కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

సార్ ట్రైలర్ రిలీజ్

dhanush sir movie trailer out now, 2023 Latest Telugu Movie Trailer, 2023 Latest Telugu Trailers, 2023 Telugu Trailers, Danush, Danush Latest Movie, Danush Latest Movie Trailer, danush movies, Danush New Movie, Danush New Movie Trailer, Danush Sir, D

సార్ ట్రైలర్ రిలీజ్

Dhanush Sir Movie Trailer Out Now

dhanush sir movie trailer out now, 2023 Latest Telugu Movie Trailer, 2023 Latest Telugu Trailers, 2023 Telugu Trailers, Danush, Danush Latest Movie, Danush Latest Movie Trailer, danush movies, Danush New Movie, Danush New Movie Trailer, Danush Sir, D

తమిళ్ స్టార్ హీరో ధనుష్ ఇప్పటివరకూ తన సినిమాలను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తూ వచ్చారు. ఇక ఇప్పుడు డైరెక్ట్ గా తెలుగులోనే సినిమా చేస్తూ తెలుగు ప్రేక్షకులను అలరించడానికి వచ్చేస్తున్నాడు. వెంకీ అట్లూరీ దర్శకత్వంలో ధనుష్ హీరోగా వస్తున్న సినిమా సార్. ధనుష్‌ తెలుగులో నటిస్తున్న తొలి సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ఎప్పుడో మొదలుపెట్టారు కూడా. ఇప్పటికే పలు పోస్టర్లు, ఇంకా ఒక పాటలు, టీజర్ ను కూడా ఇప్పటికే రిలీజ్ చేశారు కూడా.

ఇప్పుడు తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం విద్యా వ్యవస్థలోని పరిస్థితులపైనా, అందుకు కారకులవుతున్న వారిపైనా ఒక లెక్చరర్ తిరుగుబాటే ఈ కథే అన్నట్టు అర్థమవుతుంది. ఎడ్యుకేషన్ లో వచ్చేంత డబ్బు పాలిటిక్స్ లో రాదు' .. 'డబ్బు ఎలాగైనా సంపాదించుకోవచ్చు .. కానీ మర్యాద అనేది చదువు మాత్రమే సంపాదించిపెడుతుంది' అనే డైలాగ్స్ ఆలోచింపచేసే విధంగా ఉన్నాయి.

కాగా ఈసినిమాలో ధనుష్ కు జోడీగా.. సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా సాయికుమార్,తనికెళ్ల భ‌ర‌ణి , నర్రాశ్రీను కీలక పాత్రల్లో నటించనున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ బ్యానర్ లపై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈసినిమాకు జి.వి. ప్ర‌కాష్‌కుమార్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా దినేష్ కృష్ణన్ పనిచేయనున్నాడు.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్