సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్న హీరోల్లో టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య కూడా ఒకరు. ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయమైన నాగశౌర్య మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆ తరువాత వరుసగా సినిమాలు చేసుకుంటూనే వెళుతున్నాడు. ఈమధ్యనే కృష్ణ వ్రింద విహారి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి డీసెంట్ హిట్ ను అందుకున్నాడు నాగశౌర్య. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు. శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా వస్తున్న సినిమా ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి. ఈసినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది. ఇక ఇప్పుడు ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. టీజర్ కూడా ప్లజంట్ గా ఉండి సినిమాపై అంచనాలను పెంచేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Our Phalana Abbayi
Phalana Ammayi teaser is out now😍#PAPA#PAPATeaserWatch Teaser Here👇https://t.co/jVbFgnnZO9@IamNagashaurya @iamMalavikaNair#SrinivasAvasarala @vishwaprasadtg@vivekkuchibotla @PSrividya53 pic.twitter.com/ftTYu0Gs9j
— People Media Factory (@peoplemediafcy) February 9, 2023
కాగా ఈసినిమాలో నాగశౌర్యకు జోడీగా మాళవిక హీరోయిన్ గా నటిస్తుంది. గతంలో నాగశౌర్యతో కలిసి ‘కళ్యాణ వైభోగమే సినిమా చేయగా ఇప్పుడు ఈసినిమాలో మరోసారి జతకడుతుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ పై టి.జి.విశ్వప్రసాద్, దాసరి పద్మజ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సునీల్ కుమార్ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: