కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Latest Telugu Movies News

ట్యాగ్ · 17286 కథనాలు · పేజీ 175

Priyadarshi, Nabha Natesh Starrer Darling Announcement Glimpse Released
ట్రైలర్ & టీజర్

ప్రియదర్శి, నభా నటేష్ జంటగా డార్లింగ్

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు ప్రియదర్శి, ఇస్మార్ట్ భామ నభా నటేష్ జంటగా ఒక కొత్త సినిమా తెరకెక్కుతోంది. అశ్విన్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మురళీధర్ గౌడ్, శివ రెడ్డి, కృష్ణ తేజ సహా పలువురు నటీనటులు నటిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవలే 'హనుమాన్' సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న నిర్మాత నిరంజన్ రెడ్డి ప్రైమ్ షో ఎంటర్ టైనమెంట్ బ్యానర్ పై దీనిని నిర్మిస్తుండగా.. చైతన్య రెడ్డి సగర్వంగా సమర్పిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
ntr back to hyderabad
సినిమా వార్తలు

హైదరాబాద్ చేరుకున్న ఎన్టీఆర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ వార్ 2 ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ నుపూర్తి చేసుకొని హైదరాబాద్ చేరుకున్నాడు.నిన్న రాత్రి ఎన్టీఆర్ హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ కాగా అనంతరం తన కొత్త కారునుతనే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు.ప్రస్తుతం ఆవీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక ముంబై లో వార్ 2షూటింగ్ వారం రోజులు జరుగగా ఇందులో కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు.ఈషెడ్యూల్ లో ఎన్టీఆర్ తోపాటు బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కూడా పాల్గొన్నాడు.ఈసినిమాలో హృతిక్,ఎన్టీఆర్ హోరాహోరీగా తలపడనున్నారు.

Mahender Reddyవాట్సాప్
Bhaje Vaayu Vegam teaser out
ట్రైలర్ & టీజర్

భజే వాయు వేగం టీజర్ రిలీజ్

గత ఏడాది బెదురులంక 2012 తో సూపర్ హిట్ కొట్టి ట్రాక్ లోకి వచ్చాడు యంగ్ హీరో కార్తికేయ గుమ్మకొండ.ప్రస్తుతం ఈహీరో భజే వాయు వేగం అనే సినిమా చేస్తున్నాడు.టైటిల్ తోనే ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేయగా తాజాగా ఈసినిమా టీజర్ కూడా రిలీజ్ అయ్యింది.కొద్దీ సేపటి క్రితం మెగా స్టార్ చిరంజీవి ఈ టీజర్ ను లాంచ్ చేశారు.ఇక ఈటీజర్ ను కూడా ఇంట్రెస్టింగ్ గా కట్ చేశారు.టీజర్ లో ఫుల్ యాక్షన్ మోడ్ లో కనిపించాడు కార్తికేయ.

Mahender Reddyవాట్సాప్
Rathnam Third Single Praanam Released From Vishal's New Film
సినిమా వార్తలు

రత్నం నుంచి థర్డ్ సింగిల్ రిలీజ్.. డీఎస్‌పీని ఆకాశానికెత్తిన విశాల్

తమిళ్ స్టార్ హీరో విశాల్ ఇటీవలే 'మార్క్ ఆంటోని'తో బ్లాక్ బస్టర్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా కలెక్ట్ చేసి విశాల్ కెరీర్‌లో తొలి 100 కోట్ల క్లబ్ మూవీగా నిలిచింది. దీని తర్వాత ఆయన హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'రత్నం'. మాస్ యాక్షన్ సినిమాలు తీయడంలో పేరొందిన సీనియర్ డైరెక్టర్ హరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఫుల్ ప్యాక్డ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో విశాల్ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఏప్రిల్ 26వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Srikanth Mవాట్సాప్
Premalu Sequel Confirmed by Makers
సినిమా వార్తలు

అఫీషియల్.. ప్రేమలు సీక్వెల్ వచ్చేస్తోంది

మలయాళంలో వచ్చిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ 'ప్రేమలు'. నస్లెన్ కే గఫూర్, మమితా బైజు నటించగా.. చిన్న సినిమాగా విడుదలై ఘనవిజయం సాధించింది. తెలుగులోనూ బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ. 17కోట్ల గ్రాస్‌ వసూళ్లు సాధించి ఔరా అనిపించింది. తెలుగులో ఈ సినిమాను గ్లోబల్ డైరెక్టర్ ఎస్‌ఎస్‌ రాజమౌళి తనయుడు ఎస్‌ఎస్‌ కార్తీకేయ సమర్పించిన సంగతి తెలిసిందే. తెలుగుతోపాటు తమిళంలో సైతం మంచి వసూళ్లు రాబట్టింది.

