మిస్టర్ బచ్చన్ భారీ షెడ్యూల్ కంప్లీట్

harish shankar shooting update on mr bachchan movie

హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న సినిమా మిస్టర్ బచ్చన్. మిరపకాయ్ సినిమాతో వీరిద్దరి కాంబినేషన్ ఎలా ఉంటుందో చూశాం. దీంతో ఇప్పుడు మరోసారి వీరి కాంబోలో సినిమా వస్తుండటంతో అందరికీ ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం అయితే ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా షూటింగ్ కు సంబంధించిన అప్ డేట్లను హరీష్ శంకర్ ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా ద్వారా తెలియచేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పుడు తాజాగా ఈసినిమా షూటింగ్ కు సంబంధించి ప్రెష్ అప్ డేట్ తో వచ్చేశారు. ఈసినిమా 30 భారీ షెడ్యూల్ లాస్ట్ షాట్ షూటింగ్ జరుగుతుంది.. ఈ షెడ్యూల్ కోసం పనిచేసిన కాస్ట్ అండ్ క్రూ ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్.. త్వరలో కలుద్దాం హైద్రాబాద్ గాయ్స్ అంటూ తన ట్వీట్ లో పేర్కొన్నాడు.

కాగా ఈసినిమాలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తుండగా, అయనంక బోస్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఈ చిత్రానికి అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ కాగా, ఎడిటింగ్ ఉజ్వల్ కులకర్ణి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + 2 =