
ట్యాగ్ · 17286 కథనాలు · పేజీ 268


సలార్ ఫైట్ లీక్ పై మేకర్స్ సాలిడ్ రిప్లై

దూసుకుపోతున్న మ్యాడ్ కలెక్షన్స్

ఇండియన్ 2 డబ్బింగ్ మొదలుపెట్టిన కమల్

ఖైదీ సీక్వెల్ పై లోకేష్ మరోసారి క్లారిటీ

బబుల్ గమ్ టీజర్ రిలీజ్

యానిమల్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

సుహాస్ అంబాజీపేట మ్యారేజి బ్యాండు టీజర్ రిలీజ్

ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు పితృవియోగం

రోషన్ బబుల్ గమ్ టీజర్ అప్ డేట్

ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ రిలీజ్ డేట్ ఫిక్స్

గేమ్ ఛేంజర్ షూటింగ్ అప్డేట్

భగవంత్ కేసరి ట్రైలర్ లో మీకు నచ్చిన ఎలిమెంట్స్?

వెన్నెల కిషోర్ చారి 111 మూవీ షూటింగ్ కంప్లీట్

మిమ్మల్ని బాగా ఇంప్రెస్ చేసిన ట్రైలర్?

వైజయంతీ మూవీస్ మరో లీగల్ నోటీస్.. జగదేకవీరుడు అతిలోక సుందరి హక్కులు మావే
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు టాప్ ప్రొడక్షన్ హౌస్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించింది వైజయంతీ మూవీస్ సంస్థ వారు. ఆ మధ్య కాస్త డల్ అయినా ఇప్పుడు మళ్లీ ఫుల్ ఫామ్ లోకి వచ్చి సినిమాలను నిర్మిస్తుంది. ప్రస్తుతం అయితే ప్రభాస్ హీరోగా ల్కి 2898ఏడీ. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా భారీ స్థాయిలో ఈసినిమా తెరకెక్కుతుంది. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ఇటీవలే మేకర్స్ ఈసినిమా లీకుల విషయంలో స్ట్రాంగ్ వార్నింగే ఇచ్చారు. ఈసినిమా హక్కులన్నీ నిర్మాణ సంస్థకే చెందుతాయి.. ఈ సినిమాలోని ఏదైనా సీన్ కానీ ఫొటో కానీ వీడియోలను సోషల్ మీడియా ద్వారా…

లియో మూడో సాంగ్ అప్ డేట్
ప్రస్తుతం రిలీజ్ కు సిద్దంగా ఉన్న మోస్ట్ వాంటెడ్ సినిమాల్లో లియో ఒకటి. తమిళ్ స్టార్ హీరో విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా లియో. మాస్టర్ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఈసినిమా అక్టోబర్ 19వ తేదీన రిలీజ్ చేయనుండగా తెలుగులో సితార ఎంటర్ టైన్ మెంట్స్ వారు రిలీజ్ చేస్తున్నారు.

దిల్ రాజుకి పితృ వియోగం.. రామ్ చరణ్ సహా పలువురు ప్రముఖుల పరామర్శ
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజుకి పితృ వియోగం కలిగింది. ఆయన తండ్రి శ్యామ్‌సుందర్ రెడ్డి సోమవారం కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న శ్యామ్‌సుందర్ రెడ్డి నిన్న రాత్రి 8 గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. ఇక దిల్ రాజు ఇంట విషాదం చోటుచేసుకున్న నేపథ్యంలో తెలుగు చిత్ర పరిశ్రమ స్పందించింది. ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు దిల్ రాజుని పరామర్శించి తమ సంతాపాన్ని తెలియజేశారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి వారి ఇంటికి వెళ్లి శ్యామ్‌సుందర్ రెడ్డి భౌతికకాయానికి నివాళులు అర్పించి దిల్ రాజును ఓదార్చారు.

బబుల్‌గమ్ రోషన్ కి బ్లాక్ బస్టర్ స్టార్ట్ అవుతుంది-నాని
ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల, పాపులర్ యాంకర్ సుమ కనకాల తనయుడు రోషన్ కనకాల బబుల్‌గమ్ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. క్షణం, కృష్ణ అండ్ హిజ్ లీల చిత్రాలలో ఎక్స్ ట్రార్డినరీ వర్క్ తో ఆకట్టుకున్న దర్శకుడు రవికాంత్ పేరెపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మహేశ్వరి మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మానస చౌదరి కథానాయిక. ఇటీవలే విడుదలైన ఈసినిమా ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ లాంచ్ కు ముఖ్య అతిధిగా పాల్గొన్న నాని టీజర్ ను రిలీజ్ చేశారు.

రాజమౌళికి బర్త్ డే విషెస్ చెప్పిన జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్
ఎస్ఎస్ రాజమౌళి.. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటిచెప్పిన దర్శకధీరుడు. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ఆయన మేకింగ్ స్టైల్, విజన్‌కి సరితూగే దర్శకులే లేరంటే అతిశయోక్తి కాదు. రాజమౌళి ఇప్పటివరకూ తీసిన ప్రతి సినిమా హిట్టే.. కెరీర్‌లో ఒక్క ప్లాప్ మూవీ కూడా లేదంటే ఆయన కెపాసిటీ ఏంటో ఇట్టే అర్ధమవుతుంది. రాజమౌళి నుంచి సినిమా వస్తుందంటే.. తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా యావత్ దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురుస్తుందని, పాత రికార్డులు తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని అభిమానులే కాదు, సినీ విశ్లేషకులు కూడా అభిప్రాయపడతారు. 'ఆర్ఆర్ఆర్' సినిమాతో…

సలార్ ఫైట్ లీక్ పై మేకర్స్ సాలిడ్ రిప్లై
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పెద్ద సినిమాలకు లీకుల గోల తప్పట్లేదన్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలోనే ఇటీవలే గేమ్ ఛేంజర్ మేకర్స్ అయితే లీగల్ గా యాక్షన్ తీసుకుంటామని ఒక నోట్ కూడా రిలీజ్ చేశారు. ఇక ప్రభాస్ హీరోగా వస్తున్న సలార్ సినిమాకు కూడా లీకుల గోల తప్పట్లేదు. ఈసినిమాకు సంబంధించి కూడా అప్పుడప్పుడు పలు ఫొటోలు బయటకు వస్తూనే ఉన్నాయి.

దూసుకుపోతున్న మ్యాడ్ కలెక్షన్స్
కొన్నికొన్ని సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం చూపిస్తుంటాయి. ఈమధ్య కాలంలో అలాంటి సినిమాలు చాలానే వచ్చాయి. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన మ్యాడ్ సినిమా కూడా ఈ కోవలోకే వస్తుంది. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో నార్నె, సంగీత్ శోభన్,రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈసినిమా వచ్చింది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రావడంతో యూత్ ను మాత్రమే కాదు అందరినీ ఆకట్టుకుంటుంది. రిలీజ్ అయి ఫస్ట్ షో నుండే ఈసినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. కేవలం మౌత్ టాక్ తోనే ఈసినిమా మంచి ఆదరణను సొంతం చేసుకుంది. సూపర్ హిట్ ను సొంతం చేసుకొని ప్రస్తుతం బాక్సాఫీస్…

ఇండియన్ 2 డబ్బింగ్ మొదలుపెట్టిన కమల్
లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా ఇండియన్ 2. ఈసినిమా శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ అని అందరికీ తెలిసిందే. దాంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.

ఖైదీ సీక్వెల్ పై లోకేష్ మరోసారి క్లారిటీ
దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కార్తి ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా 'ఖైదీ'. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎలాంటి కమర్షియల్ హంగులు లేకుండా తెరకెక్కిన ఈసినిమా 2019 దీపావళి కానుకగా రిలీజ్ అయి.. మంచి విజయం దక్కించుకుంది. తమిళ్‌తో పాటు తెలుగు ఆడియన్స్‌ను కూడా విపరీతంగా ఆకట్టుకుంది ఈ సినిమా. ఇక వసూళ్ళ పరంగా కూడా ఈ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.

బబుల్ గమ్ టీజర్ రిలీజ్
సుమ-రాజీవ్ కనకాల తనయుడు రోషన్ కనకాల హీరోగా నటిస్తున్న చిత్రం బబుల్ గమ్.క్షణం,కృష్ణ అండ్ హిజ్ లీల లతో హిట్లు కొట్టిన దర్శకుడు రవికాంత్ పేరెపు డైరెక్ట్ చేస్తున్నాడు.ఇక ఈసినిమా టీజర్ కొద్దిసేపటి క్రితం విడుదలైయింది.యూత్ ను టార్గెట్ చేస్తూ తెరకెక్కుతుంది ఈసినిమా.నాచురల్ స్టార్ నాని ఈ టీజర్ ను లాంచ్ చేశాడు.టీజర్ లో హీరో, హీరోయిన్ల కెమిస్ట్రీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ అయ్యాయి.ఓవరాల్ గా టీజర్ అయితే ప్రామిసింగ్ గా వుంది.

దర్శకుడిగా 21 ఏళ్లు పూర్తి చేసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్.. స్పెషల్ స్టోరీ
త్రివిక్రమ్ శ్రీనివాస్.. ప్రస్తుత టాలీవుడ్‌లోని టాప్ డైరెక్టర్లలో ఒకరు. తొలుత మాటల రచయతగా సినీ కెరీర్ ప్రారంభించిన ఆయన ఆ తర్వాత దర్శకుడిగా ప్రమోషన్ అందుకున్నారు. మాటల మాంత్రికుడిగా పేరొందిన ఆయన తను పనిచేసిన సినిమాల్లో కావొచ్చు.. తాను తీసిన చిత్రాల్లో కావొచ్చు.. మాటల్లో మ్యాజిక్, డైలాగ్స్‌లో పంచ్‌లతో ప్రేక్షకులను అలరిస్తుంటారు. కాగా తెలుగు ఇండస్ట్రీలో మాటల రచయితగా మొదలుపెట్టి అగ్ర దర్శకుల రేంజ్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న దర్శకుడు ఇటీవలికాలంలో ఒక్క త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రమే. ఈ క్రమంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో 21 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ…

యానిమల్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటిస్తోన్న తాజా చిత్రం 'యానిమల్'. 'అర్జున్ రెడ్డి' ఫేమ్ సందీప్ వంగా దర్శకత్వం వహిస్తున్నారు. క్రేజీ కాంబినేషన్‌లో మోస్ట్ వైలెంట్ యాక్షన్ ఓరియెంటెడ్ కథాంశంగా రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. దీనికి ముందు సందీప్ వంగా షాహిద్ కపూర్‌తో చేసిన 'కబీర్ సింగ్' సినిమాతో బాలీవుడ్ లో సాలిడ్ హిట్ అందుకోవడంతో దీనిపై స్పెషల్ క్రేజ్ ఏర్పడింది. కాగా 'యానిమల్' చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ ముఖ్య పాత్రలో కనిపించనుండగా.. మరో ప్రముఖ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రలో కనిపించనున్నారు.

సుహాస్ అంబాజీపేట మ్యారేజి బ్యాండు టీజర్ రిలీజ్
సపోర్టింగ్ రోల్స్ నుండి హీరోగా మారి మొదటి సినిమాతోనే హిట్ ను అందుకొని ప్రస్తుతం చిన్న సినిమాలకు బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తున్నాడు సుహాస్. మంచి మంచి కథలను ఎంచుకుంటూ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉండగా అందులో అంబాజీపేట మ్యారేజి బ్యాండు కూడా ఒకటి. దుశ్యంత్ కటికనేని దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.

ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు పితృవియోగం
ఈ రెండు మూడేళ్లలో ఎంతో మంది సినీ ప్రముఖులను కోల్పోయింది టాలీవుడ్ ఇండస్ట్రీ. ఇప్పుడు మరో ప్రముఖ నిర్మాతకు పితృవియోగం కలిగింది. ఆ నిర్మాత మరెవరో కాదు. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి శ్యామ్ సుందర్ రెడ్డి మృతి చెందారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నేడు చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. దీంతో సినీ ప్రముఖులు దిల్ రాజు కు ఆయన కుంటుంబ సభ్యులకు సంతాపం తెలియచేస్తున్నారు.

రోషన్ బబుల్ గమ్ టీజర్ అప్ డేట్
బుల్లి తెర స్టార్ యాంకర్ సుమ తనయుడు రోషన్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే కదా. క్షణం, కృష్ణ అండ్ హిజ్ లీల సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రవికాంత్ పేరెపు దర్శకత్వంలో రోషన్ హీరోగా బబుల్ గమ్ సినిమా వస్తుంది. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.

ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ రిలీజ్ డేట్ ఫిక్స్
యంగ్ హీరో నితిన్ మాత్రం వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. అయితే నితిన్ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నా సరైన సక్సెస్ మాత్రం అందుకోలేకపోతున్నాడు. అందుకే సరైన హిట్ కోసం ఎప్పటినుండో ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం అయితే స్టార్ రైటర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో ఒక సినిమాతో వస్తున్నాడు. ఈసినిమా ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ అనే టైటిల్ తో వచ్చేస్తుంది. ఈసినిమా ఎప్పుడో షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. అంతేకాదు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టింది.

గేమ్ ఛేంజర్ షూటింగ్ అప్డేట్
ఆర్ఆర్ఆర్ తో గ్లోబల్ స్టార్ గా పేరుతెచ్చుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన 15వ చిత్రం గేమ్ ఛేంజర్ ను టాప్ డైరెక్టర్ శంకర్ తో చేస్తున్నాడు.నిజానికి ఎప్పుడో పూర్తి కావాల్సిన ఈసినిమా శంకర్ కు వున్న కమిట్ మెంట్స్ వల్ల ఆలస్యం అవుతూ వస్తుంది.ఇప్పటివరకు 60శాతం కంప్లీట్ కాగా ఈ రోజే హైదరాబాద్ లో మినీ షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది.ఈషెడ్యూల్ వారం రోజులు జరుగనుందని సమాచారం.గచ్చి బౌలీ, వికారాబాద్,శంషాబాద్ తదితర ఏరియాల్లో ఈషెడ్యూల్ ను షూట్ చేయనున్నారు. ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్ కూడా పాల్గొననున్నాడు.

భగవంత్ కేసరి ట్రైలర్ లో మీకు నచ్చిన ఎలిమెంట్స్?
సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వస్తున్న సినిమా భగవంత్ కేసరి. ఇప్పటివరకూ అనిల్ రావిపూడి కాస్త కామెడీ యాంగిల్ లోనే సినిమాలు తీసి సక్సెస్ లు అందుకున్నాడు. మొదటిసారి బాలకృష్ణతో యాక్షన్ సినిమాతో వస్తుండటంతో ఈసినిమాపై మొదటినుండీ భారీ అంచనాలు ఉన్నాయి. ఈసినిమా దసరా పండుగ సందర్బంగా అక్టోబర్ 19వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.

వెన్నెల కిషోర్ చారి 111 మూవీ షూటింగ్ కంప్లీట్
టాలీవుడ్ కమెడియన్లలో 'వెన్నెల' కిశోర్ శైలే వేరు. సినిమాల్లో కథానాయకుడి పాత్రధారి పైనా సెటైర్స్ వేయగల స్థాయి ఉన్న నటుడు. అమాయకత్వం, వ్యంగ్యం కలగలిసిన వినోదానికి ఆయన కేరాఫ్ అడ్రస్. 'వెన్నెల' కిశోర్ తన డిఫరెంట్ మేనరిజమ్స్, డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తుతారు. గమనిస్తే.. గత కొంతకాలంగా తెలుగు సినిమాలలో వెన్నెల కిశోర్ లేని సినిమా లేదంటే అతిశయోక్తి లేదు. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా అన్ని చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే వెన్నెల కిశోర్ కేవలం హాస్య నటుడిగా మాత్రమే కాదు, తనకు సరిపోయే క్యారెక్టర్లు వచ్చినప్పుడు కథానాయకుడిగానూ చేస్తుంటారు. ఈ క్రమంలో వెన్నెల…

మిమ్మల్ని బాగా ఇంప్రెస్ చేసిన ట్రైలర్?
పండుగ సీజన్ ఉందంటే ముందునుండే రిలీజ్ లకు సిద్దమవుతుంటాయి సినిమాలు. ముఖ్యంగా సంక్రాంతి, వినాయక చతుర్థి, దసరా, క్రిస్మస్ పండుగలను టార్గెట్ చేసుకొని సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి రెడీ అయిపోతుంటాయి. ఇప్పటికే సంక్రాంతి, వినాయక చతుర్థి అయిపోయాయి.. ఇక దసరా పండుగ రాబోతుంది. ఈ దసరాకు పలు సినిమాలు రిలీజ్ కు సిద్దమవుతున్నాయి. వాటిలో భగవంత్ కేసరి, లియో లాంటి భారీ సినిమాలు కూడా ఉన్నాయి. ఇక ఈరెండు సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. ఆ సినిమాల నుండి వచ్చిన అప్ డేట్లు కూడా రెండు సినిమాలకు సూపర్ హైప్ ను తెచ్చిపెట్టాయి. మరోవైపు ఈ రెండు సినిమాల ట్రైలర్ లు ఇప్పటికే రిలీజ్ అయిన సంగతి తెలిసిందే కదా. మరి ఈరెండు…