సైంధవ్‌ ఫస్ట్‌ సింగిల్‌ అప్‌డేట్‌.. వెంకీ కొత్త పోస్టర్‌ వైరల్‌

Venkatesh First Single Update Look Goes Viral From Saindhav

టాలీవుడ్ స్టార్ హీరో, విక్టరీ వెంకటేష్ టైటిల్‌ రోల్‌లో నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘సైంధవ్‌’. కాగా ఆయనకి ఇది 75వ చిత్రం కావడం విశేషం. ‘హిట్’ ఫేమ్ శైలేష్‌ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఫ్యామిలీ అండ్ యాక్షన్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో రూపొందుతోంది. ‘చంద్రప్రస్థ’ అనే ఒక ఫిక్షనల్ పోర్ట్‌ ఏరియా బ్యాక్‌డ్రాప్‌లో ఈ స్టోరీ జరుగనుంది. ఈ మూవీలో ‘జెర్సీ’ ఫేమ్ శ్రద్ధా శ్రీనాథ్‌ ఫీ మేల్ లీడ్‌ రోల్‌లో నటిస్తోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో గ్రాండ్‌ రిలీజ్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో మూవీకి సంబంధించి మేకర్స్ వరుస అప్‌డేట్స్ ఇస్తూ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నారు. దీనిలో భాగంగా తాజాగా ‘సైంధవ్‌’ ఫస్ట్‌ సింగిల్‌ త్వరలో రాబోతోంది అంటూ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా వెంకటేష్ కొత్త పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు. అందులో వెంకీ ఫుల్ హ్యాపీ మూడ్‌లో ఉన్నట్లు కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్‌ నెట్టింట వైరల్ అవుతోంది. కాగా ఈ చిత్రం ద్వారా బాలీవుడ్‌ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ టాలీవుడ్‌లో అడుగుపెడుతున్నారు. అలాగే కోలీవుడ్‌ స్టార్ హీరో ఆర్య, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఇక ఇంతకుముందు విడుదల చేసిన ‘సైంధవ్‌’ గ్లింప్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచగా.. చిత్రంలోని కీలక పాత్రలను పరిచయం చేస్తూ లాంఛ్ చేసిన వీడియో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. కాగా ‘సైంధవ్‌’లో శ్రద్ధా శ్రీనాథ్‌ ‘మనోజ్ఞ’గా, రుహానీ శర్మ ‘డాక్టర్‌’గా, నవాజుద్దీన్ సిద్దిఖీ ‘వికాస్ మాలిక్’గా, ఆర్య ‘మానస్’ పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై వెంకట్‌ బోయనపల్లి నిర్మిస్తుండగా.. సంతోష్‌ నారాయణన్‌ సంగీతం సమకూరుస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 4 =