కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Latest Telugu Movies News

ట్యాగ్ · 17286 కథనాలు · పేజీ 176

director sekhar kammula sharing interesting facts about his films
ఇంటర్వ్యూ

సిద్ధాంతాలు, విలువలు పాటించి సినిమాలు తీస్తాను

నేషనల్అవార్డ్ విన్నర్ దర్శకుడు శేఖర్ కమ్ముల 2007 లో వచ్చిన సినిమా హ్యపీడేస్. ఈ సినిమా అప్పట్లో విమర్శకుల ప్రశంసలను కూడా పొందింది. అంతా కొత్తవారితో తీసిన ఆ సినిమాను మరలా ఏప్రిల్ 19 న రి రిలీజ్ చేస్తున్నారు. దర్శకుడు శేఖర్ కమ్ముల 2000లో డాలర్ డ్రీమ్స్ చిత్రంతో దర్శకుడు గా వెలుగులోకి వచ్చారు. ఆ తరవాత హ్యాపీ డేస్ నుంచి లవ్ స్టోరీ వరకు పలు సినిమాలు చేశారు. ఆయన సినిమా అంటే ఓ బ్రాండ్. మంచి విలువలతో సినిమాలు చేస్తున్న ఆయన దర్శకుడిగా 24 ఏళ్ళు పూర్తి చేసుకుని 25 ఏట ప్రవేశించిన సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల పలు విషయాలను మీడియాతో సంభాషించారు.

TFN Adminవాట్సాప్
lachimakka lyrical song out from jithender reddy movie
సాంగ్

జితేందర్ రెడ్డి నుండి లచ్చిమక్కా- అర్చనక్కా కలర్ ఫుల్ సాంగ్ రిలీజ్

బాహుబలి, ఎవరికి చెప్పొద్దు వంటి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో విరించి వర్మ దర్శకత్వంలో వస్తున్న సినిమా జితేందర్ రెడ్డి. 1980 కాలంలో జరిగిన వాస్తవిక సంఘటనలు ఆధారంగా పొలిటికల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు.

TFN Adminవాట్సాప్
Yuvan Shankar Raja clarifies on his Instagram account
సినిమా వార్తలు

ఇంస్టా డియాక్టీవ్ పై స్పందించిన యువన్

ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా ఇంస్టాగ్రామ్ అకౌంట్ డియాక్టీవ్ అయ్యింది.అయితే ఈ ఇంస్టా డియాక్టీవ్ పై సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది.రీసెంట్ గా తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న ది గోట్ నుండి విజిల్ పోడు అనే సాంగ్ రిలీజ్ అయ్యింది.ఈ సినిమాకు యువన్ సంగీతం అందిస్తున్నాడు.ఈ సాంగ్ రికార్డు వ్యూస్ ను కూడా రాబట్టుకుంది.వినగా వినగా సాంగ్ కూడా బాగానే ఎక్కుతుంది.అయితే విజయ్ కు తగ్గ సాంగ్ యువన్ ఇవ్వలేదని కొన్ని విమర్శలు వచ్చాయి.దాంతో ఫ్యాన్స్ విమర్శలను తట్టుకోలేక యువన్ శంకర్ రాజా తన ఇంస్టా ను డియాక్టీవ్ చేసుకున్నాడని సోషల్ మీడియా లో వార్తలు వచ్చాయి.

Mahender Reddyవాట్సాప్
sharwanand manamey movie teaser time fixed
ట్రైలర్ & టీజర్

మనమే టీజర్ రిలీజ్ టైమ్ ఫిక్స్

కొంత గ్యాప్ తరువాత ప్రస్తుతం యంగ్ హీరో శర్వానంద్ పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో ముందుగా రిలీజ్ కు సిద్దమవుతున్న సినిమా మనమే. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా వస్తున్న సినిమా మనమే. ఈ మూవీ టైటిల్ ని అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన గ్లింప్స్ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. మరోవైపు మ్యూజికల్ జర్నీని కూడా స్టార్ట్ చేసారు. ఇప్పటికే ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయగా ఆ పాటకు కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

TFN Adminవాట్సాప్
guntur kaaram gets solid trp ratings
సినిమా వార్తలు

టీఆర్పీ రేటింగ్స్ లో అదరగొట్టిన గుంటూరు కారం

సూపర్ స్టార్ మహేష్ బాబు ,స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబో లో వచ్చిన మూడో సినిమా గుంటూరు కారం.ఈసంక్రాంతికి భారీ అంచనాలతో విడుదలైన ఈసినిమా 100కోట్లకుపైగా వసూళ్లను రాబట్టుకుంది. ఇక థియేట్రికల్ రన్ తరువాత ఓటిటి లోకి రాగ అందులో కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక రీసెంట్ గా టీవీ ప్రీమియర్ లో కూడా అదరగొట్టింది.ఈ ఉగాది కానుకగా ఈనెల 7న ఈ సినిమాను జెమినీ టీవీ మొదటి సారి ప్రసారం చేయగా ఏకంగా 9.23 రేటింగ్స్ ను సొంతం చేసుకుంది.ఈ మధ్య స్టార్ హీరోల సినిమాలకు సరైన రేటింగ్స్ రావడం లేదు. ఓటిటి ప్రభావం ఎక్కువగా ఉండడంతో చాలా సినిమాలు నార్మల్ రేటింగ్స్ ను రాబట్టుకుంటాయి కానీ గుంటూరు కారం మాత్రం ఓటిటి అలాగే…

Mahender Reddyవాట్సాప్
director harish shankar visited ayodhya ram mandir
సినిమా వార్తలు

మిస్టర్ బచ్చన్- అయోధ్యలో రామ్ లల్లా బ్లెస్సింగ్స్ తీసుకున్న టీమ్

మాస్ మహారాజా రవితేజ మాత్రం జయాపజయాలతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. గత ఏడాది ఇప్పటికే పలు సినిమాలు రిలీజ్ చేయగా ఈ ఏడాది అప్పుడే ఈగల్ అంటూ వచ్చేశాడు. ఈసినిమా డీసెంట్ హిట్ ను అందుకుంది. ఇక ఇప్పుడు ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ అనే సినిమాను చేస్తున్నాడు. ఈసినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Megastar Felicitates Maharshi Raghava During His 100th Blood Donation at Chiranjeevi Blood Bank
సినిమా వార్తలు

మహర్షి రాఘవను ఘనంగా సత్కరించిన మెగాస్టార్

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సీనియర్ నటుడు మహర్షి రాఘవను ఘనంగా సత్కరించారు. ఈ స‌న్మాన కార్య‌క్ర‌మంలో రాఘవ స‌తీమ‌ణి శిల్పా చ‌క్ర‌వ‌ర్తి, అలాగే మరో సీనియర్ నటుడు, నిర్మాత మురళి మోహన్ కూడా పాల్గొన్నారు. ఇంతకూ మెగాస్టార్ చిరంజీవి రాఘవను సత్కరించడానికి కారణం తెలిస్తే ఔరా! అనేక మానరు. మహర్షి రాఘవ ఇప్పటివరకూ 100 పర్యాయాలు ర‌క్త‌దానం చేయడం విశేషం. అది కూడా మెగాస్టార్ స్థాపించిన చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లోనే కావడం గమనార్హం. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని చిరంజీవి రాఘవను ఘనంగా సన్మానించారు. ఆయనకు శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందించి అభినందించారు.

Srikanth Mవాట్సాప్
Aadi Saikumar's New Movie Titled as Krishna From Brindavanam
సినిమా వార్తలు

ఆది సాయికుమార్ కొత్త సినిమా టైటిల్ ఖరారు

టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ జయాపజయాలతో సంబంధం లేకుండా అందివచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తుంటారు. ఈ క్రమంలో తాజాగా ఆయన ఒక కొత్త సినిమాకి శ్రీకారం చుట్టారు. ఈ సినిమాకు అల్లరి నరేష్ నటించిన 'అహ నా పెళ్ళంట' ఫేమ్ వీరభద్రం చౌదరి దర్శకత్వం వహిస్తున్నారు. జూన్ నుంచి సెట్స్ పైకి వెళ్లనున్న ఈ మూవీకి సంబంధించి ఒక కీలక అప్డేట్ అందించింది చిత్ర యూనిట్.

Srikanth Mవాట్సాప్
bellamkonda srinivas 11th movie official announcement
సినిమా వార్తలు

హార్రర్ మిస్టరీ గా రాబోతున్న #BS11

బెల్లంకొండ శ్రీనివాస్‌ ప్రస్తుతం తన 10వ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇక ఈసినిమా ఉండగానే ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. శ్రీరామ నవమి పండుగ సందర్భంగా తన కొత్త సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు. కౌశిక్ పెగళ్లపాటి రచన మరియు దర్శకత్వం లో ఈసినిమా వస్తుంది. బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ లో రాబోతున్న 11వ సినిమా ఇది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ అయితే ఆకట్టుకుంటుంది. హార్రర్ మిస్టరీ గా ఈసినిమా రాబోతుందని పోస్టర్ లో తెలిపారు.

TFN Adminవాట్సాప్
Chiyaan Vikram's Veera Dheera Sooran Teaser Released
ట్రైలర్ & టీజర్

విక్ర‌మ్ వీర ధీర శూరన్ టీజర్ హైలైట్స్..!

విలక్ష‌ణ‌మైన సినిమాలు, వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌టమే కాకుండా జాతీయ ఉత్త‌మ న‌టుడిగానూ త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న యాక్ట‌ర్ చియాన్ విక్ర‌మ్‌. బుధ‌వారం ఆయ‌న పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా మేక‌ర్స్ ఆయ‌న క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న తాజా చిత్రానికి సంబంధించిన టైటిల్ టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. చియాన్ నటిస్తున్న 62వ చిత్రానికి ‘వీర ధీర శూరన్ 2’ అనే టైటిల్‌ను క‌న్‌ఫ‌ర్మ్ చేశారు. త్వ‌ర‌లోనే తెలుగు టైటిల్‌ను ప్ర‌క‌టించ‌నున్నారు.

Srikanth Mవాట్సాప్
harish shankar shooting update on mr bachchan movie
షూటింగ్ అప్‌డేట్

మిస్టర్ బచ్చన్ భారీ షెడ్యూల్ కంప్లీట్

హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న సినిమా మిస్టర్ బచ్చన్. మిరపకాయ్ సినిమాతో వీరిద్దరి కాంబినేషన్ ఎలా ఉంటుందో చూశాం. దీంతో ఇప్పుడు మరోసారి వీరి కాంబోలో సినిమా వస్తుండటంతో అందరికీ ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం అయితే ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది.

TFN Adminవాట్సాప్
jai hanuman pre look released
సినిమా వార్తలు

జై హనుమాన్ ప్రీ లుక్ రిలీజ్

ఈసంక్రాంతి వచ్చి చరిత్ర సృష్టించింది హనుమాన్.ఏకంగా 300కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి ఆల్ టైం సంక్రాంతి గ్రాసర్ రికార్డు ను కూడా ఖాతాలో వేసుకుంది.ఈసినిమా ఊహించని విజయం సాధించడంతో దీనికి సీక్వెల్ కూడా వస్తుంది.జై హనుమాన్ అనే టైటిల్ తో ఈసీక్వెల్ తెరకెక్కనుంది.ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజి లో వున్న ఈసినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.

Mahender Reddyవాట్సాప్
director ajay bhupathi received best director award
సినిమా వార్తలు

మంగళవారం- అజయ్ భూపతికి క్రేజీ అవార్డ్

ఆర్ఎక్స్ 100 సినిమాతో దర్శకుడిగా పరిచయమైన అజయ్ భూపతి మొదటి సినిమాతోనే మంచి బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఇక గత ఏడాది మంగళవారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా.. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈసినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుంది. కలెక్షన్స్ పరంగా కూడా మంచి కలెక్షన్స్ నే అందించింది

TFN Adminవాట్సాప్
Nara Rohith's Sundarakanda Title Glimpse Out
ట్రైలర్ & టీజర్

నారా రోహిత్ కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ రిలీజ్

రాజకీయ నేపథ్యమున్న కుటుంబం నుంచి చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టే వారు అరుదుగా ఉంటుంటారు. అలాంటివారిలో టాలీవుడ్ టాలెంటెడ్ హీరో నారా రోహిత్ ఒకరు. అందరి హీరోల్లా కేవలం కమర్షియల్ పంథాలో కాకుండా వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. చివరిసారిగా 2018లో వచ్చిన ‘వీర భోగ వసంత రాయలు’తో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఆయన చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.

Srikanth Mవాట్సాప్
naga chaitanya thandel movie release date fixed
రిలీజ్ అప్‌డేట్

తండేల్ రిలీజ్ డేట్ ఫిక్స్

అక్కినేని వారసత్వంలో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు నాగ చైతన్య. ఇక తన సినిమాలతో ఇండస్ట్రీలో తనకుంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇప్పటివరకూ బాగానే హిట్లను అందుకున్నాడు. ఇక ఇప్పుడు తన నుండి వస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా తండేల్. చందూ మొండేటి దర్శకత్వంలో ఈసినిమా రూపొందుతుంది. మత్స్యకారుడు గణగల్ల రామరావు జీవితాన్ని ఈసినిమా ద్వారా చూపిస్తున్నారు. ఇక యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈసినిమా కోసం నాగచైతన్య తన మేకోవర్ ను పూర్తిగా మార్చేశాడు. ఇప్పటికే ఈసినిమా నుండి ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేయగా గ్లింప్స్ అయితే సినిమాపై అంచనాలను పెంచేసింది.

TFN Adminవాట్సాప్
Gangs Of Godavari teaser arriving soon
ట్రైలర్ & టీజర్

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టీజర్ రానుంది

విశ్వక్ సేన్ గ్యాంగ్ ఆఫ్ గోదావరికి సాంగ్స్ ద్వారా పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది.ఇప్పటివరకు రెండు పాటలు రిలీజ్ కాగా ఆ రెండు కూడా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.ఇక ఇప్పుడు టీజర్ కూడా రానుంది.అతి త్వరలో ఈ టీజర్ విడుదల కానుందని మేకర్స్ పోస్టర్ ద్వారా ప్రకటించారు.టీజర్ కట్ సినిమా బిజినెస్ కు కీలకం కానుంది.

Mahender Reddyవాట్సాప్
vikram birthday special glimpse released from thangalaan movie
ట్రైలర్ & టీజర్

తంగలాన్- విక్రమ్ బర్త్ డే స్పెషల్ గ్లింప్స్ రిలీజ్

ప్రముఖ దర్శకుడు పా రంజిత్ దర్శకత్వంలో చియాన్ విక్రమ్ నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ "తంగలాన్". కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగాఈ సినిమా రూపొందింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే పాన్ ఇండియా లాంగ్వేజెస్ తో పాటు వరల్డ్ వైడ్ రిలీజ్ కు సిద్ధమవుతోంది.

TFN Adminవాట్సాప్
tillu square beats dasara life time collections
బాక్సాఫీస్

దసరాను దాటేసిన టిల్లు స్క్వేర్

గుంటూరు కారం,హనుమాన్ తరువాత ఈ ఏడాది 100కోట్ల క్లబ్ లో చేరింది టిల్లు స్క్వేర్.బ్లాక్ బాస్టర్ డీజే టిల్లు కు సీక్వెల్ గా వచ్చిన టిల్లు స్క్వేర్ సూపర్ మౌత్ టాక్ తో అదిరిపోయే వసూళ్లను రాబట్టుకుంది.నిన్నటితో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 125కోట్లకు పైగా వసూళ్లను సొంతం చేసుకుంది.దాంతో నాని దసరా సినిమా లైఫ్ టైం కలెక్షన్స్ ను దాటేసింది.గత ఏడాది సమ్మర్ లో విడుదలైన దసరా 120కోట్లు రాబట్టి నాని కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.ఇక ఇప్పుడు టిల్లు స్క్వేర్ ఆ కలెక్షన్స్ ను దాటేసింది.

Mahender Reddyవాట్సాప్
nithiin robinhood movie release date fixed
రిలీజ్ అప్‌డేట్

రాబిన్ హుడ్ రిలీజ్ డేట్ ఫిక్స్

యంగ్ హీరో నితిన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ప్రస్తుతం నితిన్ రాబిన్ హుడ్ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. భీష్మ తరువాత హీరో నితిన్, డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వంలో వస్తున్న సినిమా రాబిన్ హుడ్. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా నుండి గ్లింప్స్ ను రిలీజ్ చేయగా గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ దక్కింది.

TFN Adminవాట్సాప్
Superstar Rajinikanth's Baasha to be Re-Released In Theaters on May 1st
ట్రైలర్ & టీజర్

రజినీకాంత్ బాషా రీ-రిలీజ్ ట్రైలర్ చూశారా?

టాలీవుడ్‌లో గతకొంతకాలంగా రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోన్న విషయం మూవీ లవర్స్‌కి తెలిసిన విషయమే. అగ్ర హీరోలు నటించిన ఒకప్పటి బ్లాక్ బస్టర్ సినిమాలను మళ్ళీ థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఈ నయా ట్రెండ్ నిర్మాత‌ల‌కు కూడా మంచి లాభాలను తెచ్చిపెడుతోంది. దీంతో నిర్మాణ సంస్థలు ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు పలువురు స్టార్ హీరోల సినిమాలను థియేట‌ర్ల‌లోకి తీసుకొస్తున్నారు. అలాగే మ‌రోవైపు ఫ్యాన్స్ కూడా త‌మ అభిమాన హీరోలు సూప‌ర్ హిట్ సినిమాల్ని మ‌ళ్లీ థియేట‌ర్ల‌లో చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఇదిలావుండగా.. తాజాగా ఈ రీ రిలీజ్ ట్రెండ్‌లోకి తమిళ్ సూపర్‌స్టార్‌ రజినీకాంత్ నటించిన మూవీ ఒకటి చేరింది.

Srikanth Mవాట్సాప్

షేర్