టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అనే బ్యానర్ పై ఇప్పటికే సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక రీసెంట్ గానే దిల్ రాజు ప్రొడక్షన్స్ పేరుతో మరో కొత్త ప్రొడక్షన్ హౌస్ ను స్థాపించాడు. చిన్న సినిమాలను ప్రోత్సాహించాలనే ఉద్దేశంతోనే ఈ ప్రొడక్షన్ హౌస్ ను స్థాపించారు. దీనిలో భాగంగానే ఈ బ్యానర్ నుండి రిలీజ్ కు సిద్దమవుతున్న మొదటి సినిమా బలగం. ప్రియదర్శి ప్రధాన పాత్రలో ఈసినిమా వస్తుంది. ఈసినిమా మార్చి 3వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈసినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. విజయ్ దేవరకొండ చేతుల మీదుగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ కూడా ఆకట్టుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Happy to launch the trailer of #Balagam – A film that is rooted in our native culture, their towns, their relationships and their problems.
Wishing @priyadarshi_i @OfflVenu @DilRajuProdctns and the entire team all the very best 🤗#BalagamonMarch3rdhttps://t.co/rP73Zs1Fow
— Vijay Deverakonda (@TheDeverakonda) February 27, 2023
కాగా వేణు దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాలో కావ్యా కల్యాణ్‌రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, జయరాం, విజయలక్ష్మీ, స్వరూప కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దిల్ రాజు సమర్పణలో వస్తున్న ఈసినిమాకు హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. భీమ్స్ సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: