కన్నడ స్టార్ హీరో అయిన రక్షిత్ శెట్టి అతడే శ్రీమన్నారాయణ, 777 చార్లీ సినిమాలతో తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక రీసెంట్ గా వచ్చిన సప్త సాగరాలు దాటి సినిమాతో అయితే తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈసినిమా కన్నడలో రిలీజ్ అయి సూపర్ హిట్ అవ్వడంతో ఇక్కడ కూడా ఈసినిమాను రిలీజ్ చేశారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు ఈసినిమా హక్కులను సొంతం చేసుకొని ఇక్కడ రిలీజ్ చేశారు. ఇక్కడ కూడా మంచి టాక్ ను సొంతం చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమా రెండు భాగాలుగా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు ఈ పార్ట్ ను రిలీజ్ చేస్తున్న సంగతి కూడా విదితమే. నవంబర్ 17వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు. సప్త సాగరాలు దాటి-సైడ్ బి అంటూ తెలుగులో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టేశారు. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. నువ్వే నువ్వే అంటూ ఈపాటను రేపు అంటే అక్టోబర్ 31వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.
Behold, as love takes the centre stage!
‘Nuvve Nuvve’ the first single from ‘Sapta Sagaralu Dhaati – Side B,’ will be out tomorrow✨♥️#SSDSideBNov17 @rakshitshetty @hemanthrao11 @rukminitweets @Chaithra_Achar_ @charanrajmr2701 @AdvaithaAmbara @ParamvahStudios #SSDSideB pic.twitter.com/uZxIhbclHP
— People Media Factory (@peoplemediafcy) October 30, 2023
కాగా హేమంత్ ఎం రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రక్షిత్ శెట్టి కి జోడీదా రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించింది. ఈసినిమాకు సంగీతం చరణ్ రాజ్ అందించారు. అద్వైత గురుమూర్తి సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: