ఇళయ దళపతి విజయ్ కు తెలుగులో ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే తన తమిళ్ సినిమాలను ఇక్కడ డబ్ చేసి మార్కెటింగ్ చేసుకుంటారు మేకర్స్. ఇక రీసెంట్ గా వారసుడు సినిమాను కూడా తెలుగులో రిలీజ్ చేసి మంచి సక్సెస్ అందుకున్నారు. ఈసినిమా తెలుగు డైరెక్టర్ దర్శకత్వం వహించడం విశేషం. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా వచ్చిన సినిమా వారసుడు. తమిళ్ లో వారిసు టైటిల్ తో రిలీజ్ అవ్వగా.. తెలుగులో వారసుడు టైటిల్ తో రిలీజ్ అయింది. తమిళంలో జనవరి 12న, తెలుగులో జనవరి 14న విడుదలైన ఈ సినిమాకి మంచి టాక్ వచ్చింది. ముఖ్యంగా తమిళంలో సూపర్ హిట్‌గా నిలిచింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ ను అందించింది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లను రాబట్టింది. ముఖ్యంగా తమిళ్ లో ఫుల్ రన్‌లో ఈ మూవీ రూ. 300 కోట్లుకు పైగా గ్రాస్‌ను వసూలు చేసి హవాను చూపిస్తోంది. తెలుగులోనూ ఇది బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకుని విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈసినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ద్వారా ఈసినిమా స్ట్రీమింగ్ లోకి వచ్చేసింది. ఈసినిమా ప్రస్తుతం తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళంలోనూ స్ట్రీమింగ్ అవుతోంది.
ఈసినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. ఇంకా ఈసినిమాలో శ్రీకాంత్, శ్యామ్, ప్రకాశ్ రాజ్, సంగీత, జయసుధ, ప్రభు తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు.ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్ తో తెరకెక్కించరు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందించాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: