంలో ఎన్నో స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. కానీ ఎక్క‌డో ఓసారి నాకోసం నువ్వు స్టాండ్ తీసుకుంటే బాగుండేద‌నిపించిందని మోనాల్‌ను నామినేట్ చేశాడు. ‘టాస్కు చేయ‌క‌పోవ‌డం నాకు త‌ప్పు. కానీ ఎందుకు చేయ‌లేద‌నే విష‌యం నీకు బాగా తెలుసు. నువ్వే అర్థం చేసుకోక‌పోతే ఎవ‌రూ అర్థం చేసుకోలేరు’ అంటూ హారిక‌ కంటైన‌ర్‌లో అతి త‌క్కువ రంగు నీళ్లు పోసి నామినేట్ చేశాడు. త‌ర్వాత వ‌చ్చిన మోనాల్ అవినాష్‌ను నామినేట్ చేస్తూ ఇక్క‌డున్న అంద‌రూ స్ట్రాంగే అని చెప్పింది. నామినేష‌న్‌కు భ‌య‌ప‌డ‌ట‌మే మీ వీక్‌నెస్ అని చెప్పింది. త‌ర్వాత టాస్క్ ఆడ‌నందున‌ అభిని నామినేట్ చేస్తూ.. మీరు నా వ‌ల్ల ఇబ్బంది ప‌డుతున్నారు. నేను కూడా మీకు దూరంగానే ఉంటున్నాను అని క్లారిటీ ఇచ్చింది. అలాగే త‌న క్లోజ్ ఫ్రెండ్ అఖిల్‌ను సైతం నామినేట్ చేసింది.

అరియానా.. త‌నను వ‌ర‌స్ట్ కెప్టెన్ అన్నందుకు హారిక‌, మోనాల్‌, సోహైల్‌ను నామినేట్ చేసింది… సోహైల్‌.. అవినాష్‌ను నామినేట్ చేస్తూ మోనాల్ కూడా స్ట్రాంగ్ అయింద‌ని.. అరియానాను నామినేట్ చేసాడు. ఫైనల్ గా ఈవారం అభిజిత్‌, అవినాష్‌, మోనాల్‌, అఖిల్‌, హారిక నామినేట్ అయ్యారు.

మరి ఈవారం ఎవరు ఇంటినుండి బయటకి వెళ్తారు.. ఈ రోజు ఎవరు ఫినాలే టికెట్ ను సొంతం చేసుకుంటారో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − twelve =