విశ్వక్ సేన్ గ్యాంగ్ ఆఫ్ గోదావరికి సాంగ్స్ ద్వారా పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది.ఇప్పటివరకు రెండు పాటలు రిలీజ్ కాగా ఆ రెండు కూడా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.ఇక ఇప్పుడు టీజర్ కూడా రానుంది.అతి త్వరలో ఈ టీజర్ విడుదల కానుందని మేకర్స్ పోస్టర్ ద్వారా ప్రకటించారు.టీజర్ కట్ సినిమా బిజినెస్ కు కీలకం కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అందరికి శ్రీ రామనవమి శుభాకాంక్షలు 🏹
Our gang leader Lankala Rathna ~ Mass Ka Das @VishwakSenActor arriving soon with teaser of #GangsOfGodavari 🔥🌊
Worldwide grand release at theatres near you on MAY 17th! #GOGOnMay17th 💥 pic.twitter.com/1xb7obg7jI
— Sithara Entertainments (@SitharaEnts) April 17, 2024
గోదావరి బ్యాక్ డ్రాప్ లో రూరల్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈసినిమాను కృష్ణ చైతన్య డైరెక్ట్ చేస్తుండగా డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.అంజలి కీలక పాత్రలో కనిపించనుంది.యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుండగా నాగవంశీ ,సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.మరో నెల రోజుల్లో ఈసినిమా థియేటర్లలోకి రానుంది.
రీసెంట్ గా గామితో హిట్ కొట్టి ఫుల్ ఫామ్ లో వున్నాడు విశ్వక్ సేన్.మరి ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి తో వస్తున్న విశ్వక్ మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంటాడో లేదో చూడాలి.ఇక విశ్వక్ చేతిలో ప్రస్తుతం మరో రెండు సినిమాలు కూడా వున్నాయి.అందులో రవితేజ ముళ్ళపూడి డైరెక్షన్ లో మెకానిక్ రాకీ అనే సినిమాలో నటిస్తున్నాడు.అలాగే లైలా అనే సినిమాకు కూడా సైన్ చేశాడు.ఇందులో విశ్వక్ లేడీ గెటప్ లో కనిపించనున్నాడు.త్వరలోనే షూటింగ్ స్టార్ట్ కానుంది.రామ్ నారాయణ్ డైరెక్ట్ చేయనుండగా షైన్ స్క్రీన్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: