ఈ రెండు మూడేళ్లలో ఎంతో మంది సినీ ప్రముఖులను కోల్పోయింది టాలీవుడ్ ఇండస్ట్రీ. ఇప్పుడు మరో ప్రముఖ నిర్మాతకు పితృవియోగం కలిగింది. ఆ నిర్మాత మరెవరో కాదు. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి శ్యామ్ సుందర్ రెడ్డి మృతి చెందారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నేడు చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. దీంతో సినీ ప్రముఖులు దిల్ రాజు కు ఆయన కుంటుంబ సభ్యులకు సంతాపం తెలియచేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
శ్యామ్ సుందర్‌రెడ్డి సతీమణి సుశీలమ్మ.. ఆయనకు ముగ్గురు సంతానం. విజయ్ సింహారెడ్డి, నరసింహారెడ్డి, దిల్ రాజు ఉన్నారు. దిల్ రాజు అసలు పేరు వెంకట రమణారెడ్డి. ఇక దిల్ రాజు కు వెనుక నుండి పిల్లర్ గా ఉండి ఇప్పుడు ఈ స్థాయిలో ఉండటానికి శ్యామ్ సుందర్ రెడ్డి ఎంతో తోడ్పడ్డారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
A tragedy in Producer #DilRaju’s family. His father #ShyamSundarReddy garu has passed his last breath this evening.
May his soul rest in peace. We send strength to the family in this hard time.🙏#RIPShyamSundarReddyGaru #OmShanthi #TeluguFilmNagar pic.twitter.com/eWb48y03Bn— Telugu FilmNagar (@telugufilmnagar) October 9, 2023
కాగా డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసి ఆ తర్వాత నిర్మాతగా మారి ఇప్పుడు టాలీవుడ్ లోనే పెద్ద ప్రొడ్యూసర్ గా ఎన్నో హిట్ సినిమాలు అందిస్తున్నాడు దిల్ రాజు. దిల్ రాజు సినిమా అంటే మినిమం గ్యారెంటీ అన్న నమ్మకం అందరిలో ఉంటుంది. సక్సెస్ ను ఎప్పుడూ జేబులో పెట్టుకొని ఉంటారా అన్నట్టు తను నిర్మించే సినిమాల్లో చాలా వరకూ అన్నీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్నే దక్కించుకుంటాయి. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ్ ఇంకా హిందీ లో కూడా సినిమాలు చేసుకుంటూ వెళుతూ తన మార్క్ ను చూపిస్తున్నాడు. దీనితో పాటు చిన్న సినిమాలను, కొత్త టాలెంట్ ను ప్రోత్సహించే దిశగా.. దిల్ రాజు ప్రొడక్షన్స్ పేరుతో కొత్త సంస్థను ఏర్పాటు చేసి మొదటిసినిమా బలగం తోనే అంతర్జాతీయంగా హిట్ తెచ్చుకున్నాడు. రీసెంట్ గానే తెలుగు ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడిగా కొత్త బాధ్యతలు చేపట్టారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: