టాలీవుడ్ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన ఈతరం హీరోల్లో యంగ్ హీరో కార్తికేయ కూడా ఒకరు. ఆర్ఎక్స్ 100 అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కార్తికేయ మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ఇక ఆసినిమా తరువాత వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని హీరోగా నిలదొక్కుకోగలిగాడు. కేవలం హీరోగా మాత్రమే కాదు పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటించడానికి కూడా ఏమాత్రం వెనుకాడకుండా కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం అయితే కార్తికేయ నుండి వస్తున్న సినిమా బెదురులంక 2012. క్లాక్స్ దర్శకత్వంలో బెదురులంక అనే ఊరిలో 2012లో యుగాంతం వస్తుందన్న పుకార్లు ఎలాంటి పరిణామాలు తీసుకొచ్చాయి అనే నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కనున్నట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే ఈసినిమా నుండి గ్లింప్స్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. దానికి మంచి రెస్పాన్సే వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ కూడా ఆకట్టుకుంటుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: