వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి వెడ్డింగ్.. కాక్​టెయిల్ పార్టీలో సందడి చేసిన మెగా హీరోస్

Varun Tej-Lavanya Tripathi Wedding Ram Charan and Allu Arjun Shines at Cocktail Party

టాలీవుడ్‌ స్టార్ హీరో, మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌, హీరోయిన్ లావణ్య త్రిపాఠిల వివాహం మరికొన్ని గంటల్లో జరుగనుంది. ఇటలీలోని టస్కనీలో రేపు (నవంబర్‌ 1, 2023) వీరి వివాహం జరుగనుంది. ఈ మేరకు కుటుంబ పెద్దలు మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాగా మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా తన సతీమణి అన్నా లెజ్నెవాతో కలిసి సోదరుడు నాగబాబు తనయుడి వివాహానికి హాజరయ్యేందుకు ఇప్పటికే ఇటలీ చేరుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటలీ చేరుకున్న మెగా ఫ్యామిలీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌ షురూ చేసింది. దీనిలో భాగంగా సోమవారం రాత్రి వరుణ్-లావణ్య జంట అతిథులకు కాక్‌ టెయిల్‌ పార్టీ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ పార్టీకి రామ్‌చరణ్-ఉపాసన, అల్లు అర్జున్‌-స్నేహా రెడ్డి జంటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అలాగే టాలీవుడ్ హీరోలు సాయి ధరమ్ తేజ్, నితిన్ తదితరులు కూడా హాజరయ్యారు. వీరితో పాటుగా మెగా-అల్లు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పాల్గొని సందడి చేశారు. ఇక ఈ పార్టీలో పెళ్ళికొడుకు వరుణ్ తేజ్, పెళ్లికూతురు లావణ్య వైట్‌ డ్రెస్‌లో మెరిశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. అయితే వీరి వివాహానికి మెగా ఫ్యామిలీ మెంబర్స్ సహా అతి కొద్దిమంది సన్నిహితులు మాత్రమే హాజరవుతున్నట్లు సమాచారం. ఇక ఇటలీలో వివాహ వేడుక తరువాత, నవంబర్ 5వ తేదీన మాదాపూర్‌లోని ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో తెలుగు చిత్ర పరిశ్రమలోని ముఖ్యుల కోసం ఒక భారీ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు.

ఇక ఇదిలా ఉండగా.. వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠి ప్రీ వెడ్డింగ్‌ వేడుకల్లో భాగంగా నేడు హల్డీ ఫంక్షన్ నిర్వహించనున్నారు. ఈ హల్దీ వేడుక కోసం లావణ్య స్పెషల్‌ లెహంగాలో మెరవనున్నారు. పెళ్లికి ముందు జరిగే హల్దీ వేడుక ఎప్పటికీ గుర్తుండి పోయేలా లావణ్య తల్లి చీరతో ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ అర్చనా రావు ఈ లెహెంగా డ్రెస్‌ను డిజైన్‌ చేశారు. ఇక హల్దీ వేడుక పూర్తి అయిన తర్వాత ఈ సాయంత్రం మెహందీ వేడుక జరుగనుంది. అలాగే వీటితోపాటు రాత్రికి ఒక స్పెషల్‌ థీమ్‌తో పూల్‌ పార్టీ కూడా జరగనుందని, దీనిలో అందరూ ఎల్లో, వైట్‌, పింక్‌ కలర్‌ దుస్తులు ధరించి పాల్గొననున్నారని సమాచారం. ఇక ఇప్పటికే వరుణ్‌ తేజ్‌, లావణ్య వెడ్డింగ్‌ కార్డ్‌ ఇప్పటికే సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన విషయం తెలిసిందే.

కాగా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిన సంగతే. ఈ క్రమంలో ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి వీరు పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఈ నేపథ్యంలోనే కొన్ని నెలల క్రితం వీరి నిశ్చితార్ధం జరుగగా.. ఇప్పుడు ఇటలీలో వివాహం జరగబోతోంది. ఇక ఇదిలా ఉండగా.. వరుణ్ తేజ్ సినిమాల విషయానికొస్తే, ఇటీవలే ‘గాంఢీవధారి అర్జున’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ప్రస్తుతం ‘ఆపరేషన్ వాలెంటైన్’ అనే మూవీలో నటిస్తున్నారు. అలాగే ‘పలాస’ ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వంలో ‘మట్కా’ అనే సినిమాను చేస్తున్నాడు వరుణ్ తేజ్.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × two =