కరణ్ అంశుమాన్ మరియు సుపర్ణ్ వర్మ దర్శకత్వంలో అగ్రహీరో వెంకటేష్, టాలెంటెడ్ హీరో రానా కాంబినేషన్ లో వస్తున్న సిరీస్ రానా నాయుడు. ఈ సిరీస్‌తోనే బాబాయ్ అబ్బాయ్ తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. ఈసినిమాను ఎప్పుడో మొదలుపెట్టారు మేకర్స్. గతఏడాది షూటింగ్ కూడా పూర్తిచేసుకొని.. ఇన్ని రోజులు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ అయిపోయింది. ఇక ఈసిరీస్ త్వరలో రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తున్నారు. రెండు రోజుల క్రితమే వెంకీ నెట్ ఫ్లిక్స్ వార్నింగ్ ఇస్తున్నట్టు ఫన్నీ వీడియోను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఆ వీడియోకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక నేడు ఈసిరీస్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ మాత్రం సిరీస్ పై ఆసక్తిని ఒక్కసారిగా పెంచేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ట్రైలర్ ను బట్టి తండ్రీ కొడుకుల మధ్య జరిగే ఎమోషనల్ వార్ లాగ కనిపిస్తుంది. ఎన్నో ఎమోషన్స్, కోపాల మధ్య ఉత్కంఠ భరితంగా రానా నాయుడు ట్రైలర్ ని కట్ చేశారు. ఈ సిరీస్ లో సెలబ్రిటీల సమస్యలు తీర్చే వ్యక్తిగా రానా కనిపిస్తుండగా.. రానా తండ్రిగా వెంకీ నాగ నాయుడు అనే పాత్రలో కనిపిస్తున్నాడు. పూర్తిగా నెరిసిన గడ్డంతో వెంకటేష్ క్యారెక్టర్ ఎంట్రీ ఇవ్వడం ఆసక్తిని పంచుతోంది. నాన్నను జైలు నుంచి వదిలేశారు అనగానే… అలా ఎలా వదిలేస్తారు ఇంకో ఐదు సంవత్సరాలు జైలులో ఉండాలిగా అంటూ రానా తండ్రిని ద్వేషిస్తూ కనిపించారు. నీకు నా బ్యాక్‌గ్రౌండ్ తెలుసా ఇప్పుడే బుల్లెట్ దింపి వచ్చాను అంటూ వెంకటేష్ క్యారెక్టర్ పవర్‌ఫుల్‌గా ఈ ట్రైలర్‌లో చూపించారు. నువ్వు ఇక్కడకు రాకుండా ఉండాల్సిది నాగ అని రానా అనగా… నాన్న అని కూడా పిలవవా…నేను మీ నాన్ననురా అంటూ వెంకటేష్ చెప్పడం ఆసక్తిని పంచుతోంది. చూద్దాం మరి ఈ సిరీస్ ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో..
He operates in the shadows, but now, a shadow from his past is about to return and shake his world to its core!
Watch this action packed saga unfold in #RanaNaidu on March 10!@NetflixIndia @VenkyMama @krnx @suparn #SunderAaron #SurveenChawla @nowitsabhi @sushant_says pic.twitter.com/RNoWuUfnN3
— Rana Daggubati (@RanaDaggubati) February 15, 2023
కాగా లోకోమోటివ్ గ్లోబల్ మీడియా మరియు LLPకి చెందిన సుందర్ ఆరోన్ లు ఈ వెబ్ సిరీస్ కు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇక పాన్ ఇండియా సిరీస్ గా తెరకెక్కించడంతో చాలా మంది బాలీవుడ్ యాక్టర్స్ కూడా ఈ సిరీస్ లో నటించారు. వెంకీ, రానాతో పాటు సుర్వీన్ చావ్లా, సుశాంత్ సింగ్, ఆశిష్ విద్యార్థి, గౌరవ్ చోప్రా, సుచిత్రా పిళ్లై, రాజేష్ జైస్, మరియు ప్రియా బెనర్జీ కీలక పాత్రల్లో నటించారు. ఈ వెబ్ సిరీస్ తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో కూడా రిలీజ్ కానుంది. మార్చి 10 నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సిరీస్ రిలీజ్ కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: