నారా రోహిత్ కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ రిలీజ్

Nara Rohith's Sundarakanda Title Glimpse Out

రాజకీయ నేపథ్యమున్న కుటుంబం నుంచి చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టే వారు అరుదుగా ఉంటుంటారు. అలాంటివారిలో టాలీవుడ్ టాలెంటెడ్ హీరో నారా రోహిత్ ఒకరు. అందరి హీరోల్లా కేవలం కమర్షియల్ పంథాలో కాకుండా వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. చివరిసారిగా 2018లో వచ్చిన ‘వీర భోగ వసంత రాయలు’తో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఆయన చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే ఇటీవలే మళ్ళీ జోరు పెంచిన నారా రోహిత్.. ప్రస్తుతం కథానాయకుడిగా పలు చిత్రాల్లో నటిస్తున్నారు. ఆయన హీరోగా చేస్తోన్న ‘ప్రతినిధి 2’ త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో అప్పుడే తన తదుపరి సినిమాను కొత్తవారితో పట్టాలెక్కించేశారు. కాగా రోహిత్ కెరీర్‌లో 20వ సినిమాగా ఇది తెరకెక్కుతుండటం విశేషం. ఇక ఈ చిత్రాన్ని సందీప్ పిక్చర్స్ ప్యాలెస్ అనే నూతన నిర్మాణ సంస్థ నిర్మిస్తుండగా.. వెంకటేష్ నిమ్మలపూడి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో చాలావరకు కొత్త వాళ్లే నటిస్తున్నారు.

తాజాగా ఈ మూవీ నుంచి కీలక అప్డేట్ వచ్చింది. ఈరోజు శ్రీరామ నవమి పండుగను పురస్కరించుకుని చిత్ర బృందం తాజాగా టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేసింది. ఈ చిత్రానికి ‘సుందరకాండ’ అనే టైటిల్ ఖరారు చేసింది. అలాగే ఈ మూవీని ఈ ఏడాది ద్వితీయార్ధంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు. అందులో సుందరకాండ సినిమాను సెప్టెంబర్ 6వ తేదీన థియేటర్లలో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × three =