తమిళ్ స్టార్ హీరో ధనుష్ ఇప్పటివరకూ తన సినిమాలను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తూ వచ్చారు. ఇక ఇప్పుడు డైరెక్ట్ గా తెలుగులోనే సినిమా చేస్తూ తెలుగు ప్రేక్షకులను అలరించడానికి వచ్చేస్తున్నాడు. వెంకీ అట్లూరీ దర్శకత్వంలో ధనుష్ హీరోగా వస్తున్న సినిమా సార్. ఈసినిమా నుండి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ ఇప్పటికే సినిమాపై భారీఅంచనాలను పెంచేశాయి. ఇక ఎన్నో అంచనాల మధ్య నేడు ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈసినిమా ఎలా ఉందో తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నటీనటులు.. ధనుష్, సంయుక్తా మీనన్, సముద్రఖని, సాయికుమార్,తనికెళ్ల భరణి
, హైపర్ ఆది తదితరులు
దర్శకత్వం.. వెంకీ అట్లూరీ
బ్యానర్స్.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్
నిర్మాతలు
సంగీతం.. జి.వి. ప్రకాష్‌కుమార్
సినిమాటోగ్రఫి.. దినేష్ కృష్ణన్
కథ..
బాలు (ధనుష్) త్రిపాఠి కాలేజ్ ఆఫ్ ఇనిస్టిట్యూట్‌లో జూనియర్ లెక్చరర్ గా పనిచేస్తుంటారు. మరోవైపు ప్రభుత్వ విద్యాసంస్థలను బాగు చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం బిల్లు తీసుకురాబోతుందని తెలుసుకున్న త్రిపాఠి విద్యాసంస్థల అధినేత (సముద్రఖని) తనే ప్రభుత్వ విద్యాసంస్థలను దత్తత తీసుకుని అక్కడ తన కాలేజీలలోని జూనియర్ లెక్చరర్స్ ని, ట్యూటర్లని ప్రభుత్వ కాలేజీలకు లెక్చరర్స్ గా పంపిస్తాడు. ఈనేపథ్యంలో బాలు సిరిపురం జూనియర్ కాలేజీకి మ్యాథ్స్ లెక్చరర్‌గా వెళతాడు. అయితే అక్కడ ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులకు సరైన వసతులు ఉండవు. విద్యార్థులు సరైన లెక్చరర్స్ లేక కూలిపనులు చేస్తుంటారు. అది గమనించిన బాలు విద్యార్థులను మోటివేట్ చేసి కాలేజీకి వచ్చేలా చేస్తాడు. అంతేకాదు ఆ ఏడాది వంద శాతం పాస్ పర్సంటెజీతో స్టేట్‌లోనే నెంబర్ వన్‌గా తన కాలేజీని నిలుపుతాడు. దీంతో త్రిపాఠి బాలుని అడ్డుకునే ప్రయత్నంచేస్తాడు. దాంతో బాలు ప్రైవేట్ కాలేజీలు చేస్తున్న మోసాలను, తమని అడ్డుకున్న త్రిపాఠిని ఎలా ఎదిరించాడు, అనేక అడ్డంకుల నడుము స్టూడెంట్స్ కి ఎలా క్లాసులు చెప్పాడు? బయోలజీ లెక్చరర్ మీనాక్షి(సంయుక్త) ఆయనకు ఎలా అండగా నిలబడింది, ఇందులో సుమంత్ పాత్రేంటి అనేది మిగిలిన కథ.
విశ్లేషణ
ఈసినిమా విద్యాసంస్థల్లో జరిగే మోసాల నేపథ్యంలో తెరకెక్కినట్టు ఇప్పటికే అర్థమైన సంగతి తెలిసిందే కదా. ఇంతకు ముందు ఈపాయింట్ తో సినిమాలు వచ్చాయి కానీ చాలా తక్కువ సినిమాలు వచ్చాయి. ఒకప్పుడు ప్రభుత్వ కళాశాలల్లోనే చదువులు చదుకునేవారు. అయితే ప్రైవేటీకరణ బిల్లు రావడం.. ప్రైవేటు కళాశాలలు వచ్చిన తరువాత ప్రభుత్వ కళాశాలలో చదివే విద్యార్థులు తక్కువైపోయారు. దానికి కారణం కూడా లేకపోలేదు. ప్రభుత్వాలే ప్రభుత్వ కళాశాలలను నిర్లక్ష్యం చేయడమే. సరైన వసతలు కూడా లేకపోవడంతో ప్రైవేటు సంస్థల హహ నడుస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే విద్య వ్యాపారంగా మారిపోయింది. ఈ సినిమాలో ప్రధానంగా ప్రైవేట్ కాలేజీల మోసాలను, అప్పుడు గ్రామాల్లో ఉండే కుల వివక్ష గురించి చెప్పాడు డైరెక్టర్.
ఇక తను చెప్పాలనుకున్న పాయింట్ ను సూటిగా చెప్పే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. ఇంతకుముందు వెంకీ అట్లూరీ లవ్ స్టోరీస్ ను తెరకెక్కించాడు. అయితే ఇప్పుడు సందేశాత్మక సినిమాతో వచ్చాడు. అయితే మరీ సీరియస్ నోట్ లో కాకుండా కాస్త ఎంటర్ టైన్ మెంట్ గా సూటిగ్ చెప్పే ప్రయత్నం చేశాడు. అంతేకాదు `అవసరానికి కులం ఉండదు`, `అవసరం ఉన్న చోట కులం ఉండదు`, `విద్య అనేది గుడిలో పెట్టే నైవేద్యం లాంటిది, దాన్ని పంచి పెట్టండి, అమ్మకండి` అంటూ తను రాసుకున్న డైలాగ్స్ ఆలోచింపచేస్తున్నాయి. ఫస్టాఫ్ అంతా ఎంటర్‌టైనింగ్‌గా సాగుతుంది. ఇక సెకండాఫ్ ఎమోషనల్‌గా మారిపోతుంది. హీరో లక్ష్యాన్ని సముద్రఖని అడ్డుకోవడం, తప్పుడు కేసులు పెట్టి ఊరు నుంచి తరిమేయడం, తమకు చదువు చెప్పిన గురువు కష్టాలను చూసి చలించిపోయిన విద్యార్థులు తిరగబడటం గూస్ బంమ్స్ తెప్పిస్తాయి.
పెర్ఫామెన్స్
ధనుష్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జూనియర్ లెక్చరర్ పాత్రలో ఒదిగిపోయాడు ధనుష్. లెక్చరర్ పాత్ర కాబట్టి ఎలా పడితే అలా నటించడానికి ఉండదు. ఇక ధనుష్ కూడా ఎలాంటి హడావుడి లేకుండా ఆ పాత్రకు ఎంత కావాలో అంతే సెటిల్డ్ గా నటించి మెప్పించాడు. ఇక ఎమోషనల్ సీన్స్‌లో అయితే ఒదిగిపోయాడు. సంయుక్త మీనన్‌కు నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రే దక్కింది. ఇక సముద్రఖనికి కూడా ఇలాంటి పాత్రలు అలవాటైపోయాయి. తనకు అలవాటైన పాత్రలో మెప్పించారు. విలక్షణ నటుడు సాయి కుమార్ మరోసారి తనదైన నటనతో ప్రెసిడెంట్ పాత్రకు న్యాయం చేశారు. చాలా రోజుల తర్వాత ఆయనకు మంచి రోల్ పడిందనే చెప్పాలి. సుమంత్, హైపర్ ఆది తదితరులు వారి వారి పాత్రల్లో చక్కగా నటించారు.
టెక్నికల్ వాల్యూస్
సాంకేతిక విభాగానికి వస్తే జీవీ ప్రకాష్ అందించిన సంగీతం ఆకట్టుకుంటుంది. పాటలు బాగానే ఆకట్టుకున్నాయి.. ముఖ్యంగా మాస్టారు మాస్టారు సాంగ్ అలరిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. యువరాజ్ సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్స్ ప్లజెంట్‌గా ఉన్నాయి. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి.
ఓవరాల్ గా చెప్పాలంటే ఈసినిమా మంచి సందేశాత్మక సినిమా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఏదో ఒక వర్గం అని మాత్రమే కాకుండా ప్రతి వర్గం చూడాల్సిన సినిమా అని చెప్పొచ్చు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.