గేమ్ ఛేంజర్ షూటింగ్ అప్డేట్ 

game changer shooting update

ఆర్ఆర్ఆర్ తో  గ్లోబల్ స్టార్ గా పేరుతెచ్చుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన 15వ చిత్రం గేమ్ ఛేంజర్ ను టాప్ డైరెక్టర్ శంకర్ తో చేస్తున్నాడు.నిజానికి ఎప్పుడో పూర్తి కావాల్సిన ఈసినిమా శంకర్ కు వున్న కమిట్ మెంట్స్ వల్ల ఆలస్యం అవుతూ వస్తుంది.ఇప్పటివరకు 60శాతం కంప్లీట్ కాగా ఈ రోజే  హైదరాబాద్ లో మినీ షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది.ఈషెడ్యూల్ వారం రోజులు జరుగనుందని సమాచారం.గచ్చి బౌలీ, వికారాబాద్,శంషాబాద్ తదితర ఏరియాల్లో ఈషెడ్యూల్ ను షూట్ చేయనున్నారు. ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్ కూడా పాల్గొననున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సినిమా నుండి రామ్ చరణ్ బర్త్ డే సందర్బంగా ఈసినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ను విడుదలచేశారు. ఇప్పటివరకు మరో అప్డేట్ మాత్రం రాలేదు అయితే త్వరలోనే ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చే అప్డేట్ రానుందట.కమర్షియల్ అంశాలతో పాటు సోషల్ మెసేజ్ తో తెరకెక్కుతున్న ఈసినిమాలో చరణ్ సరసన కియరా అద్వానీ నటిస్తుంది.వీరిద్దరూ కలిసి నటించడం ఇది రెండో సారి.ఇంతకుముందు వీరు జంటగా వినయ విధేయ రామ చేశారు.

ఇక గేమ్ ఛేంజర్ లో శ్రీకాంత్ ,ఎస్ జె సూర్య ,నవీన్ చంద్ర,అంజలి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.థమన్ సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది ఈసినిమా.

ఈ సినిమా తరువాత రామ్ చరణ్ తన 16వ చిత్రాన్ని ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సన తో చేయనున్నాడు.పాన్ ఇండియా మూవీ గా విడుదలకానుంది.ఉప్పెన తరువాత బుచ్చిబాబు కు కావాల్సినంత టైం దొరకడంతో ఆర్ సి 16 స్క్రిప్ట్ ను అద్భుతంగా రాసుకున్నాడట.ఏఆర్ రహెమాన్ సంగీతం అందించనున్నాడు.మైత్రి మూవీ మేకర్స్ ,వ్రిద్ది సినిమాస్,సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లనుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.