Srikanth Mవాట్సాప్
Satya Dev Krishnamma Movie second single out now
సాంగ్

కృష్ణమ్మ సెకండ్ సాంగ్ రిలీజ్

విభిన్నమైన కథలతో అలరించడంలో సత్యదేవ్ ఎప్పుడూ ముందుంటాడు. ఇప్పటికే పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు సత్యదేవ్. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. వీవీ గోపాల కృష్ణ దర్శకత్వంలో సత్యదేవ్ హీరోగా కృష్ణమ్మ అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Prathinidhi 2 movie trailer out now
ట్రైలర్ & టీజర్

ప్రతినిధి 2 ట్రైలర్ రిలీజ్

జర్నలిస్ట్ మూర్తి దర్శకత్వంలో నారా రోహిత్ హీరోగా వస్తున్న సినిమా ప్రతినిధి2. ఈసినిమా ప్రతినిధి సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే కదా. 2014లో నారా రోహిత్ హీరోగా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ప్రతినిధి ఈసినిమా మంచి ప్రశంసలు దక్కించుకుంది. దీంతో ఈసినిమాపై మంచి ఎక్స్ పెక్టేషన్సే ఉన్నాయి. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ ను అలానే పాటలను రిలీజ్ చేస్తూ సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ కూడా ఆకట్టుకుంటుంది. డైలాగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అన్నీ…

TFN Adminవాట్సాప్
Krishna From Brindavanam Launch Event Saikumar Thanks To Dil Raju and Anil Ravipudi
సినిమా వార్తలు

దిల్ రాజు, అనిల్ రావిపూడి గార్లకు థాంక్స్ - సాయి కుమార్

లవ్ లీ యంగ్ హీరో ఆది సాయికుమార్ మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 'చుట్టలబ్బాయ్‌' అంటూ దర్శకుడు వీరభద్రమ్ చౌదరితో మంచి చిత్రాన్ని చేసిన ఆది సాయి కుమార్ మళ్లీ విలేజ్ డ్రామా, ఫ్యామిలీ, లవ్, కామెడీ, ఫీల్ గుడ్ ఎమోషన్ ఇలా అన్ని అంశాలతో సినిమాను చేస్తున్నారు. ఈ మూవీని లక్ష్మీ ప్రసన్న ప్రొడక్షన్స్ బ్యానర్ మీద తూము నరసింహా, జామి శ్రీనివాసరావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే.

Srikanth Mవాట్సాప్
mahesh babu latest look goes viral
సినిమా వార్తలు

మహేష్ లేటెస్ట్ లుక్ కు ఫ్యాన్స్ ఫిదా

సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ లుక్ ఫ్యాన్స్ ను ఫిదా చేస్తుంది.ఈ సంక్రాంతికి గుంటూరు కారం తో వచ్చిన మహేష్ తన నెక్స్ట్ మూవీని టాప్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి తో చేయనున్నాడు.ఈసినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ అయ్యాయి.ఈసినిమా పనిమీద దుబాయ్ కి వెళ్లి ఈరోజు హైదరాబాద్ కు రిటర్న్ అయ్యారు మహేష్ బాబు,రాజమౌళి,ఎస్ఎస్ఎమ్ బి 29 నిర్మాత కేఎల్ నారాయణ .

Mahender Reddyవాట్సాప్
karthikeya bhaje vayu vegam movie teaser release time fixed
ట్రైలర్ & టీజర్

భజే వాయు వేగం టీజర్ రిలీజ్ టైమ్ లాక్

యంగ్ హీరో కార్తికేయ సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా భజే వాయు వేగం. ప్రశాంత్ రెడ్డి దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. రీసెంట్ గానే ఈసినిమా టైటిల్ ను అలానే ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది.

TFN Adminవాట్సాప్
Sithara Entertainments Announces MAD Square
సినిమా వార్తలు

మ్యాడ్‌కి సీక్వెల్‍గా మ్యాడ్ స్క్వేర్

యువ ప్రతిభను ప్రోత్సహించడంలో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎప్పుడూ ముందుంటుంది. ఎందరో యువ దర్శకులతో వైవిధ్యమైన సినిమాలు చేస్తూ, వరుస విజయాలను ఖాతాలో వేసుకుంటోంది. 'డీజే టిల్లు', 'మ్యాడ్', 'జెర్సీ', 'టిల్లు స్క్వేర్' వంటి అద్భుతమైన చిత్రాలను దీనికి ఉదాహరణలుగా చెప్పవచ్చు. ఇక యువ నటీనటులు, సాంకేతిక నిపుణులతో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ రూపొందించిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌ 'మ్యాడ్' చిత్రం 2023 అక్టోబరులో విడుదలై ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఇప్పుడు ఆ బ్లాక్‌బస్టర్‌ చిత్రానికి సీక్వెల్‍గా 'మ్యాడ్ స్క్వేర్‌'ని రూపొందిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Tillu Square arrives from 26th April on Netflix
ఓటీటీ

టిల్లు స్క్వేర్ ఓటిటి రిలీజ్ డేట్ వచ్చేసింది

హనుమాన్ తరువాత ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది టిల్లు స్క్వేర్.బ్లాక్ బాస్టర్ డీజే టిల్లు కు సీక్వెల్ గా మంచి అంచనాల తో వచ్చిన ఈసినిమా అంచనాలను దాటి ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది. దాదాపు 127కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది.ఈసినిమాతో హీరో సిద్దు తొలిసారి 100కోట్ల క్లబ్ లో చేరాడు. ఇప్పటికీ ఈసినిమా డీసెంట్ వసూళ్లను రాబట్టుకుంది.

Mahender Reddyవాట్సాప్
vishwak sens gaami movie clocks 100 million streaming minutes on ott
ఓటీటీ

100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ తో గామి సంచలనం

యంగ్ హీరో విశ్వక్ సేన్ ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే గామి సినిమాతో మంచి హిట్ ను అందుకున్న సంగతి తెలిసిందే కదా. విధ్యాధర కాగిట దర్శకత్వంలో యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన సినిమా గామి. డిఫెరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈసినిమా మంచి హిట్ ను అందించింది. కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా మంచి కలెక్షన్సే అందించింది.

TFN Adminవాట్సాప్
Director Veerabhadram Chowdary Reveals Interesting Facts About Krishna From Brindavanam
సినిమా వార్తలు

ఇప్పటికి మాకు టైం, లక్ కలిసొచ్చింది - వీరభద్రమ్

లవ్ లీ యంగ్ హీరో ఆది సాయికుమార్ మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 'చుట్టలబ్బాయ్‌' అంటూ దర్శకుడు వీరభద్రమ్ చౌదరితో మంచి చిత్రాన్ని చేసిన ఆది సాయి కుమార్ మళ్లీ విలేజ్ డ్రామా, ఫ్యామిలీ, లవ్, కామెడీ, ఫీల్ గుడ్ ఎమోషన్ ఇలా అన్ని అంశాలతో సినిమాను చేస్తున్నారు. ఈ మూవీని లక్ష్మీ ప్రసన్న ప్రొడక్షన్స్ బ్యానర్ మీద తూము నరసింహా, జామి శ్రీనివాసరావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే.

Srikanth Mవాట్సాప్
Aadi Saikumar Reveals Interesting Facts About His New Film Krishna From Brindavanam
సినిమా వార్తలు

కృష్ణ ఫ్రమ్ బృందావనం.. ఎలా ఉంటుందంటే?

లవ్ లీ యంగ్ హీరో ఆది సాయికుమార్ మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. చుట్టలబ్బాయ్‌ అంటూ దర్శకుడు వీరభద్రమ్ చౌదరితో మంచి చిత్రాన్ని చేసిన ఆది సాయి కుమార్ మళ్లీ విలేజ్ డ్రామా, ఫ్యామిలీ, లవ్, కామెడీ, ఫీల్ గుడ్ ఎమోషన్ ఇలా అన్ని అంశాలతో సినిమాను చేస్తున్నారు. ఈ మూవీని లక్ష్మీ ప్రసన్న ప్రొడక్షన్స్ బ్యానర్ మీద తూము నరసింహా, జామి శ్రీనివాసరావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే.

Srikanth Mవాట్సాప్
sharwanand manamey movie teaser out now
ట్రైలర్ & టీజర్

మనమే టీజర్ రిలీజ్-కూల్ అండ్ కలర్ ఫుల్

టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ నటుల్లో శర్వానంద్ పేరు కూడా ముందు వరుసలో ఉంటుంది. కెరీర్ మొదటినుండీ కూడా శర్వానంద్ కాస్త డిఫరెంట్ సినిమాలు చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తుండేవాడు. ఇప్పుడు పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో వస్తున్న మనమే సినిమా కూడా ఒకటి ఉంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను ముగించుకుంటుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలను కూాడా మొదలుపెట్టి ఇప్పటికే గ్లింప్స్, ఫస్ట్ సాంగ్ ను కూడా రిలీజ్ చేశారు.

TFN Adminవాట్సాప్
director venky kudumula clarity on fake news
సినిమా వార్తలు

రాబిన్ హుడ్ లో రాశీఖన్నా- డైరెక్టర్ క్లారిటీ

యంగ్ హీరో నితిన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ప్రస్తుతం నితిన్ రాబిన్ హుడ్ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. భీష్మ తరువాత హీరో నితిన్, డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వంలో వస్తున్న సినిమా రాబిన్ హుడ్. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా నుండి గ్లింప్స్ ను రిలీజ్ చేయగా గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ దక్కింది.

TFN Adminవాట్సాప్
Jayam Ravi, Keerthy Suresh Starrer Siren Streaming in Disney+ Hotstar Now
ఓటీటీ

ఓటీటీలోకి వచ్చేసిన సైరన్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

కోలీవుడ్ స్టార్ హీరో జ‌యం ర‌వి క‌థానాయ‌కుడిగా నటించిన లేటెస్ట్ మూవీ 'సైరన్'. కథానాయికలుగా స్టార్ హీరోయిన్స్ కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్ తొలిసారి కలిసి నటించడం విశేషం. తమిళంలో క్రైమ్ రివేంజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని హోమ్ మూవీ మేకర్స్ బ్యాన‌ర్‌పై సుజాత విజ‌య్ కుమార్ నిర్మించారు. 'అభిమ‌న్యుడు', 'విశ్వాసం', 'హీరో' వంటి ప‌లు చిత్రాల‌కు రైట‌ర్‌గా పనిచేసిన ఆంటోని భాగ్య‌రాజ్ ఈ మూవీతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ చిత్రంలో విల‌క్ష‌ణ న‌టుడు, ద‌ర్శ‌కుడు స‌ముద్ర ఖ‌ని, యోగి బాబు, కౌశిక్ మెహతా, తులసి తదితరులు కీల‌క పాత్ర‌లు పోషించారు.

Srikanth Mవాట్సాప్
Tamil film actors cast their votes
సినిమా వార్తలు

ఓటేసిన తమిళ సినీ ప్రముఖులు

2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దేశ వ్యాప్తంగా ఈ రోజు నుండి మొదటి విడత ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.సౌత్ లో తమిళనాడు లోని 39లోక్ సభ స్థానాలకు ఈరోజు పోలింగ్ జరుగుతుంది. ఈపోలింగ్ లో తమిళ సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.సూపర్ స్టార్ రజినీకాంత్, కమల్ హాసన్ ,అజిత్, ధనుష్ అలాగే శివ కార్తికేయన్ ,విజయ్ సేతుపతి చెన్నై లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Mahender Reddyవాట్సాప్
Yami Gautam Starrer Article 370 Streaming in Netflix
ఓటీటీ

ఓటీటీలోకి వచ్చేసిన ఆర్టికల్ 370.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ యామి గౌతమ్, ప్రముఖ దక్షిణాది నటి ప్రియ‌మ‌ణి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన‌ చిత్రం ‘ఆర్టికల్ 370’. యామి గౌతమ్ పవర్‌ఫుల్‌ ఇంటెలిజెన్స్ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌గా.. ప్రియమణి కీలక పాత్ర పోషించింది. జాతీయ అవార్డు గ్రహీత ఆదిత్య సుహాస్ జంభలే దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాను జియో స్టూడియోస్, A B62 స్టూడియోస్ బ్యాన‌ర్‌ల‌పై ఆదిత్య ధ‌ర్ నిర్మించారు. ఫిబ్ర‌వ‌రి 23న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది.

Srikanth Mవాట్సాప్

షేర్