నందమూరి కళ్యాణ్ రామ్ బింబిసార సినిమా తరువాత వస్తున్న సినిమా అమిగోస్. రాజేందర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాలో కళ్యాణ్ రామ్ మూడు పాత్రల్లో ప్రేక్షకులను అలరించడానికి వచ్చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ అన్ని సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. ఇక నేడు ఈసినిమా ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈసినిమా ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుందో తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నటీనటులు.. కళ్యాణ్ రామ్, ఆషిక రంగనాథ్, బ్రహ్మాజి, సప్తగిరి, రవి ప్రకాష్, శివన్నారాయణ, చైతన్య కృష్ణ, రఘు కారుమంచి, కళ్యాణి నటరాజన్, రాజశ్రీ నాయర్, సోనాక్షి వర్మ తదితరులు
దర్శకత్వం.. రాజేందర్ రెడ్డి
బ్యానర్స్.. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్
నిర్మాతలు.. నవీన్ యెర్నేని, వై రవిశంకర్
సంగీతం.. జిబ్రాన్ సంగీతం
సినిమాటోగ్రఫి.. ఎస్.సౌందర్ రాజన్
కథ
సిద్ధార్ధ్ (కళ్యాణ్ రామ్), మైఖేల్ (కళ్యాణ్ రామ్), మంజునాథ్ (కళ్యాణ్ రామ్) ఒకేలా ఉండే వీరు ముగ్గురూ ఒక వెబ్ సైట్ ద్వారా కలుస్తారు. అయితే వీరి ముగ్గురికి ఎలాంటి రక్తసంబంధం ఉండదు. ఇక వీరి ముగ్గురిలో మైఖేల్ గా మారిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బిపిన్ రాయ్. బిపిన్ రాయ్ కోసం వేటాడుతూ ఉంటారు ఎన్ఐఏ అధికారులు. ఈనేపథ్యంలో మైఖేల్ ను, సిద్దార్థను ఇరికించాలని చూస్తాడు. మరి మైఖేల్ గురించి తెలుసుకున్న సిద్దార్థ్, మంజునాథ్ ఏం చేశారు.. తన బారి నుంచి మంజునాథ్, సిద్దార్థ్‌లు ఎలా తప్పించుకోగలిగారు? బిపిన్ రాయ్‌ని ఎలా మట్టుపెట్టారు అన్నదే మిగిలిన కథ…
విశ్లేషణ
డిఫరెంట్ గా ఉండే కథలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. వాటిని ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు అమిగోస్ కూడా డైరెక్టర్ రాజేందర్ రెడ్డి డిఫరెంట్ కథతో వచ్చాడు. రాజేంద్ర రెడ్డి ఓ కొత్త పాయింట్ తో ఈ స్క్రిప్ట్ రాసుకున్నాడు. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ఎత్తుకు పై ఎత్తులతో స్క్రిప్ట్ ను రెడీ చేసుకున్నాడు డైరెక్టర్. ఫస్ట్ హాఫ్ పాత్రల ఇంట్రడక్షన్, లవ్ ట్రాక్ చూపించగా ఇంటర్వెల్ ట్విస్ట్ ఒక్కసారిగా ఇంట్రెస్టింగ్ మారిపోతుంది కథ. సెకండ్ హాఫ్ లో మైఖేల్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్, ఇక మైఖేల్ నుండి సిద్దార్థ్ వేసే ప్లాన్ లో ఆకట్టుకుంటాయి.
పెర్ఫామెన్స్
ఇప్పటికే కళ్యాణ్ రామ్ బింబిసార సినిమాలో రెండు పాత్రల్లో అలరించాడు. అందులో ఒకటి నెగెటివ్ షేడ్ కూడా ఉంటుంది. ఇక ఈసినిమాలో మూడు పాత్రలతో అలరించాడు. సిద్దార్థ్ అనే బిజినెస్ మ్యాన్ గా, మంజునాథ్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఇంకా మైఖేల్ అనే గ్యాంగ్ స్టర్ గా మూడు పాత్రల్లో కూడా కళ్యాణ్ రామ్ చాలా బాగా నటించాడు. పాజిటివ్, నెగిటివ్ పాత్రల్లో హీరో కమ్ విలన్ గా కళ్యాణ్ రామ్ అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా నెగెటివ్ షేడ్స్ ఉన్న మైఖేల్ పాత్రలో నటన, వాయిస్ మాడ్యులేషన్ ఆకట్టుకుంటాయి. హీరోయిన్ గా చేసిన అషికా రంగనాథ్ కూడా తన గ్లామర్ తో నటనతో బాగానే ఆకట్టుకుంది. బ్రహ్మాజీ, సప్తగిరికి నవ్వించే ప్రయత్నం చేశారు. ఇక మిగిలిన నటీనటులు తమ పాత్రల మేర బాగానే నటించారు.
టెక్నికల్ వాల్యూస్..
ఇక టెక్నికల్ విభాగానికి వస్తే సంగీతం, సినిమాటోగ్రఫి ఈసినిమాకు ప్రధాన బలం అయ్యాయి. ఎన్నో రాత్రులొస్తాయి కానీ పాట రీమిక్స్ స్క్రీన్ మీద చూడటానికి బావుంది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇంపాక్ట్ ను క్రియేట్ చేయగలిగింది. సినిమాటోగ్రఫి కూడా ఈ సినిమాకి ప్రధాన బలం అయింది. ప్రతి ఫ్రేమ్ చాలా ఎఫెక్టివ్ గా తీశారు. ఎడిటింగ్ బాగుంది. సినిమాలోని నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి.
ఓవరాల్ గా చెప్పాలంటే డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ బాగానే ఆకట్టుకుంటుంది. డిఫరెంట్ కథలను ఇష్టపడే వారికి ఈసినిమా ఖచ్చితంగా నడుస్తుంది. అంతేకాదు అన్ని వర్గాల వారు కూడా ఈసినిమాను ఒకసారి చూసి ఎంజాయ్ చేయొచ్చు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: