కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Latest Telugu Movies News

ట్యాగ్ · 17286 కథనాలు · పేజీ 259

thangalaan telugu movie teaser release date fixed
ట్రైలర్ & టీజర్

తంగలాన్ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

తెలుగు, తమిళ చిత్రాల్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసి తిరుగులేని స్థానాన్ని దక్కించుకున్న విలక్ష‌ణ న‌టుడు చియాన్ విక్ర‌మ్‌. తన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యత ఉండేలా చూసుకుంటాడు. ఇక రీసెంట్ గానే పొన్నియన్ 2 సెల్వన్ సినిమాతో బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు మరో ప్రాజెక్ట్ తో వచ్చేస్తున్నాడు చియాన్ విక్రమ్. పా రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా వస్తున్న సినిమా తంగలాన్. ప్రస్తుతం అయితే షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చేసింది.

TFN Adminవాట్సాప్
Varun Tej-Lavanya Tripathi Wedding Ram Charan and Allu Arjun Shines at Cocktail Party
సినిమా వార్తలు

వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి వెడ్డింగ్.. కాక్టెయిల్ పార్టీలో సందడి చేసిన మెగా హీరోస్

టాలీవుడ్‌ స్టార్ హీరో, మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌, హీరోయిన్ లావణ్య త్రిపాఠిల వివాహం మరికొన్ని గంటల్లో జరుగనుంది. ఇటలీలోని టస్కనీలో రేపు (నవంబర్‌ 1, 2023) వీరి వివాహం జరుగనుంది. ఈ మేరకు కుటుంబ పెద్దలు మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాగా మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా తన సతీమణి అన్నా లెజ్నెవాతో కలిసి సోదరుడు నాగబాబు తనయుడి వివాహానికి హాజరయ్యేందుకు ఇప్పటికే ఇటలీ చేరుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటలీ చేరుకున్న మెగా ఫ్యామిలీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌ షురూ చేసింది. దీనిలో భాగంగా సోమవారం రాత్రి వరుణ్-లావణ్య…

Srikanth Mవాట్సాప్
nuvve nuvve song out from Sapta Sagaralu Dhaati movie
సాంగ్

సప్త సాగరాలు దాటి - సైడ్ బి నువ్వే నువ్వే సాంగ్ రిలీజ్

కన్నడ సినిమాలకు కూడా ఇప్పుడు మంచి డిమాండ్ ఏర్పడింది. అక్కడ రిలీజ్ అయి హిట్ అయిన సినిమాలను ఇక్కడ కూడా రిలీజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు తెలుగు మేకర్స్ కూడా. అందుకే సినిమా హక్కులను సొంతం చేసుకుంటూ ఇక్కడ రిలీజ్ చేస్తున్నారు. ఈమధ్య కాలంలో పలు సినిమాలను రిలీజ్ చేయగా.. ఇప్పుడు మరో సినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. హేమంత్ ఎం రావు దర్శకత్వంలో రక్షిత్ శెట్టి హీరోగా వచ్చిన సినిమా సప్త సాగరాలు దాటి. ఈ సినిమా కన్నడలో సూపర్ హిట్ అయింది. దీంతో ఇక్కడ కూడా రిలీజ్ చేయగా ఇక్కడ కూడా హిట్ అయింది.

TFN Adminవాట్సాప్
ntr devara movie powerful dialogues
సినిమా వార్తలు

దేవర మాస్ జాతర- పవర్ ఫుల్ వన్ లైనర్స్

ఒక సినిమా హిట్ అవ్వాలంటే ఎన్నో సమీకరణాలు ఉంటాయి. సినిమాకు కథ ఎంత ముఖ్యమో.. ఆసినిమాలో వచ్చేకొన్ని డైలాగ్స్ కూడా అంతే ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇక ఈ మధ్య కాలంలో వన్ లైనర్స్ కు బాగా అట్రాక్ట్ అవుతున్నారు ఆడియన్స్. అయితే అలాంటి డైలాగ్స్ రాయడం అనేది అందరి డైరెక్టర్లకు రాదు. ఒక్కొక్కరికీ ఒక్కో స్టైల్ ఉంటుంది. ఉదాహరణకు త్రివ్రికమ్ పలికించే డైలాగ్స్ సమాజం, విలువలు అన్నట్టు ఉంటాయి.. పూరీ దగ్గరకు వచ్చేసరికి రియలిస్టిక్ గా ఉంటాయి. ఇక కొరటాల ది కూడా సెపరేట్ స్టైల్.

