
ట్యాగ్ · 125 కథనాలు · పేజీ 5


ప్రియదర్శి బలగం ట్రైలర్ రిలీజ్

ఉగ్రం టీజర్ రిలీజ్

రానా నాయుడు ట్రైలర్ రిలీజ్

బిచ్చగాడు 2 స్నీక్ పీక్ ట్రైలర్ రిలీజ్

బెదురులంక 2012 టీజర్ రిలీజ్

ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి టీజర్ రిలీజ్

సార్ ట్రైలర్ రిలీజ్

మా తారకరత్న అన్నకి మేమున్నాం - ఎన్టీఆర్

హంట్ మూవీ రివ్యూ

విరూపాక్ష మూవీ టీజర్ ను రిలీజ్ చేయనున్న వీరమల్లు ?
శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై కార్తీక్ దండు దర్శకత్వంలో సాయి తేజ్, సంయుక్త జంటగా తెరకెక్కుతున్న మిస్టరీ థ్రిల్లర్ విరూపాక్ష మూవీ ఏప్రిల్ 21 వ తేదీ తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో రిలీజ్ కానుంది. బి అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు. ఈ మూవీకి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కథను అందించడం విశేషం. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

ప్రియదర్శి బలగం ట్రైలర్ రిలీజ్
టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అనే బ్యానర్ పై ఇప్పటికే సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక రీసెంట్ గానే దిల్ రాజు ప్రొడక్షన్స్ పేరుతో మరో కొత్త ప్రొడక్షన్ హౌస్ ను స్థాపించాడు. చిన్న సినిమాలను ప్రోత్సాహించాలనే ఉద్దేశంతోనే ఈ ప్రొడక్షన్ హౌస్ ను స్థాపించారు. దీనిలో భాగంగానే ఈ బ్యానర్ నుండి రిలీజ్ కు సిద్దమవుతున్న మొదటి సినిమా బలగం. ప్రియదర్శి ప్రధాన పాత్రలో ఈసినిమా వస్తుంది. ఈసినిమా మార్చి 3వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది…

కోనసీమ థగ్స్ రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే రా అండ్ రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన ఈసినిమా బాగానే ఆకట్టుకుంటుంది. మాస్ ఆడియన్స్ కు ఈసినిమా బాగా నచ్చుతుందని చెప్పొచ్చు.

ఉగ్రం టీజర్ రిలీజ్
కామెడీ ఎంటర్ టైనర్ సినిమాలతోనే ఒకప్పుడు వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లిన అల్లరి నరేష్ ఇప్పుడు తన రూట్ మార్చేశాడు. ప్రస్తుతం ప్రేక్షకులు కూడా ప్రయోగాత్మక సినిమాలనే ఎక్కువగా ఇష్టపడుతున్నారు కాబట్టి ఆ దిశగానే అడుగులు వేస్తున్నాడు. ఆ క్రమంలోనే నాంది లాంటి సినిమాతో తన రీఎంట్రీకి నాంది పలికాడు. విజయ్ కనకమేడల దర్శకత్వంలో వచ్చిన ఈసినిమాలో అల్లరి నరేష్ నటనకు ప్రశంసలు సైతం దక్కాయి. ఇక ఇప్పుడు విజయ్ తోనే మరో సినిమా చేస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో ఉగ్రం సినిమా వస్తుంది. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. యాక్షన్ .. ఎమోషన్ ప్రధానంగా కట్ చేసిన టీజర్ ఆకట్టుకుంటోంది.

ఓటీటీ లోకి వచ్చేసిన వారసుడు
ఇళయ దళపతి విజయ్ కు తెలుగులో ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే తన తమిళ్ సినిమాలను ఇక్కడ డబ్ చేసి మార్కెటింగ్ చేసుకుంటారు మేకర్స్. ఇక రీసెంట్ గా వారసుడు సినిమాను కూడా తెలుగులో రిలీజ్ చేసి మంచి సక్సెస్ అందుకున్నారు. ఈసినిమా తెలుగు డైరెక్టర్ దర్శకత్వం వహించడం విశేషం. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా వచ్చిన సినిమా వారసుడు. తమిళ్ లో వారిసు టైటిల్ తో రిలీజ్ అవ్వగా.. తెలుగులో వారసుడు టైటిల్ తో రిలీజ్ అయింది. తమిళంలో జనవరి 12న, తెలుగులో జనవరి 14న విడుదలైన ఈ సినిమాకి మంచి టాక్ వచ్చింది. ముఖ్యంగా తమిళంలో సూపర్ హిట్‌గా నిలిచింది.

ధనుష్ సార్ మూవీ రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే ఈసినిమా మంచి సందేశాత్మక సినిమా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఏదో ఒక వర్గం అని మాత్రమే కాకుండా ప్రతి వర్గం చూడాల్సిన సినిమా అని చెప్పొచ్చు.

రానా నాయుడు ట్రైలర్ రిలీజ్
కరణ్ అంశుమాన్ మరియు సుపర్ణ్ వర్మ దర్శకత్వంలో అగ్రహీరో వెంకటేష్, టాలెంటెడ్ హీరో రానా కాంబినేషన్ లో వస్తున్న సిరీస్ రానా నాయుడు. ఈ సిరీస్‌తోనే బాబాయ్ అబ్బాయ్ తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. ఈసినిమాను ఎప్పుడో మొదలుపెట్టారు మేకర్స్. గతఏడాది షూటింగ్ కూడా పూర్తిచేసుకొని.. ఇన్ని రోజులు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ అయిపోయింది. ఇక ఈసిరీస్ త్వరలో రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తున్నారు. రెండు రోజుల క్రితమే వెంకీ నెట్ ఫ్లిక్స్ వార్నింగ్ ఇస్తున్నట్టు ఫన్నీ వీడియోను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఆ వీడియోకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక నేడు ఈసిరీస్ ట్రైలర్ ను రిలీజ్…

యాంట్ - మన్ అండ్ ద వాస్ప్ : ద క్వాంటమేనియా రిలీజ్ డేట్ ఫిక్స్
హాలీవుడ్ సినిమాలకు ఇక్కడ కూడా మంచి మార్కెట్ ఉన్న సంగతి తెలిసిందే కదా. అందుకే ఇక్కడ డబ్బింగ్ చేసి సినిమాలను రిలీజ్ చేసి క్యాష్ చేసుకుంటున్నారు మేకర్స్. ఇటీవలే వచ్చిన అవతార్ ద వే ఆఫ్ వాటర్ అనే సినిమాను రిలీజ్ చేయగా అది ఇక్కడ ఎంత సూపర్ హిట్ అయిందో చూశాం. ఇక ఇప్పుడు మరో సినిమా రిలీజ్ కాబోతుంది. మార్వెల్ కామిక్స్ కు ఇక్కడ ప్రత్యేక క్రేజ్ ఉంది. మార్వెల్ కామిక్స్ ఈ సారి 'యాంట్ మన్ అండ్ ద వాస్ప్: ద క్వాంటమేనియా' తో ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

పాప్ కార్న్ మూవీ రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు నచ్చే వారికి ఈసినిమా బాగానే నచ్చుతుంది. అన్ని వర్గాల వారు ఈసినిమాను ఒకసారి చూసి ఎంజాయ్ చేయొచ్చు

బిచ్చగాడు 2 స్నీక్ పీక్ ట్రైలర్ రిలీజ్
విభిన్నమైన చిత్రాలతో అటు తమిళ్, ఇటు తెలుగులో హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు విజయ్ ఆంటోని. ఇక విజయ్ హీరోగా వచ్చిన బిచ్చగాడు సినిమా తన కెరీర్ లోనే ఓ ప్రత్యేకమైన సినిమా అని చెప్పొచ్చు. తమిళంలోనే కాదు.. తెలుగులోనూ ఈసినిమా బ్లాక్‌బస్టర్ సాధించింది. ఇక ఈసినిమాకు సీక్వెల్ కూడా వస్తుంది. ఈసినిమాకు విజయ్ ఆంటోనినే దర్శకత్వం వహించబోతున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా నుండి స్నీక్ పీక్ ట్రైలర్ అంటూ ఒక వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈ వీడియో ఆకట్టుకుంటూ సినిమాపై అంచనాలను పెంచేసింది.

బెదురులంక 2012 టీజర్ రిలీజ్
టాలీవుడ్ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన ఈతరం హీరోల్లో యంగ్ హీరో కార్తికేయ కూడా ఒకరు. ఆర్ఎక్స్ 100 అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కార్తికేయ మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ఇక ఆసినిమా తరువాత వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని హీరోగా నిలదొక్కుకోగలిగాడు. కేవలం హీరోగా మాత్రమే కాదు పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటించడానికి కూడా ఏమాత్రం వెనుకాడకుండా కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం అయితే కార్తికేయ నుండి వస్తున్న సినిమా బెదురులంక 2012. క్లాక్స్ దర్శకత్వంలో బెదురులంక అనే ఊరిలో 2012లో యుగాంతం వస్తుందన్న పుకార్లు ఎలాంటి పరిణామాలు తీసుకొచ్చాయి అనే నేపథ్యంలో ఈ మూవీ…

కళ్యాణ్ రామ్ అమిగోస్ రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ బాగానే ఆకట్టుకుంటుంది. డిఫరెంట్ కథలను ఇష్టపడే వారికి ఈసినిమా ఖచ్చితంగా నడుస్తుంది. అంతేకాదు అన్ని వర్గాల వారు కూడా ఈసినిమాను ఒకసారి చూసి ఎంజాయ్ చేయొచ్చు.

ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి టీజర్ రిలీజ్
సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్న హీరోల్లో టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య కూడా ఒకరు. ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయమైన నాగశౌర్య మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆ తరువాత వరుసగా సినిమాలు చేసుకుంటూనే వెళుతున్నాడు. ఈమధ్యనే కృష్ణ వ్రింద విహారి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి డీసెంట్ హిట్ ను అందుకున్నాడు నాగశౌర్య. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు. శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా వస్తున్న సినిమా ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి. ఈసినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో ఈసినిమా…

పాటతో మరోసారి మెప్పించిన ధనుష్
తమిళ్ స్టార్ హీరో ధనుష్ విభిన్నమైన, విలక్షణమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. లాంగ్వెేజ్ తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇక ఇప్పుడు డైరెక్ట్ గా తెలుగు సినిమా చేస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వస్తున్నాడు. తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరీ దర్శకత్వంలో ధనుష్ హీరోగా వస్తున్న సినిమా సార్. తమిళ్ లో ఈసినిమా వాతి అనే టైటిల్ తో వస్తుంది. ధనుష్ నటించిన తొలి తెలుగు సినిమా కావడంతో తమిళ్ తో పాటు తెలుగులోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈసినిమా ఫిబ్రవరి 17వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రచార కార్యక్రమాల్లో…

సార్ ట్రైలర్ రిలీజ్
తమిళ్ స్టార్ హీరో ధనుష్ ఇప్పటివరకూ తన సినిమాలను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తూ వచ్చారు. ఇక ఇప్పుడు డైరెక్ట్ గా తెలుగులోనే సినిమా చేస్తూ తెలుగు ప్రేక్షకులను అలరించడానికి వచ్చేస్తున్నాడు. వెంకీ అట్లూరీ దర్శకత్వంలో ధనుష్ హీరోగా వస్తున్న సినిమా సార్. ధనుష్ తెలుగులో నటిస్తున్న తొలి సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ఎప్పుడో మొదలుపెట్టారు కూడా. ఇప్పటికే పలు పోస్టర్లు, ఇంకా ఒక పాటలు, టీజర్ ను కూడా ఇప్పటికే రిలీజ్ చేశారు కూడా.

బుట్ట బొమ్మ మూవీ రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే లవ్ స్టోరీస్ ఇష్టపడే వారికి ఈసినిమా నచ్చేస్తుంది. అంతేకాదు ఈసినిమాను ఫ్యామిలీ అందరూ కలిసి చూసే సినిమా అని కూడా చెప్పొచ్చు.

మైఖేల్ మూవీ రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే ఈసినిమా యాక్షన్ ఎంటర్ టైనర్ సినిమాలను చూసే వారికి బాగా నచ్చుతుంది. మిగిలి వారు కూడా ఒకసారి చూసి ఎంజాయ్ చేయొచ్చు.

టాలీవుడ్ లో రెండు బ్లాక్ బస్టర్ మూవీస్ తో 2023 శుభారంభం
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ, శృతి హాసన్ జంటగా వాస్తవ సంఘటనలతో రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ వీరసింహారెడ్డి మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి, విజయం సాధించి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ మూవీలో వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటించారు. చంద్రిక రవి ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. వీరసింహారెడ్డి మూవీలో వీర సింహారెడ్డిగా, జయసింహా రెడ్డిగా రెండు పాత్రల్లో అద్భుతంగా నటించిన హీరో బాలకృష్ణ ప్రేక్షక, అభిమానులను ఆకట్టుకున్నారు. కొన్ని ఎమోషనల్…

మా తారకరత్న అన్నకి మేమున్నాం - ఎన్టీఆర్
యువగళం పాదయాత్రలో గుండెపోటుకు గురైన నందమూరి తారకరత్నకు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. తాజాగా జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ అక్కడకు చేరుకొని తారకరత్న ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియా, అభిమానులతో మాట్లాడిన జూనియర్ ఎన్టీఆర్.. తారకరత్న ప్రస్తుత ఆరోగ్య పరిస్థితులు వెల్లడించారు. తారకరత్న శరీరం చికిత్సకు సహకరిస్తోందని.. ప్రస్తుతం ఆయనకు వైద్యులు మెరుగైన వైద్యం అందిస్తున్నారని ఎన్టీఆర్ చెప్పారు.

హంట్ మూవీ రివ్యూ
ఇక ఓవరాల్ గా చెప్పాలంటే యాక్షన్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవాళ్లకు ఈసినిమా ఖచ్చితంగా నచ్చుతుంది.