TFN Adminవాట్సాప్
Venkatesh First Single Update Look Goes Viral From Saindhav
ఫస్ట్ లుక్

సైంధవ్‌ ఫస్ట్‌ సింగిల్‌ అప్‌డేట్‌.. వెంకీ కొత్త పోస్టర్‌ వైరల్‌

టాలీవుడ్ స్టార్ హీరో, విక్టరీ వెంకటేష్ టైటిల్‌ రోల్‌లో నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'సైంధవ్‌'. కాగా ఆయనకి ఇది 75వ చిత్రం కావడం విశేషం. 'హిట్' ఫేమ్ శైలేష్‌ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఫ్యామిలీ అండ్ యాక్షన్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో రూపొందుతోంది. 'చంద్రప్రస్థ' అనే ఒక ఫిక్షనల్ పోర్ట్‌ ఏరియా బ్యాక్‌డ్రాప్‌లో ఈ స్టోరీ జరుగనుంది. ఈ మూవీలో 'జెర్సీ' ఫేమ్ శ్రద్ధా శ్రీనాథ్‌ ఫీ మేల్ లీడ్‌ రోల్‌లో నటిస్తోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో గ్రాండ్‌ రిలీజ్ కానుంది.

Srikanth Mవాట్సాప్
Sapta Sagaralu Dhaati Side B first single release update
సినిమా వార్తలు

సప్త సాగరాలు దాటి - సైడ్ బి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అప్ డేట్

కన్నడ స్టార్ హీరో అయిన రక్షిత్ శెట్టి అతడే శ్రీమన్నారాయణ, 777 చార్లీ సినిమాలతో తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక రీసెంట్ గా వచ్చిన సప్త సాగరాలు దాటి సినిమాతో అయితే తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈసినిమా కన్నడలో రిలీజ్ అయి సూపర్ హిట్ అవ్వడంతో ఇక్కడ కూడా ఈసినిమాను రిలీజ్ చేశారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు ఈసినిమా హక్కులను సొంతం చేసుకొని ఇక్కడ రిలీజ్ చేశారు. ఇక్కడ కూడా మంచి టాక్ ను సొంతం చేసుకుంది.

TFN Adminవాట్సాప్
extra ordinary man teaser out
ట్రైలర్ & టీజర్

ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ టీజర్ రిలీజ్

యంగ్ హీరో నితిన్ ,నాపేరు సూర్య డైరెక్టర్ వక్కంతం వంశీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్.టైటిల్ తోనే సినిమాపై క్యూరియాసిటీని పెంచగా రీసెంట్ గా విడుదలైన డేంజర్ పిల్లా అనే పాట కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.వీటికి తోడు సీనియర్ హీరో,యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ విలన్ గా నటిస్తుండడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.ఇక ఈసినిమా నుండి తాజాగా టీజర్ కూడా విడుదలచేశారు.

Mahender Reddyవాట్సాప్
vijay leo movie uk collections update
బాక్సాఫీస్

లియో సెన్సేషన్ యూకే కలెక్షన్స్

విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన సినిమా లియో. విజయ్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ అందరూ ఈసినిమా కోసం ఎంతగానో ఎదురుచూశారు. ఇక ఫైనల్ గా అక్టోబర్ 20వ తేదీన ఈసినిమా రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిజానికి ఈసినిమా మిక్డ్స్ టాక్ ను సొంతం చేసుకుంది అయినా కూడా ఈసినిమా కలెక్షన్స్ లో మాత్రం ఎక్కడా రాజీపడలేదు. కేవలం 6 రోజుల్లోనే ఈసినిమా 500 కోట్లను సొంతంచేసుకుంది.

TFN Adminవాట్సాప్
mad ott release date lock
ఓటీటీ

మ్యాడ్ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్

చిన్న సినిమాగా వచ్చి బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది మ్యాడ్.ఈనెల 6న విడుదలైన ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 20కోట్ల వసూళ్లను రాబట్టి సెన్సేషన్ సృష్టించింది.కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వచ్చిన మ్యాడ్ యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంది.కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యూఎస్ఏ లోనూ 500k డాలర్ల ను రాబట్టి హిట్ అనిపించుకుంది.దసరా సీజన్ లో పెద్ద సినిమాలు రావడంతో మ్యాడ్ హావ తగ్గింది లేకపోతే సినిమా కలెక్షన్స్ మరింత పెరిగేవే.

Mahender Reddyవాట్సాప్
Allu Aravind Suggests Sita Ramam Fame Mrunal Thakur To Marry Telugu Guy
సినిమా వార్తలు

మృణాల్ ఠాకూర్‌కు అల్లు అరవింద్ బ్లెస్సింగ్స్.. ఏ విషయంలో అంటే?

టాలీవుడ్ అగ్రనిర్మాత అల్లు అరవింద్ 'సీతా రామం' ఫేమ్ మృణాల్ ఠాకూర్‌ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె త్వరలోనే ముంబై నుంచి హైదరాబాద్‌కు తిరిగిరావాలని ఆకాంక్షించారు. అంతేకాదు.. ఆమె ఒక ఒక తెలుగు కుర్రాడిని పెళ్లి చేసుకుని పర్మనెంటుగా ఇక్కడే ఉండిపోవాలని కూడా సూచించారు. బ్లెస్సింగ్స్ అందజేశారు. అయితే వాస్తవానికి మృణాల్ ఠాకూర్ మరాఠీ అమ్మాయి అయినా.. 'సీతారామం' సినిమాలోని సీత పాత్రతో తెలుగు ప్రజల మదిపై చెరగని ముద్ర వేసింది. ఈ సినిమా తర్వాత ఆమెకు అనేక తెలుగు సినిమాలలో వరుస ఆఫర్స్ అందుతున్నాయి. వీటిలో ఒకటి.. వచ్చే నెలలో విడుదల కానున్న నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన 'హాయ్ నాన్న'. అలాగే…

Srikanth Mవాట్సాప్
gentleman 2 movie first schedule wrapped up
షూటింగ్ అప్‌డేట్

జెంటిల్‌మెన్ 2 ఫస్ట్ షెడ్యూల్ పూర్తి

శంకర్ దర్శకత్వంలో అర్జున్‌, మధుబాల హీరో హీరోయిన్లుగా వచ్చిన జెంటిల్‌మేన్‌ సినిమా తమిళ, తెలుగు భాషల్లో అప్పట్లో ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. 1993లో రిలీజ్ అయిన ఈసినిమా ప్రభంజనం సృష్టించింది. ఇప్పుడు ఈసినిమాకు సీక్వెల్ వస్తున్న సంగతి తెలిసిందే కదా. గోకుల్ కృష్ణ దర్శకత్వంలో చేతన్ హీరోగా ఈసినిమా వస్తుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.

TFN Adminవాట్సాప్
ambajipeta marriage band movie gumma song out now
సాంగ్

అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు- గుమ్మ సాంగ్ రిలీజ్

విభిన్నమైన సినిమాలు ఎంచుకుంటూ మంచి హిట్లను అందుకుంటూ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు సుహాస్. ఈసారి కూడా అలాంటి కంటెంట్ ఒరియెంటెడ్ సినిమాతోనే వచ్చేస్తున్నాడు. దుశ్యంత్ కటికనేని దర్శకత్వంలో సుహాస్ హీరోగా వస్తున్న సినిమా అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోవైపు ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. ఈమధ్యే టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

TFN Adminవాట్సాప్
Japan Trailer Launch Event Suriya and Karthi Selfie Video with Fans Goes Viral
ట్రైలర్ & టీజర్

జపాన్‌ ట్రైలర్‌ లాంఛింగ్‌ ఈవెంట్‌.. సూర్య, కార్తీ సెల్ఫీ వీడియో, నెట్టింట వైరల్

తెలుగులో స్టార్ హీరోల రేంజ్‌లో క్రేజ్ దక్కించుకున్న ప్రముఖ తమిళ హీరోలు సూర్య, కార్తీ ముందు వరుసలో ఉంటారు. వీరిద్దరూ అన్నదమ్ములే అన్న విషయం తెలిసిందే. కెరీర్ ప్రారంభం నుంచీ వీరు తమిళంతో పాటు తెలుగులోనూ తమ సినిమాలను రిలీజ్‌ చేయడంతో హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. దీంతో వీరి సినిమాల‌కు ఇక్కడ టైర్ 2 హీరోల స్థాయిలో మంచి కలెక్షన్‌లు వస్తుంటాయి. ముఖ్యంగా హీరో కార్తీ అయితే తన సినిమా ప్రమోషన్స్ సమయంలో కార్తి తెలుగులో స్పష్టంగా మాట్లాడటం, అలాగే సినిమాల్లోని తన పాత్రలకు తానే సొంతంగా తెలుగులో డబ్బింగ్ చెప్పుకోవడంతో టాలీవుడ్ ఆడియన్స్ ఫిదా అయ్యారు.

Srikanth Mవాట్సాప్
santosh soban new movie withe baby movie team
సినిమా వార్తలు

బేబి టీమ్ తో సంతోష్ శోభన్- ఇంటెన్స్ గా ప్రీ లుక్

యంగ్ హీరో సంతోష్ శోభన్ మాత్రం వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నా సరైన హిట్ అందుకోలేకపోతున్నాడు. గోల్కొండ హైస్కూల్ సినిమాలో ఒక పాత్రలో నటించి ఇండస్ట్రీలోకి సంతోష్ శోభన్. ఆతరువాత తను నేను, పేపర్ బాయ్, ఏక్ మిని కథ, మంచి రోజులు వచ్చాయి, లైక్ షేర్ సబ్ స్క్రైబ్, అన్నీ మంచి శకునములే, ప్రేమ్ కుమార్ ఇలా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు.

TFN Adminవాట్సాప్
balakrishna bhagavanth kesari movie 11 days collections
బాక్సాఫీస్

భగవంత్ కేసరి బ్లాక్ బస్టర్ 11 డేస్ కలెక్షన్స్

వరుస హిట్లతో హిట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు అనిల్ రావిపూడి. ఇక ఇప్పుడు భగవంత్ కేసరి సినిమాతో మరో హిట్ ను అందుకొని మరోసారి తన సత్తాను చాటాడు. ఇదే సినిమాతో బాలకృష్ణ కూడా హ్యాట్రిక్ ను అందుకున్నాడు. ఫాదర్ డాటర్ సెంటిమెంట్ తో ఈసినిమా రాగా బాలకృష్ణను అనిల్ కొత్త గా చూపించిన విధానం అందరికీ నచ్చింది. అంతేకాకుండా బాలకృష్ణ-శ్రీలీల మధ్య వచ్చే సన్నివేశాలు.. యాక్షన్ సీన్స్, థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇలా అన్ని ఎలిమెంట్స్ సినిమాకు ప్లస్ పాయింట్స్ అయ్యాయి.

TFN Adminవాట్సాప్
Hi Nanna movie third single Ammaadi song release date fixed
సాంగ్

హాయ్ నాన్న- అమ్మాడి సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్

శౌర్యువ్ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ లాంటి క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా హాయ్ నాన్న. లవ్ ప్లస్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా ఈసినిమాను రూపొందిస్తున్నారు. దసరా సినిమ తరువాత వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై మంచి ఎక్స్ పెక్టషన్స్ ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. ఇక రీసెంట్ గా ఈసినిమా నుండి టీజర్ చేయగా టీజర్ అయితే సినిమాపై ఉన్న అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది.

TFN Adminవాట్సాప్
Brahmanandam Funny Speech at Keedaa Cola Pre-release Event
సినిమా వార్తలు

అలా అడగాలంటే.. నా ఇగో అడ్డొస్తుంది - బ్రహ్మానందం ఇంట్రెస్టింగ్ కామెంట్స్

‘పెళ్లి చూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’ వంటి హిట్ చిత్రాల తర్వాత దర్శకుడు తరుణ్ భాస్కర్‌ దాస్యం నుంచి వస్తున్న మూడవ చిత్రం ‘కీడా కోలా’. క్రైం కామెడీ నేప‌థ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రముఖ టాలీవుడ్‌ హాస్య నటుడు బ్రహ్మానందం ఒక కీలక పాత్రలో నటిస్తుండగా.. త‌రుణ్ భాస్కర్‌, చైత‌న్య రావు, రవీంద్ర విజయ్‌, హరికాంత్, రఘురామ్‌ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. నవంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మురం చేశారు మేకర్స్. దీనిలో భాగంగా.. ఆదివారం (డిసెంబర్ 29, 2023) హైదరాబాద్‌లోని ఎన్‌ కన్వెన్షన్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని…

Srikanth Mవాట్సాప్
Manchu Vishnu Injured During Kannappa Shooting
షూటింగ్ అప్‌డేట్

కన్నప్ప షూటింగ్ లో ప్రమాదం- గాయపడ్డ విష్ణు

ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో మంచువిష్ణు హీరోగా వస్తున్న సినిమా కన్నప్ప. మహాశివుడి పరమ భక్తుడు భక్తు కన్నప్ప జీవిత నేపథ్యంలో ఈసినిమాను రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటున్న సంగతి కూడా తెలిసిందే. న్యూజిలాండ్ లో ఈసినిమాలోని కీలక షెడ్యూల్ ను చిత్రీకరిస్తున్నారు. ఇక ఈ షూటింగ్ లో భాగంగా ప్రమాదం చోటుచేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలోని కొన్ని యాక్షన్స్‌ సీక్వెన్సులను డ్రోన్‌ సాయంతో షూట్‌ చేస్తున్నారట. ఈ క్రమంలోనే డ్రోన్‌ అదుపు తప్పి నేరుగా వచ్చి మంచు విష్ణు మీద పడిందట. దీంతో మంచు విష్ణుకు స్వల్ప గాయాలయ్యాయట. దీంతో…

TFN Adminవాట్సాప్
Vijay Deverakonda Announces His Movie with Director Tharun Bhascker
సినిమా వార్తలు

పెళ్లిచూపులు కాంబో రిపీట్.. త్వరలో తరుణ్ భాస్కర్‌తో విజయ్ దేవరకొండ సినిమా

'పెళ్లి చూపులు' కాంబో రిపీట్ కాబోతోంది. టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ మరియు ట్యాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్‌ కలయికలో త్వరలో కొత్త సినిమా రూపొందనుంది. ఈ మేరకు హీరో విజయ్ దేవరకొండ స్వయంగా వెల్లడించారు. ఆయన ముఖ్య అతిథిగా హాజరైన 'కీడా కోలా' చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో భాగంగా ఆయన ఈ విషయాన్ని తెలిపారు. కాగా 'పెళ్లి చూపులు', 'ఈ నగరానికి ఏమైంది' వంటి హిట్ చిత్రాల తర్వాత దర్శకుడు తరుణ్ భాస్కర్‌ దాస్యం నుంచి వస్తున్న మూడవ చిత్రం 'కీడా కోలా'. క్రైం కామెడీ నేప‌థ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రముఖ టాలీవుడ్‌ హాస్య నటుడు బ్రహ్మానందం ఒక కీలక పాత్రలో నటిస్తుండగా.. త‌రుణ్ భాస్కర్‌, చైత‌న్య…

Srikanth Mవాట్సాప్
jigarthanda double x movie release date fixed
రిలీజ్ అప్‌డేట్

ఫైనల్లీ వచ్చేసిన జిగర్ తండ డబల్ ఎక్స్ రిలీజ్ డేట్

తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో సిద్దార్థ్, బాబి సింహా ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా జిగర్ తండ ఎంత సూపర్ హిట్ అయిందో తెలిసిందే కదా. ఈసినిమాకు తెలుగులో రీమేక్ కూడా వచ్చింది. ఇక ఇప్పుడు ఈసినిమా సీక్వెల్ వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సీక్వెల్ లో లారెన్స్ హీరోగా నటిస్తుండగా.. ఎస్ జే సూర్య మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది.

TFN Adminవాట్సాప్

షేర్